అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ.

అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ

నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోనే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి: నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి), అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు, వీరిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిదాత్రి:

గత వారం రోజుల నుండి సిరిసిల్లా జిల్లా చేనేత చౌక్ లో ప్రధాన రహదారిపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు.దీంతో
రహదారిలో వెళ్లే వాహనదారులకు గాని, బాటసారులకు గాని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చేనేత చౌక్ లో ఓల్డ్ బస్టాండ్ సమీప నా ఎక్కువ రద్దీగా జనసంచారం ఉన్న ప్రదేశంలో సిగ్నల్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక విడ్డూరమని చెప్పవచ్చు అని భావిస్తున్నారు. వాహనదారులకు గాని,బాటసారిలకు గాని ప్రమాదం తలెత్తకుండా వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version