కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.

కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ

జైపూర్ నేటి ధాత్రి:

 

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,ఫీల్డ్ సూపర్ వైసర్ రాజేష్,వాచర్ లు శంకర్,సాయికిరణ్, రాకేష్,గ్రామస్థులు పాల్గొన్నారు.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన

మందమర్రి నేటిధాత్రి

 

 

మందమర్రి పట్టణం
శ్రీపతి నగర్ 15 వ వార్డ్
ఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
గౌరవ చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గత రెండు రోజుల క్రితం శ్రీపతి నగర్ లో పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు కరెంట్ ఫోల్స్ – వీడి దీపాలు- కరెంటు – సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
వెంటనే వివేక్ స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ నీ ఆదేశించిన సందర్భంలో
ఈ రోజు శ్రీపతి నగర్ లో ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వార్డు బాధ్యులు పైడిమల్ల నర్సింగ్ శ్రీపతి నగర్ లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి కరెంట్ సమస్యలను ఎన్ని ఫోన్స్ అవసరం ఉంటాయి. స్ట్రీట్ లైట్లు ఎన్ని అవసరం ఉంటాయి. ఎన్ని సార్లు కరెంటు పోతుందని. తెలుసుకొని ఎమ్మెల్యే వివేక్ గారి సహకారంతో తొందరలోనే ప్రజల కరెంటు కష్టాలు తీరుస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
ఏఈ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మంద తిరుమలరెడ్డి.
ఎద్దు వెంకటాద్రి.
భోగి వెంకటేశ్వర్లు.
రామస్వామి సోమయ్య. సురేందర్..
కుండే రామకృష్ణ.
శనిగారపు చంద్రయ్య తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు

బగుళ్ల దేవస్థానం విద్యుత్ దీపాల పనులు ప్రారంభించిన విద్యుత్ అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బగుళ్ళ దేవస్థానం విద్యుత్ దీపాల పనులను విద్యుత్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మండల విద్యుత్ అధికారి హనుమాన్ దాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ తాజా మాజీ సర్పంచులు మేడగుని సతీష్ గోవిందుల సదానందం యువత అధ్యక్షులు కలవైన దేవరాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version