పాలీసెట్ ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ.

పాలీసెట్ ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ

గంగాధర నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

శనివారం విడుదలైన పాలీసెట్ ఫలితాలలో సురభి కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన MD. అస్రార్ అయాన్ పాలీసెట్‌లో 120కు గాను 114 మార్కులు సాధించి 106వ ర్యాంకును పొందాడు. అదే విధంగా M. హృశికేశ్120కు గాను 108 మార్కులు సాధించి 396వ ర్యాంకును అందుకున్నారు. ఈ ర్యాంకులను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందించింది. విద్యార్థుల కృషిని, అధ్యాపకుల సహకారాన్ని, తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని వారు కొనియాడారు.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మేధా చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన కొండూరు విద్యార్థులు.

“రాయపర్తి, నేటిధాత్రి*

 

 

మేధా చారిటబుల్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ లో జెడ్ పి హెచ్ ఎస్ కొండూరు పాఠశాల విద్యార్థులు గంకిడి సాయి వర్ధన్, బొబ్బల వర్షిత్ రెడ్డి లు సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత తెలియజేశారు. వీరికి శ్రీ మేధా ట్రస్ట్ నుండి సుమారు మూడు నుండి నాలుగు లక్షల విలువైన రెండు సంవత్సరాల ఉచిత విద్యను ప్రఖ్యాత నారాయణ, శ్రీ చైతన్య కాలేజిలలో అందిస్తారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఆచార్యులు, సత్యనారాయణ, రఘు, నాగరాజు, వెంకటరమణ, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్య నాయక్ , స్వామి, అమర స్వర్ణ ,శివకృష్ణ  అభినందించారు.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

◆ వందశాతం ఉత్తీర్ణత.● శ్రీనిధి విద్యార్థినికి 586 మార్కులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కన బరిచారు. పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల చెందిన విద్యార్థినికి శ్రీనిధి 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్, ఝరాసంగం తహసిల్దార్ తిరుమలరావు, కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు కేవీడీ పవన్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా .!

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం.

మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జడ్.పి.హెచ్.ఎస్ చిట్యాల పాఠశాల ఆవరణలో 6-9 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ కొడపాక రఘుపతి , సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో గ్రామంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల శారీరక, మానసిక,వికాసం కొరకు ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, యోగ, కథల పుస్తకాలు చదవడం మొదలగు వినోద కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,పోషక విలువలు కలిగిన స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచామని వీటిని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు విద్యార్థులందరూ ఉదయం8గం నుండి 11వరకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, బొమ్మ రాజమౌళి , బుర్రసదయ్య గోపగాని భాస్కర్,సిఆర్పి రాజు, కనకం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి .!

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి
.
విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని
మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని
టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక బృందం , వసతి సౌకర్యాలు ,హాస్టల్ సౌకర్యాలు పరిశీలించిన తరువాత కళాశాలల్లో చేరాలని, అసౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలలో చేరి న వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులు పడవద్దని కళాశాల వారికి సూచించారు . విద్యార్థుల సలహాల కోసం తెలంగాణ విద్యార్థి పరిషత్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని అయిన తెలిపారు 7386820819,9959395310 లకు ఫోన్ చేయాలని విద్యార్థులకు సలహాలు ఇస్తామని అన్నారు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట

#అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.

#మధ్యవర్తులను నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు.

# కాలేజీ చైర్మన్ నీ కలిసిన తరువాతనే అడ్మిషన్ తీసుకోవాలి.

మంద సురేష్ బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ,నేటిధాత్రి:

 

 

గ్రామలలో ఇంటింటి ప్రచారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యంత్రం ఉపాధ్యాయులకు లక్ష్యంగా నిర్దేశం కరపత్రాలు బ్రోచర్ల పంపిణీ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులకు టార్గెట్ నిర్దేశిస్తున్నాయి ఆ లక్ష్యం వాళ్లను సాధించేవరకు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు తమ పాఠశాల ప్రత్యేకతలు విశిష్టతను వివరిస్తూ ఆకాశాన్నియమైన బ్రోచర్లు కరపత్రాలను పంచుతున్నారు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం వెనుక ప్రచారాల తలపిస్తుంది ప్రతి ఒక్కరూ 10 నుండి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు టార్గెట్ విధించారు దీంతో వారు ఉదయం ఏడు గంటల నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ ప్రదక్షణం కొరబడినందున ఆరోపణలు ఉన్నాయని ఫీజులు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోలను అమలు చేయడంలో లేదు అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా అర్హత లేని వారితో బోధనలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అని మంద సురేష్ ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని అధికారులపై మండిపడ్డారు.

నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు !

నలబై ఆరు విద్యార్థుల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని కల్పించిన సదిశ

కరీంనగర్, నేటిధాత్రి:

 

సదిశ ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా మూడు రాష్ట్రలల్లోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ రెండు సంవత్సరాల చదువుకు అయ్యే ఫీజు, హాస్టల్ వసతిని పూర్తిగా ఉచితంగా అందచేయటం జరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా సదిశ మాథ్స్ టాలెంట్ టెస్ట్ 2024 నవంబర్లో నిర్వహించిన పరీక్షలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జోన్ లో ప్రథమ స్థానంలో నిలిచిన నలబై ఆరు మంది విద్యార్థులను ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కళాశాలలో చేర్పించామని సదిశ ఫౌండేషన్ చైర్మెన్ గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్, జోన్ ఇంచార్జి లు పవన్ , రవి, నరేంద్ర సింహా, సతీష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ గలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచితంగా విద్యను అందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సదిశ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్.!

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. జహీరాబాద్ నియోజకవర్గ రంజోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్, రవీందర్ రెడ్డి, బాబు, మాజీ ఎంపిటిసి ఖలీల్, నాయకులు చంద్రన్న, గుండారెడ్డి, రాజు, మల్లేష్, రవి, శశి, షబ్బీర్, మస్తాన్, సర్దార్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, దత్తు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం .

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రభుత్వం ప్రకటించిన పదవి తరగతి పలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈవిద్యా సంవత్సరం కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర హై స్కూల్ లో 95 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 500 పైగా మార్కులు 63 మంది విద్యార్థులు సాధించారు. 550కిపైగా 22 మంది విద్యార్థులు సాదించారు. అత్యధిక మార్కులు సాధించిన జి.మనస్విని 568, టి.తేజ 562, ఈ.సాక్షిత 560, కే.మమత 559, ఎల్.కార్తీక్ 558, విద్యార్థులను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ విద్యార్థులను పుష్పగుచ్చములతో అభినందించిన అనంతరం మునిందర్ మాట్లాడుతూ 500 పైన మార్కులు జిల్లా స్థాయిలో ఎక్కువ మంది అక్షర విద్యార్థులే సాధించడం గొప్ప విజయమని విద్యార్థులను కొనియాడారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ .

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల.!

అద్భుతమైన ఫలితాలు సాధించిన మామిడి గి పాఠశాల విద్యార్థులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిగి లో మొత్తం 30 మంది విద్యార్థులు ఈ సారి పదవ తరగతి పరీక్షలకు హాజరైనారు. అందులో 30 మంది విద్యార్థులు కూడా పాసైనారు గత సంవత్సరం లాగా ఈసారి కూడా పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించడం జరిగింది.

Students

 

A1 గ్రేడ్ సాధించిన విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. 500 లకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 లో 19 మంది విద్యార్థులు ఉన్నారు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.

పదో తరగతి ఫలితాల్లో.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో 10వ తరగతి విద్యార్థులు సత్తా చాటారు. అమృత 576/600, స్పందన 571/ 600, నందిని 571/600, జోత్స్న 569/600, మౌనిక 569/600 మార్కులు సాధించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కష్టించి వ్యవసాయం చేసి జీవిస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి అత్యధిక మార్పులు సాధించటంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, మరియు అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని అధ్యాపక బృందం ఆకాంక్షించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 55 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సింధు 503/600 మార్కులు సాధించింది. మండలంలోని 10 పాఠశాలల్లో.. మొత్తం 528 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 477 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రోబెల్ మోడల్ హైస్కూల్ వెల్లడించిన ఎస్ఎస్సి రిజల్ట్ లో విద్యార్థుల మార్కులు 561 బి సిరిచందన 550 డి దీపాన్విత 541 బి దీక్ష 532 కె నిహారిక 521 జి వైష్ణవి మార్కులు సాధించారు
500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది.
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల
గత 20 సంవత్సరాల నుండి మండలంలో కార్పొరేట్ కు దీటుగా అగ్రగామిగా నిలుస్తున్న ఏకైక పాఠశాల ప్రొబెల్ మోడల్ హై స్కూల్ అధిక మార్కులు సాధించిన భాష బోయిన సిరి చందనను సన్మానించిన ప్రొఫైల్ మోడల్ యజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు.

మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు. మాట్లాడుతూ మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక ఫలితాలు సాధించినందుకు గర్వంగా ఉందని అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులలో.MPC. విభాగంలో. G. సిరి.T. శైలజ. 470 మార్కులకు గాను. 462. ప్రథమ స్థానంలో నిలిచారని.Bipc. విభాగంలో.P. అనూష 400. మార్కులు గాను.CEC. విభాగంలో.E. ప్రణీత. 400. మార్కులు గాను ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచారని. ద్వితీయ సంవత్సరంలో.M. అంజన. 932.M. హర్షిత. 931. ఎంపీసీ. బైపిసి. సిహెచ్. శ్రీజ. 894. ల.తో. ప్రథమ స్థానం నిలిచారని. సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు ఇక ముందు కూడా మోడరన్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని చదువులో చక్కగా రానించి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ (మోడల్) ఆదర్శ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. సిఈసి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో భోగ శ్రీజ 494/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఎంపిసి విభాగంలో పుట్ట హాసిని 448/470, అదరలేని వైష్ణవి 427/470, మ్యాడారం అంజనీ సామ్య 415/470, బైపిసి విభాగంలో ఎన్.జ్యోతి 389/440, జాడి హరిణి 350/440, గడ్డం నవ్య 342/440, సిఈసి మొదటి సంవత్సరంలో భోగ అర్చన 477/500, కూన రేణుక 462/500 మార్కులు, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపిసిలో కే.మహేశ్వరి 934/ 1000, ఎస్.సాయి ప్రణవి 896/1000, బైపిసిలో సిహెచ్.శ్రీవిద్య 893/1000, ఎమ్.ప్రణవి 829/1000, సిఈసిలో ఈ.కార్తిక్ 955/1000, కే.శ్రావణి 873/1000 మార్కులు సాధించి రామడుగు మోడల్ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుల బృందం, తదితరులు అభినందించారు.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు.

సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version