మండల పరిషత్ అధికారిగా భవాని
మహాదేవపూర్ నవంబర్ 10 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మండల పరిషత్ అధికారిగా భవాని బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారిగా ప్రసాద్ గతంలో విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్ వెళ్లడంతో మహాదేవపూర్ మండల పరిషత్ అధికారిగా భవాని నియామకం చేయగా మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది స్వాగతం పలకడంతో మండల అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పలువురు అధికారులు పాల్గొన్నారు.
