సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

సేఫ్ జర్నీ.. ఈ విషయాలు తెలుసుకోని ప్రయాణించండి..

 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రయాణాలకు అనుకూలమైన రోజులు, దిశలను ఎంచుకోవడం ముఖ్యం. ఇలా ప్రణాళిక లేకుండా ప్రయాణించడం వల్ల కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీయవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణం అనేది జీవితంలో నిరంతర ప్రక్రియ. మతపరమైన తీర్థయాత్రలు, వ్యాపార లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం, మనం నిరంతరం ప్రయాణిస్తాము. అయితే, ఆధునిక జీవితంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రయాణాలు చేయడం సర్వసాధారణం. అయితే, ఇటువంటి ప్రయాణాలు కొన్నిసార్లు ఊహించని సంఘటనలకు దారితీస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. గతంలో, చాలా మంది ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి బయలుదేరే ముందు జ్యోతిషశాస్త్రం ప్రకారం తేదీ, సమయం, దిశను ప్లాన్ చేసుకునేవారు. కానీ నేటి కాలంలో ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా ప్రయాణాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రయాణించడానికి ఏ రోజులు మంచివి?

ప్రయాణం సంతోషంగా, విజయవంతంగా సాగడానికి కొన్ని రోజులు శుభప్రదంగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మతపరమైన కార్యక్రమాలు, దేవాలయాల సందర్శనలు, మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు లేదా ఏదైనా ఆధ్యాత్మిక, ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఉత్తమ రోజులు. ఈ రోజుల్లో ప్రారంభించే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.

చిట్యాల లో వైద్య శిబిరం

చిట్యాల లో వైద్య శిబిరం

ఏటూరునాగారం, నేటి ధాత్రి

కన్నాయిగూడెం మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ అభినవ్ గారి ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్త పరీక్షలను నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది 52 మందిని డాక్టర్ గారు పరీక్షించగా 12 మందికి రక్త పరీక్షలు చేయగా వారికి మలేరియా నెగిటివ్ గానే ఉంది ఇద్దరినీ బీపీతో బాధపడే వారిని మరియు థైరాయిడ్ తో బాధపడే వారిని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరిగిందిఇందులో ఇంటింటికి సర్వే చేయడం ఫ్రైడే కార్యక్రమం లో పాల్గొనడం, పాఠశాలను సందర్శించడం జరిగింది ఇందులో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పోషకాహార విలువలను గురించి వివరించడం జరిగింది ఇందులో నీతి అయోగ్ రవీష్, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత ఫార్మసిస్ట్ ఆఫీసర్ శారద , ఎన్ సి డి నర్సింగ్ ఆఫీసర్ అజ్మీరీ, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version