ఫొటో వీడియో గ్రాఫర్ ఐక్యంగా వుండాలి..

ఫొటో వీడియో గ్రాఫర్ ఐక్యంగా వుండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహీర్ మండల పరిధిలో ని గుర్జి వాడ గ్రామం లో నిర్వహించిన్న కార్యక్రమం లో కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ అధ్యక్షులు రచ్చన్న మాట్లాడుతూ కోహీర్ మండల ఫొటో వీడియో గ్రాఫర్స్ కలిసి కట్టుగా వుంది పనిచేసుకోవాలన్నారు. మండలం లోని ఫొటో గ్రాఫర్స్ ఐక్యత లేకపోడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అన్నారు. ఐక్యంగా ఉండటం వల్లన కస్టమర్లవద్ద సరైన రీతిలో రేట్ తీసుకొనే అవకాశం ఉంటుంద్దన్నారు ఫొటో వీడియో గ్రాఫర్స్ లకు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకోవల్లన్నారు గుర్తింపు కార్డు లేకుండ కోహీర్ మండలో ఫొటో వీడియో లు తీస్తే కమిటీ వారిపై కఠినంగా చర్యలు తీసుకొంటుందని అయన హెచ్చరించారు. ఫొటో వీడియో గ్రాఫర్లకు ఈ ఎస్ ఐ కుటుంబ భరోసా. సౌకర్యం కల్పిస్తునమన్నారు ఈ కార్యక్రమం . మోహన్. లో ఫొటో వీడియో గ్రఫీ వ్యవస్థాప అధ్యక్షులు శ్యామ్ రావ్ రాజు పరమేశ్వర్ కృష్ణ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.

జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి.

జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి

జిఓ నెంబర్ 49 రద్దు చేయకపోతే కార్మికవర్గాన్ని కలుపుకొని ఐక్య పోరాటాలే…

బడాపెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగానికేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా…

గందం రవి, పెద్దలచ్చన్న
సిఐటియు మందమర్రి మండల నాయకులు.

ఈరోజు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ లో భాగంగా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో సింగరేణి సివిక్, రైల్వే సైడ్ అడ్డలలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు అధ్వర్యంలో నిరసన,జీఓ కాఫీల ధగ్దం చెయ్యడం జరిగింది.


బీజేపీ మోడీ ప్రభుత్వం ఆదివాసీ,
పేదలను వారి గ్రామల నుంచి,భూముల నుంచి వెళ్లగొట్టడం కోసం అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది.వీటిని రాష్ట్రంలో అమలు జరపడం కోసం బిజెపి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీఓ నంబర్ 49 తీసుకురావడం జరిగింది. ఈ జి ఓ అమలు జరపడం కోసం దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తున్నది.దీని వలన 339 గ్రామాలు,3 లక్షల ఎకరాల భూమిని ఆదివాసీలు,పేదలు కోల్పోవడం జరుగుతుంది.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కవ్వల్ టైగర్ జోన్,ప్రాణహిత కృష్ణ జింకల ప్రాంతం,శివ్వారం మొసళ్ళ కేంద్రం పేర్లతో ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఆదివాసీలకు,పేదలకు వ్యతిరేకంగా, వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసేలా ఉన్నాయి. అలాగే కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు, బడాపెట్టుబడిదారులకు బానిసలను చేసే కుట్రలను కూడా బిజెపి మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఆదివాసీ, గిరిజన, పేదలే కాకుండా కార్మికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాలను విరమించుకోకుంటే ఐక్య
పోరాటాలను ఉధృతం చెయ్యడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్దలచ్చన్న, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేషశ్వర్ రావు, నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు.

వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు

వనపర్తి: నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి
మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా
షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక.

పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు.

పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక.
వనపర్తి నెటిదాత్రి:

వనపర్తి పాత బస్టాండ్ పున ప్రారంభించడానికి అధికారులు కాంట్రాక్టర్ పని ప్రారంభించడంతో, మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాతబస్టాండ్ లో
పనులు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి వివిధ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల పక్షాన ఉంటుందని ప్రజా సమస్య ఉన్నచో అక్కడ పోరాటం మొదలవుతుందని అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. పాత బస్టాండ్ ను ప్రయాణికులకు ఉపయోగ ములో కి వస్తూన్నదుoకు ఆర్ టి సి అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ రాష్ట్ర టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, పుట్టపాకల బాలు రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version