గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం..

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గణపురం గ్రామ పంచాయతీలో పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.ఈ సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూగ్రామ ప్రజలు మీపై నమ్మకంతో గ్రామాభివృద్ధికి కష్టపడే వారిగ మిమల్ని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ
గ్రామ ప్రజలు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ తన మన బేధం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు.గణపురం మండలంలోనిగ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా మొదట పూజ కార్యక్రమం ప్రత్యేక పూజ నిర్వహించి సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు నెంబర్లు దేవుని ఆశీస్సులతో తమ పదవి బాధ్యతలను నిర్వహించాలని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గణపురం ఎంపీడీవో ఆధ్వర్యంలో గణపురం బుద్ధారం గాంధీనగర్ బురకాయల గూడెం మైలారం కర్కపల్లి లక్ష్మిరెడ్డిపల్లి చెల్పూరు గొల్లపల్లి వెంకటేశ్వర పల్లి పరశురాంపల్లి ధర్మారావుపేట్ బ స్వ రాజు పల్లి నగరంపల్లి సీతారాంపూర్ కొండాపూర్ అప్పయ్యపల్లి సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారంచేశారు.

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి..

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి

నూతి మల్లన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పి.ఎస్.హెచ్.ఎం.ఏ

ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి

 

ఉద్యోగులకు పి ఆర్సీ ని వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ లను విడుదల చేయాలనీ ప్రైమరి స్కూల్ హెడ్ మాస్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలగురించి విపులంగా చర్చించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించటం జరిగింది. ఈ ఎన్నికలో జిల్లా కమిటీ అధ్యక్షులుగా అచ్చ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మారెడ్డి , గౌరవ అధ్యక్షులుగా జంగా గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా జరుపుల సుధాకర్,కె. లక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎం. గంగాధర్,ఆర్. శ్రీనివాస్,జి. రవీందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్. కనకతార,సి. హెచ్. వాణి, ఏ. సుజాత మరియు ఆర్థిక కార్యదర్శిగా ఇ. రవీందర్, మీడియా సెక్రెటరీగా డి. భీమయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. లక్ష్మీనారాయణ, సెక్రెటరీలుగా ఎల్. రాజు, టి. వేణుగోపాల్, కె. తిరుపతి, కె. నాగరాజ్, బి.రెడ్డి, ఎల్. కిష్టయ్య,వి. రవీందర్, మహిళా కార్యదర్సులు గా పి. స్వరూప, ఎం. హేమలత,ఎల్ ధర్మవ్వ స్టేట్ కౌన్సిలర్లు గా ఎస్. నరసయ్య, జె. సుదర్శన్,పి. రమేష్,డి. వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించుట జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న మాట్లాడుతూ పిఆర్సిని ప్రకటించకుండా బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించటం ప్రభుత్వానికి సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తక్షణం స్పందించి పి ఆర్సీ మరియు ఐదు డి ఏ లు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనీ కోరారు. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మొత్తం సర్వీస్ కాలంలో వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు సాతల నరసయ్య,డి. శంకర్,నూతన కార్యవర్గ సభ్యులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు…

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉద్యోగులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగులు.
ప్రతి సంవత్సరం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగు లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు తెలిపారు.

 

 

ఖో ఖో క్రీడా లో సి హెచ్ ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్ టేకుమాట్ల, కబడ్డీ క్రీడకు గాన సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ తాడిచర్ల, వాలీబాల్ క్రీడకు గాని కే జ్యోతి ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, మహా ముత్తారం, కే మమత ఫిజికల్ డైరెక్టర్, జెడ్ పి హెచ్ ఎస్, పెద్దాపూర్, పాపికొండలు జి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్, జి పూర్ణిమ ,ఫిజికల్ డైరెక్టర్, జడ్.పి.హెచ్.ఎస్, మహాదేవపూర్ గర్ల్స్, కే మమత ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ పెద్దాపూర్, అథ్లెటిక్స్ క్రీడకి గాను సిహెచ్ సరస్వతి ఫిజికల్ డైరెక్టర్, హెచ్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజామ్ నగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చెస్ క్రీడకి గాను బీ.కొమలత, ఎస్ జి టి, ఎం పి పి ఎస్ కేశవాపూర్, స్పందన ,ఎస్ జి టి, ఎంపీపీ ఎస్ ఎల్కేశ్వరం.
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు క్రీడా శాఖ తరుపున అభినందనలు, జాతీయ స్థాయి లో జిల్లా కి క్రీడా లలో మంచి పేరు తేవాలి అని ఆకాక్షించారు.
సి హెచ్ రఘు, తెలిపారు

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనికిలు…

ఎన్.ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్..

కలెక్టర్ తనిఖీలతో అధికారులు,సిబ్బంది హడల్…

హాజరు పట్టికల పరిశీలించి సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు
అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్.ఐసి కార్యాలయ పనితీరు
బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు
మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై
మెమో లు జారీ చేయాలన్నారు.

 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను
చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు
వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version