విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 

పరకాల నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,ఏఎంసీ చైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,అలీ,దార్నా వేణు,ఒంటెరు శ్రవణ్,మచ్చ సుమన్,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాఘవ,వెంకటేశ్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం

పరకాల నేటిధాత్రి:

 

గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు.

పరకాల నేటిధాత్రి
2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరకాల నుండి జి రవితేజ 453 మార్కులు మరియు జడ్పి.హెచ్ఎస్ వెల్లంపల్లి నుండి చిన్నారి 370 మార్కులు సాధించిన సందర్బంగా విద్యార్థులకు పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు తమ తల్లి తండ్రి పెద్ది బాలమణి చంద్రమౌళి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉపాధ్యాయునిగా పని చేస్తూ మరణించినందున.

ఈ ఉద్యోగం వచ్చింది అని తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా,విద్యార్థులకు తన స్థాయికి తగిన విధంగా సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల విద్యాశాఖ అధికారి ఎస్ రమాదేవి,మండల నోడల్ అధికారి నామిని సాంబయ్య కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మధు,సిహెచ్ సురేందర్ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని అనునిత్యం విద్యాశాఖకు వెన్నుదన్నుగా నిలిచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీవోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, విద్యార్థులు విద్య ద్వారా మాత్రమే పురోగతి సాధించగలరని మరియు సమాజంలో మంచి పౌరులుగా నిరూపించుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటే వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలనే తన దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశానని ఆయన అన్నారు. ఈ చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కె. ప్రసాద్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం

జైపూర్ నేటి ధాత్రి:

 

shine junior college

జైపూర్ మండలం ఇందారం 4 అంగన్వాడీ కేంద్రం లో సామూహిక అక్షరాభ్యాసాలు చేపట్టి మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడి సెంటర్ కి పంపించాలని పిల్లల తల్లి తండ్రులకు సూచించారు.ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అంగన్వాడి కేంద్రం లో ప్రతీ నెల పిల్లల ఎత్తు,బరువు,పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పిల్లలకు పోషకాలు కల్పించే ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ వెంకటస్వామి,స్వప్న, వివో అధ్యక్షురాలు రాజేశ్వరి, ఏఎన్ఎం కృష్ణవేణి,అంగన్వాడి టీచర్స్ కళ్యాణి,నళిని,పిల్లలు, తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న జి యు పి ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నూతన పుస్తకాలు, దుస్తులను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు శానవాజ్ ఖాన్, గోరటి శ్రీనివాసులు,నాయకులు సాబేర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు.

మల్లాపూర్ జూన్ 12 నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని మొగిలిపేట మండల పరిషత్ ప్రైమరీ. పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యా యులు రాజేందర్, సుమిత్ర దేవి, కృష్ణవేణి, ఆఫీస్ సభర్డినేట్ రాకేష్, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.

 

Provide quality education to students

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి : 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి:

 

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల
10 వ మరియు ఇంటర్ లో
ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025
వారికి ఎబివిపి ఆద్వర్యం లో
అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని
కావున జిల్లా లోని
విద్యార్థులు పేరు నమోదు
చేసుకోవాలని,నమోదు కొరకు 7287920310…సంప్రదించాలి అని ఒక ప్రకటనలో తెలిపారు

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను.

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రెండవ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు & మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జంగేడు ఉపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 551/600 సాధించిన విద్యార్థి కె. అజయ్ ను సన్మానించారు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్య ఆరోగ్యం న్యూట్రిషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలు విద్యాసంస్థలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వాటి యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ అంశాలపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందించాలని సూచించారు, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక తదితర అంశాలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిందని తెలిపారు, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించాలని ప్రచారంతోపాటు బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, ప్రతి ఒక్కరూ స్వయం సహాయక బృందాలు,మెప్మా తదితర మహిళా సంఘాలు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు, ప్రభుత్వ సూచించిన ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు, అనంతరం ఉపాధ్యాయులు చేపట్టిన ఇంటింటి బడి ఈడు పిల్లలను గుర్తించే కార్యక్రమంలో పాల్గొని బడి ఈడు పిల్లలు గ్రామస్తులతో చదువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు విద్యార్థులను చదువు వైపు మళ్ళించే విధంగా చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అజ్మీర దేవా, జిల్లా సామాజిక సమన్వయకర్త సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రణాళిక సమన్వయకర్త దుప్పటి రాజగోపాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు ప్రధానోపాధ్యాయులు అశోక్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, విద్యావంతులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పురస్కారాలు.

విద్యార్థులకు.. పురస్కారాలు

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ కల్వకుర్తి మండలంలోని,
పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పదవతరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక సంతోష్ యువజన విభాగం అధ్యక్షుడు సంబు తరుణ్ కుమార్ ఆద్వర్యంలో మెమెంటో లతో సన్మానం కార్యక్రమం నిర్వహిoచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా దేశానికి ముందు నడపాలని విద్యార్థుల చేతుల్లోనే దేశ బాధ్యత ఉంటుందని ఇలాగే చదివి మంచి ప్రతి కనబడచాలని మరి అబ్దుల్ కలాం లాగా దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండలం అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, వాస శేఖర్ ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ మహాసభ నాయకులు, ఆర్యవైశ్య సంఘం మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

మహిళలు విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు,విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ గారు

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మే నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,06 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులు జూనియర్, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ విభాగంలో పెయింటింగ్, వ్యాసరచన రాసి 63090 07828 నెంబర్ కు వాట్సప్ ద్వారా జూన్ 3 లోపు పంపాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, ఫోన్ నెంబర్, గ్రామం తప్పనిసరిగా రాయాలన్నారు.

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని.!

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రెటరీ మారేపల్లి మల్లేష్.

చిట్యాల నేటిధాత్రి :

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి 12 జూనియర్ కళాశాలను మూసివేయడానికి కుట్టలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేస్తున్నా ము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగులాంబ గద్వాల కరీంనగర్ చొప్పదండి ఖమ్మం మహబూబాద్ సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జనగాం మేడ్చల్ మల్కాజిగిరి ఈ 12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరికాదన్నారు విషయం సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియపరుస్తాం అలాగే 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి తెలియక ఆందోళన చెందుతున్నారని వాపోయారు ఆమె నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్విత సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయన్నారు 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసివేయడం వల్ల సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారన్నారు. ఈ విషయాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version