కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…
చందుర్తి నేటిధాత్రి:
ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..