పనిగంటలు పెంచడమంటే కార్మికుల .!

పనిగంటలు పెంచడమంటే కార్మికుల వ్యక్తిగత జీవితాలను హరించడమే.

మందమర్రి నేటి ధాత్రి

పెట్టుబడిదారుల ఖజానా నింపడానికి కార్మికవర్గాన్ని బానిసలుగా మారుస్తారా?

రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని గంటలు పెంచుతు తెచ్చిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.

జీవో రద్దు చేయాలని నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు.

గందం రవి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు మందమర్రి డివిజన్ అధ్యక్షుడు.

రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారుల, కార్పొరేటర్ల ఖజానా నింపడానికే 10 నుంచి 12 గంటల పనిగంటలు పెంచుతు బిజెపి మోడీ ప్రభుత్వానికి తానేమి తక్కువ కాదన్నట్టు జీవో నెం 282 ను విడుదల చేశారు. కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మందమర్రి డివిజన్ పరిధిలోని రామకృష్ణపూర్ ఏ-జోన్ సివిక్ కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా గందం రవి ఎస్సీ కేఎస్ సిఐటియు డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ…
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే పనిభారం పెరుగుతుంది. చేసే పనికి వచ్చే వేతనాలకు గొర్రెతోక బెత్తెడు చందంగా మా వేతనాలు ఉన్నాయి. మరోవైపు రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవ్వని కలిసి ఇప్పటికే కార్మికుల బతుకులు ఆగమ్యగోచరంగా మారి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే, ఇవేవి పరిష్కరించకుండా, వేతనాలు పెంచకుండా పైగా 10 నుంచి 12 గంటల పని చేయాలని జీవో నెంబర్ 282 ను విడుదల చేయడమంటే కార్మిక వర్గంపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహారిస్తుందో అర్థం అవుతుంది. మమ్మల్ని బానిసలు, మా వ్యక్తిగత స్వేచ్ఛ జీవితాలను హరిస్తామంటే కార్మికులంత ఐక్యంగా రైతాంగ పోరాట స్పూర్తితో మరో మహత్తర పోరాటానికి సైతం సిద్ధమైతాము.
ఈ కార్యక్రమంలో శారధ, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, అంజలి, రవీందర్, సంపత్, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన.

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ నాయకులు

నిజాంపేట్, నేటి ధాత్రి

తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా కళాకారులూ టీ యన్ జి ఓ భవన్ లో 13 వ తేదీన నిర్వహించే పాటల పల్లకి 12 గంటలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.నిజాంపేట మండలానికి సంబoదించిన మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి వొళ్ళపు స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం లో సాంస్కృతిక సారథి లో 550 ఉద్యోగాలు ఇచ్చారు అందులో 200 మందికి పైగా ఆట పాట రాని కళాకారులకు అసలు ఉద్యమానికి సంబంధం లేని వారికీ ఉద్యోగాలు ఇచ్చారు రసమయి కి తెలిసిన వారికీ రసమయి కి నచ్చిన వారికీ ఉద్యోగాలు ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం సాంసృతిక సారథి నీ ప్రక్షాళన చేయాలనీ కోరుతూ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మెనిపెస్టోలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది . అందుకు ఇప్పుడు సాంస్కృతిక సారధిలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాటల పల్లకి ద్వారా విన్నవించడానికి ఈ పాటల పల్లకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అర్హులైన ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ పాటల పల్లకి కార్యక్రమాన్ని జిల్లాలున్న ప్రతి ఒక్క కళాకారులు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి ,పంజా మహేందర్, నసీరుద్దీన్ ,
వై వెంకటేశం, కాంగ్రెస్ నిజంపేట గ్రామ అధ్యక్షుడు బాబు, గరుగుల శ్రీనివాస్, కళాకారులూ దేవేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు.

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు…

చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

Sleeping Disorder: నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరం, మెదడు రెండింటికీ విశ్రాంతినిస్తుంది. కణాలను పునరుద్ధరిస్తుంది. వివిధ శారీరక, మానసిక విధులను మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బుల ప్రమాదం:

నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ప్రమాదం

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.

నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం

నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version