క్రీడలు మానషిక ఉల్లాసానికి దోహదపడతాయి.
జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ల్లో, కళాశాల ల్లో విద్యార్థులు శారీరికంగా దృఢంగా, మానషికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి అని వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధారెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఔట్ డోర్ గేమ్ లు అనై కబడి, కోకో ,క్రికెట్ వీటితో పాటు ఇండోర్ గేమ్స్ అయిన క్యారమ్స్, చెస్ లు, క్విజ్ పోటీలు నిర్వయించి ప్రతి విజేత టీమ్ కి విన్నర్ ప్రైజ్ లు మరియు రన్నర్ టీమ్ లకు కూడా కప్ లు పథకాలు ఇచ్చి విద్యార్థులకు ప్రోత్సాహిస్తారు. చదువు తో పాటు చక్కని క్రమ శిక్షణ నతో విద్యార్థులు ఎదగాలని అధ్యాపక బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మారుతి రావు పాటిల్, డైరెక్టర్ లు అమర్నాథ్, సంజీవ్ రావ్,శశికాంత్ ,శంకర్ రావు,సంగన్న,శ్రీనివాస్,తదితరులున్నారు పాల్గొన్నారు.