సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం.

సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం

-పచ్చని తోరణంలా తెలంగాణ వికసించాలి

-వేముల మహేందర్ గౌడ్ పిలుపు
మొగులపల్లి నేటి దాత్రి:

 

జూన్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పకడ్బందీ కార్యాచరణ రూపొందించారని, అందులో భాగంగానే గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై..సామాజిక ఉద్యమంలా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి..పచ్చని తోరణంలా తెలంగాణ వికసించేలా కృషి చేద్దామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొక్కలే మనిషికి జీవనాధారమని, అలాంటి మొక్కలను నాటి..రేపటి తరానికి భవిష్యత్తును అందించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. నేడు కాలుష్యం అధికమై ఓజోన్ పొర రంద్రం పడడంతో తెలంగాణలో విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు ఒక యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి..కాలుష్య నివారణకు కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version