మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు..

మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధ్యక్షులు అల్లే రాజు మాట్లాడుతూ వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎఫ్డీఓ నాగమణి ఆదేశాల మేరకు కుల సంఘం ఆవరణలో, పెద్దమ్మగుడి వద్ద పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్,ముదిరాజ్ కుల పెద్దమనిషి అల్లే పైడి కార్యదర్శి పెండ్యాల రవి,
కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నంబర్ మేకల రాజు,మాజీ కుల పెద్దమనిషి పెండ్యాల బిక్షపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కుల పెద్దమనిషి పెండ్యాల మల్లేశం, మేకల రవి,అటెండర్ అల్లే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా..

అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా

‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని…

‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. అలాంటి పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను’ అని అన్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘ఒక సినిమా చేయడమంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. ప్రాంతీయ స్థాయి సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏ.ఎమ్‌.రత్నం. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రత్నం పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిపాదించాను. ఆయన నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. ‘భీమ్లానాయక్‌’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టిక్కెట్లు వందల్లో ఉంటే, నా సినిమాకు పదుల్లో ఉండేవి. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించను. అసలు నేను యాక్టర్‌ అవ్వాలనే కోరుకోలేదు. ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచన తప్ప నాలో ఏం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు, ఫ్లాప్స్‌ కాకుండా నేను అభిమానులు చూపే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్‌ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి ఐదు రోజుల్లో రోజూ రెండు గంటలే కేటాయించినా, దానికి తగ్గట్లు వర్క్‌ చేసిన టీమ్‌ కృషి వెలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్స్‌ కోసం నిధి అగర్వాల్‌ ఎంతో కష్టపడ్డారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి.

ఈ సినిమా సబ్జెక్ట్‌ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ ఉపయోగించిన క్లైమాక్స్‌లో 18 నిమిషాల ఫైట్‌ కంపోజ్‌ చేశా’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ‘ఽ17వ శతాబ్దం మొఘల్స్‌ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా’ అని చెప్పారు. నిర్మాత ఏ.ఎమ్‌ రత్నం మాట్లాడుతూ ‘‘నేను ఇన్ని సినిమాలు నిర్మించినా, ఇది చాలా స్పెషల్‌. ఇందులో పవన్‌కల్యాణ్‌ విశ్వరూపం చూస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది’’ అని తెలిపారు. నిర్మాత దయాకర్‌ రావు మాట్లాడుతూ ‘‘అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా ఉండబోతోంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదం అందివ్వబోతున్నాం’’ అని చెప్పారు. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌తో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణం రాజు, కర్టాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ కండ్రే, నటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు పాల్గొన్నారు.

భారతీయ సినీరంగం గర్వించే విషయం.

భారతీయ సినీరంగం గర్వించే విషయం…

 

హీరో కమల్‌ హాసన్‌ ఆస్కార్‌ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే…

హీరో కమల్‌ హాసన్‌ ఆస్కార్‌ కమిటీలో సభ్యుడిగా ఎంపికవ్వడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినీరంగం గర్వించే విషయమని ప్రశంసించారు. ‘‘ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా పద్మభూషణ్‌ కమల్‌ హాసన్‌ ఎంపికవ్వడం భారతీయ సినీరంగం గర్వించదగ్గ విషయం. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన నటుడిగా, దర్శకుడిగా, కథకుడిగా భారతీయ, ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేశారు. సినిమా మేకింగ్‌ విషయంలో ఆయనకు ఉన్న పట్టు స్ఫూర్తిదాయకం. ప్రపంచ సినిమాకు ఆయన ఇలాగే మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, ‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్‌ నుంచి కమల్‌ హాసన్‌తో పాటు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, దర్శకురాలు పాయల్‌ కపాడియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ మాక్సిమా బసు ఉన్నారు. హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వీరు పాలుపంచుకోనున్నారు. 

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి సినిమా రంగంలో రాణింపు.

‘వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినిమా రంగంలో రాణింపు’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి.

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బోయిన్ పల్లి శేఖర్ గౌడ్ వ్యవసాయ కుటుంబం. శ్రీశైలం హైవేలో కొంతకాలం హోటల్ నిర్వాకుడిగా పనిచేశాడు. అనంతరం అంది వచ్చిన అవకాశంతో.. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్ గా మిత్రుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి పనిచేశారు. ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలయ్యింది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, సినిమా రంగంలో రాణించడంతో బంధువులు, స్నేహితులు శేఖర్ గౌడ్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version