4 లెబర్ కోడ్ లు అంటేనే కార్మికవర్గానికి బానిస

4 లెబర్ కోడ్ లు అంటేనే కార్మికవర్గానికి బానిస ఉరికంబాలు

మందమర్రి నేటి ధాత్రి

లెబర్ కోడ్ లను రద్దు చేయాలని నినాదాలతో హోరెత్తిన నిరసనలు

బిజెపి మోడీ ప్రభుత్వానికి మీమేమి తక్కువ కాదని పనిగంటలు పెంచిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

బడా పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలను చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందే.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గం

సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహరం.

దూలం శ్రీనివాస్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.

కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు కట్టు బానిసలు చేయడానికి బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో అన్ని విభాగాలకు చెందిన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు ముందు నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి, బస్టాండ్ సెంటర్లో మానవహారంగా లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పని గంటలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, కాసర్ల రాజలింగు తెలంగాణ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…

 

 

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం మొదటి నుండే కార్మిక వర్గంపై అనేక విధాల కర్కషత్వాన్ని పరిదర్శిస్తూ చివరకు విదేశీ, స్వదేశీ బడ పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా, పనిచేసే యంత్రాలుగా అప్పజెప్పడానికే ఈ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగింది. లెబర్ కోడ్ ల అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ బడా పెట్టుబడిదారుల ఖజాన నింపాలని మోడీ ప్రభుత్వం ఊవ్విర్లు ఊరుతుంది. బిజెపి మోడీ ప్రభుత్వానికి మేమేం తీసిపోమన్నే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈనెల 5వ తేదీన 10 నుంచి 12 గంటల పని గంటలు పెంచుతూ 282 జీవోను విడుదల చేసింది. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాల జెండాలు వేరు కావచ్చు, కానీ వారి ఎజెండా మాత్రం ఒక్కటే అనేది ఆచరణలో నిరూపించారు.

 

 

 

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే, 4 లెబర్ కోడ్ లను రద్దు చేయకుంటే రైతాంగ పోరాట స్పూర్తితో పోరాటాలను తీవ్ర స్థాయిలోకి తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి. నిర్మల, సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గందం రవి, రమేష్, మందమర్రి మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యం. నర్సయ్య, జి. ఐలయ్య, మున్సిపల్ నాయకులు సంగి పోషం, ప్రసాద్, లింగంపల్లి రవి, పోసు, లత, రజిత, ఎస్సీ కేఎస్ సిఐటియు నాయకులు తిరుపతి, రాయమల్లు, కళ, లక్ష్మి, పద్మ, రాజేశ్వరి, రవీందర్, వెంకటేష్, తిరుపతి, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version