తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా!

తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా! ఫ‌స్ట్ లుక్ అదిరింది

కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది.

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రానికి తెర లేచింది. క‌న్న‌డ న‌టుడు కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి (Rishab Shetty) హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) నాగ‌వంశీ (Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌మౌళి శిష్యుడు ఆకాశ వాణి (Aakashavaani) మూవీ ఫేం అశ్విన్ గంగ‌రాజు (Ashwin Gangaraju) ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ బుధ‌వారం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ మూవీకి ది ల్యాండ్ బ‌ర్న్‌డ్ ఎ రెబ‌ల్ రోజ్ అనే క్యాప్స‌న్ ఇచ్చారు. 18 వ శ‌తాబ్ధంలో బెంగాల్‌లో జ‌రిగిన తీవ్ర ఉద్రిక్త‌ ప‌రిస్థితుల బ్యాగ్రౌండ్‌లో హిస్టారిక‌ల్ పీరియ‌డ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కునుంది.

ఇదిలాఉంటే ప్ర‌స్తుతం రిష‌బ్ (Rishab Shetty) తెలుగులో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ జై హ‌నుమాన్‌లో న‌టిస్తోండ‌గా ఛ‌త్ర‌ప‌తి శివాజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అంతేగాక‌ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార చాఫ్ట‌ర్ 1 మ‌రో నెల ప‌దిహేను రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఓటీటీకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.

ఓటీటీకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.

విజ‌య్ అంటోని క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా గ‌త నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి మంచి విజ‌యం సాధించిన క్నైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం మార్గ‌న్.

విజ‌య్ అంటోని (Vijay Antony) క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా గ‌త నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి మంచి విజ‌యం సాధించిన క్నైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం మార్గ‌న్ (Maargan). బ్రిగిడా సాగా (Brigida Saga), అజయ్‌ దిషాన్ (Ajay Dhishan), ప్రీతిక, సముద్రఖని (P. Samuthirakani) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. లియో జాన్ పాల్ (Leo John Paul) ర‌చించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విజ‌య్ అంటోని ఆయ‌న భార్య ఈ మూవీని నిర్మించారు. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు (OTT) వ‌చ్చేసింది. నిరంత‌రం వైవిధ్యమైన కథల‌తో సినిమాలు చేస్తూ వ‌స్తున్న విజ‌య్‌కు ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మంచి పేరును సంపాదించి పెట్టింది

క‌థ విష‌యానికి వ‌స్తే.. సినిమా ఆరంభ‌మే.. రమ్య అనే యువతి హత్యకు గురై నల్లగా తయారైన ఆమె బాడీ ఓ కాలనీలో చెత్త కుప్పలో దొరుకుతుంది. దాంతో ఈ కేసు దేశవ్యాప్యంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును డీల్‌ చేయడానికి ముంబై నుంచి ధ్రువ్‌ (విజయ్‌ ఆంటోని) అడిషనల్‌ డీజీపీగా హైదరాబాద్‌ వస్తారు. అయితే.. గ‌తంలో త‌న కూతురు సైతం అదే ప‌ద్ద‌తిలో మర్దర్ అవడంతో రమ్య కేసుపై మరింత దృష్టి పెడతారు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో అరవింద్‌ (అజయ్‌ దిశాన్‌) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెడతాడు. అరవింద్‌.. వల్ల అమ్మాయిల హత్యలకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ హత్యలు ఎవ‌రు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వాటితో అరవింద్‌కు ఉన్న లింకేంటి, అత‌నికి ఉన్న సూప‌ర్ ప‌వ‌ర్ ఏంటి? మోడల్‌గా వెన్నెల ఎవరు? పోలీసాఫీసర్‌ ధ్రువ కూతురు హత్యకు కారణమేంటి? ఈ కేసు ధ్రువ్‌ ఎలా ఛేదించాడ‌నేది మిగిలిన స్టోరి.

ఈ మార్గ‌న్ క‌థ‌.. రోటీన్ అనిపించినా న‌డిపించిన విధానం మాత్రం ఆత్యంతం ఆక‌ట్ట్ఉకుంటుంది. ఎక్క‌డా ఇగి స‌డ‌ల‌కుండా త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుంది, అస‌లు విల‌న్ ఎవ‌రు అనే పాయింట్‌ను చివ‌రి వ‌ర‌కు రివీల్ చేయ‌కుండా అఖ‌రులో ఇచ్చే ట్విస్టు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అధేవిధఃగా అర‌వింద్ క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అత‌ను ఉన్నంత సేపు సినిమా అమాంతం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అత‌ను క్లూస్ ఇచ్చే విధానం, జల స్తంభన విధ్య‌, వాటిని తెర‌కెక్కించిన విధానం ఆసక్తికరంగా తెర‌కెక్కించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి థ్రిల్ల‌ర్స్‌, క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ సినిమాలు ఇష్ట ప‌డేవారు ఎట్టి ప‌రిస్దితుల్లో మిస్స‌వ‌కూడ‌ని సినిమా ఇది. ఇంటిల్లిపాది క‌లిసి ఈ చిత్రాన్ని చూసేయ‌వ‌చ్చు. ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌ర క‌ర స‌న్నివేశాలు లేవు. ఈ వీకెంట్కు బెస్ట్ మూవీ ఇది. నో డౌట్‌.

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

 

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెల్సిందే. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇప్పుడు మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3’ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. తాజాగా టీమ్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు భారీస్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ న్యూ సీజన్‌ కోసం రెడీ గా ఉండండి అని టీజర్ లో చెప్పారు.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది

 

 

 

 

వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర ) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు.

ఇటీవ‌ల‌ బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ వంటి వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర (Naveen Chandra) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’ (Show time) తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు. కామాక్షీ భాస్కర్ల (Kamakshi Bhaskarla), సీనియ‌ర్ న‌రేశ్ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra ) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీ వినోద్‌రాజా సినిమాటోగ్రఫీ, శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.

ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై4 థియేట‌ర్‌లో విడుద‌లకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం ఓ ఈవెంట్ నిర్వ‌హించి రిలీజ్‌ చేశారు. ఈట్రైల‌ర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో ఇంట్లో అల‌ని స్నేహితుడు అనుకోకుండా చ‌నిపోవ‌డం, దీంతో హీరో ప‌క్క‌నే ఉండ ఏ లాయ‌ర్‌ను పంప్ర‌దించ‌డం, ఆపై పోలీసుల రాక‌తో ఇంత‌కు హ‌త్య చేసింది ఎవ‌రు అనే పాయింట్‌తో సినిమాను రూపొందించిన‌ట్లు ఉండి ఇట్టే ఆక‌ట్టుకుంటుంది.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ…

 

ప్రేమ‌లు హీరో నస్లెన్ మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా థియేట‌ర్లలో మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చింది.

ప్రేమ‌లు హీరో నస్లెన్ (Naslen) మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు క‌న్నా ముందే ఏప్రిల్ 10న కేర‌ళ‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. గ‌తంలో టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన ఖ‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి కేర‌ళ‌ నాట‌ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన డేట్ క‌న్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు

క‌థ విష‌యానికి వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అయితే ఇంట‌ర్ ఫలితాల్లో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు.ఇక రెగ్యుల‌ర్‌గా కాలేజికి వెళ్లి చ‌దువుకోవ‌డం మ‌న వ‌ళ్ల‌ కానీ ప‌ని అని డిసైడ్ అయి కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఫ్లాన్ చేస్తారు. ఈక్ర‌మంలో స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. ఈ నేప‌థ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్ర‌మంలో వారు ఆ ప‌ని స‌రిగ్గా చేయ‌లేక, సీరియ‌స్‌నెస్ లేక‌ బాక్సింగ్‌ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్స్ ఆడాల్సి రావ‌డంతో చివ‌ర‌కు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివ‌ర‌కు ఎలా ముగించార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్ష‌కుల‌కు తీరిక ఇవ్వ‌ని వినోదంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే మూవీలో ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. వారి చుట్టే క‌థ తిరుగుతూ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమ‌స్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌వ్విస్తారు.

ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్ష‌న్ సీన్ల‌తో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్క‌రు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డ‌ప్‌లు, వ‌చ్చేపాట‌, డైలాగులు సీటులో కూర్చోనియ‌కుండా న‌వ్విస్తాయి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు చోటివ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య సంద‌ర్భోచిత‌ కామెడీతో ఆల‌రిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం సినిమాకే హైలెట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.!

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు…

నేటి ధాత్రి / మర్చి 22

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో వింటేజ్ కంపెనీలో పని చేసే వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీను మూడు నెలల క్రితం కల్వకుర్తి పట్టణంలో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీలో పని చేసే తోటి స్నేహితులు శనివారం రూ.60 వేలు బాధితుడికి అందజేశారు. శ్రీను కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొంగల్ల జగదీష్, గంగదారి శ్రీశైలం, రౌతు శ్రవణ్ కుమార్, బాలకృష్ణ, అనిల్ గౌడ్, మట్ట నరేష్, మల్లయ్య, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version