బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

 

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం సతీమణి బాల్నే చంద్రకళ సంవత్సరీకం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాల్నే సర్వేశంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, పట్టణ ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

ఎంపిడిఓకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం

పరకాల నేటిధాత్రి:

 

గత సంవత్సరం పదవ తరగతిలో పరకాల మండలంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా నగదు పారితోషకం అందచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు.

పరకాల నేటిధాత్రి
2024,25 విద్యా సంవత్సరం లో పట్టణంలోని బాలికల పాఠశాల నుండి ఎం.వర్షిత 557,జడ్పిహెచ్ఎస్ నాగారం,వి.విజ్ణేష్ 530ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిహెచ్ అజయ్ 455 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరకాల నుండి జి రవితేజ 453 మార్కులు మరియు జడ్పి.హెచ్ఎస్ వెల్లంపల్లి నుండి చిన్నారి 370 మార్కులు సాధించిన సందర్బంగా విద్యార్థులకు పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు తమ తల్లి తండ్రి పెద్ది బాలమణి చంద్రమౌళి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉపాధ్యాయునిగా పని చేస్తూ మరణించినందున.

ఈ ఉద్యోగం వచ్చింది అని తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా,విద్యార్థులకు తన స్థాయికి తగిన విధంగా సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల విద్యాశాఖ అధికారి ఎస్ రమాదేవి,మండల నోడల్ అధికారి నామిని సాంబయ్య కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మధు,సిహెచ్ సురేందర్ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని అనునిత్యం విద్యాశాఖకు వెన్నుదన్నుగా నిలిచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీవోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల
సర్వపురం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమాన్ మహా యాగం మహోత్సవానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పూర్ణాహుతితో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తాంత్రిక పూజారి ప్రదీప్ కుమార్ గురుస్వామి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి, ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version