సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్…

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్

◆:- శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.

◆:- డీసీఎంహెచ్ చైర్మన్. మల్కాపురం శివకుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నాఫెడ్ వారిచే మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోయబీన్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు. మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్. ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు 5328/ రూపాయలు. కావున రైతులు దళారుల వద్దకు తీసుకోనిపోయి మోసపోకుండా రైతులు సోయబీన్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇట్టి అవకశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ది పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ , ఏడాకులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ రైతు బంధు ఆధ్యక్షులు ప్రభు పటేల్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభుపటేల్. సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్. అగ్రికల్చరల్ ఏవో వెంకటేశం ఏఈఓ వేద రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు,

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని అక్షయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాస్ మనువారాలి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ సీనియర్ నాయకులు కలీం,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,మొగుడంపల్లి జనరల్ సెక్రటరీ గోపాల్ దయా వాజీద్ అస్లామ్ రయిస్ తదితరులు.

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు…

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారికి జహీరాబాద్ సీనియర్ నాయకులు ముర్తజ తన యాక్టివా బండి పై ఎమ్మెల్యేను తీసుకొని ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ముర్తుజా, డివిజన్ నాయకులు ,మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T133728.466.wav?_=1

 

వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ ఎమ్మెల్యే

◆:- శాసనసభ్యులు మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్ (శ్రీ రామ్ నాగర్ ) లోని వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115143.728.wav?_=2

 

 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫిర్దోస్‌కు హరీష్ రావు సన్మానం…

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా..
“ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు.
కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.
ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది .
మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది.
గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు.
ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది.
కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు.
మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా.
ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు .
కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్…

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
ఝరాసంగం మండలం గినియర్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం అధ్యక్షుడు ఎం. వెంకటేశంతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జహీరాబాద్‌కు చేరుకుని బిజెపి పార్టీకి వీడ్కోలు పలికి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాణిక్ రావు మరియు డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా మెదక్ శివ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ఖాండ్వాను ధరించి ఆయనతో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా, పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూడాలని ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు షేక్ ఫరీద్, గుండప, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జహీరాబాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ నరసింహ, గౌర్ బి. సంగమేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై కమీషనర్ కు పిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T150608.575.wav?_=3

 

*డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు*

◆:- తుంకుంట – మోహన్

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

పంచాయతీలే పట్టుకొమ్మలు అనీ అందరు అనుకొంటారు. కానీ అవేవి ఈ అధికారులకు పట్టనట్టు వ్య వహరిస్తున్న తీరు పట్ల జిల్లా పంచాయతీ అధికారి మరియు జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు చేయడం జరిగింది.ఇటీవల పెన్ గన్ మరియు అనేక ప్రత్రికలలో వారిపైన వచ్చిన కథనాలను జోడిస్తూ పిర్యాదు చేయడం జరిగింది. అంతేకాక జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి పైన జిల్లా కలెక్టర్ కు వారిపై పిర్యాదు చేయడం జరిగింది.. అంతేకాక రాష్ట్ర ఎస్సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తమ్ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

Complaint to the Commissioner

 

జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు సైతం ఈ అధికారుల తీరు మార్చుకోవాలని ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల సస్పెండ్ అయినా ఒక బిసి కుల పంచాయతీ కార్యదర్శి కి తిరిగి కొన్ని రోజులకే పోస్టింగ్ ఇచ్చి దళిత జాతికి చెందిన పంచాయతీ కార్యదర్శి లు సస్పెండ్ అయి సంవత్సరమ్ గడిచిన నేటికీ వారికీ పోస్టింగ్ ఇవ్వడం లేదంటే ఈ అధికారులు ఎంత వివక్ష చూపితున్నారో అందరికి అర్ధం అవుతుంది.ఏ కారణం చేత అయినా సస్పెండ్ అయితే ఆరు నెలలకే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అనీ ఆదేశాల ఉన్నప్పటికీ ఈ అధికారులు పాటించకపోవడము అందరికి విస్మయానికి గురిచేస్తుంది.అంతేకాక దళిత పంచాయతీ కార్యదర్శులపైన ఎవరైనా పిర్యాదు చేస్తే ఈ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అనీ రిపోర్ట్ లు పంపుతున్నారు. అదే బీసి, ఇతర పంచాయతీ కార్యదర్శులపైన పిర్యాదు చేస్తే మాత్రం పట్టింపు చేయకుండా ఉంటున్నారు అనీ కమీషనర్ పిర్యాదు లో పేర్కొనడం జరిగిందనీ తెలిపారు.ఇటీవల తుంకుంట గ్రామంలో జరిగిన ఒక ఫారెస్ట్ భూమీ పంచాయతీ లో కూడా డివిజనల్ పంచాయతీ అధికారి అయినా అమృత దళితులపైన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనీ పిటిషనర్ లేఖ లో పేర్కొనడం జరిగింది.

Complaint to the Commissioner

 

దళితులకు రావాల్సిన భూమినీ రాకుండా తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చిన డి ఎల్ పీ ఓ మరియు డి పి ఓ పైన చర్యలు చేసుకొని మా తుంకుంట దళితులకు న్యాయం జరిగే వరుకు పోరాడుతనాని తెల్పడము జరిగింది.అంతేకాక జిల్లాలో దళితులపైన జరుగుతున్న వివక్షత పైన రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ కు కూడా పిర్యాదు చేస్తానాని దళితుల అభ్యునతి కొరకు పాటుపడుతనాని తెల్పడం జరిగింది.జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం లేక సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారానీ తెలిపారు. వెంటనే డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపైన ద్రుష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటట్లు చేయాలనీ పంచాయతీ రాజ్ కమీషనర్ కు తెల్పడం జరిగిందనీ తెలిపారు. ఇప్పటికైనా ఈ అధికారుల తీరు మారకుంటే ముఖ్యమంత్రి కి పిర్యాదు చేస్తానని తెల్పడం జరిగింది.

విచారణ పేరుతో కాలయాపన తగదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104839.140.wav?_=4

విచారణ పేరుతో కాలయాపన తగదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T113539.188.wav?_=5

 

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వేషన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి జెడ్పీటీసీ పండరినాథ్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ప్రభు పటేల్ డాక్టర్ నాగరాజ్ నర్సింలు
తదితరులు.

దళిత ఎమ్మెల్యే అవమానం – జహీరాబాద్‌లో ఉద్రిక్తత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-5.wav?_=6

దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారు

◆:- తీవ్రంగా ఖండించిన ఝరాసంగం దళిత నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఫ్రెండ్స్ ఫంక్షనల్ లో నిరుపేదలకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలను ఇవ్వడం గురించి సభ నిర్వహించడం జరిగింది అక్కడికి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వెళ్లడం జరిగింది అక్కడ అధికార సభ కాబట్టి స్థానిక అధికారులు సమక్షంలో నిర్వహించాలి కానీ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకునితో సభ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఎమ్మెల్యే మీటింగ్ ప్రాంతానికి వెళ్లిన అక్కడ అధికారులు వేదికపై పిలవకుండా అవమానించడం జరిగింది దీన్ని మేము ఒక దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారని అనుకుంటున్నామని దళిత సంఘాల నాయకులు వ్యతిరేకించారు.గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పట్టాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ అర్హులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అది తెలుసుకొని బి ఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు ఇట్టి విషయంపై కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది గురువారం జరిగిన మీటింగ్ లో శాసనసభ్యులు మాణిక్ రావు వేదికపై పిలవకుండా అవమానించడం ఇది కాంగ్రెస్ రౌడీ రాజకీయానికి నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు రౌడీల్ల వివరిస్తున్నారని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత సంఘాల నాయకులము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు సామెల్ బాలరాజ్ సంగమేష్ రాజకుమార్, సుధాకర్ ప్రభాకర్ శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.

నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T153922.273-1.wav?_=7

 

నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం లోని దత్తగిరి కాలనీ లో నూతనంగా ఏర్పాటైన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ 14వవార్డ్ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి ,వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుత వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,
మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,
చిన్న రెడ్డి ,రాజా రమేష్,అమిత్ కుమార్,సత్యం ముదిరాజ్ ,శ్రీనివాస్ ,గణేష్ చంద్రయ్య , దేవిదాస్,
దీపక్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్,అక్షయ్ ,
,అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T114519.415.wav?_=8

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

కవర్గాలబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని మరియు నియోనికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు గత ప్రభుత్వం లో నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన 660 మంది లబ్దిదారులకు లాటరీ సిస్టం ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని & నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పాతపక్షంగా ఉండాలని,అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గారికి వినతిపత్రం అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి తదితరులు ఉన్నారు..

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన.!

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు. 

MLA.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ అని అన్నారు.ఎమ్మెల్యే గారితో పాటుగా న్యాల్కల్ మండల జెడ్పీటీసీ స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహిద్దీన్,మాజి మొగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ లు విజయ్ , జగ్దిష్,దేవదాస్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గణేష్, చంద్రయ్య,వినోద్,ప్రభాకర్,దీపక్,శంత్ కుమార్,నగేష్,ప్రవీణ్ మెస్సీ,తదితరులు పాల్గొన్నారు.

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి.!

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి అసెంబ్లీ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో గతం లో ఏర్పడి నిమ్స్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నేడు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ….
గతం లో (2011 వ సంవత్సరం లో ) ఏర్పాటైన నిమ్స్ ప్రాజెక్ట్ లోని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభించిన ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదు అని *కావున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి , పనులను త్వరగా పూర్తి చేయాలని దీని ద్వారా జహీరాబాద్ నియోజవర్గ ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని కోరారు..
అలాగే జహీరాబాద్ నియోజవర్గం లోని బాలికల ఉర్దూ మీడియం కళాశాలలో లెక్చరర్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ప్రభుత్వ లెక్చరర్లు ను నియమించాలని నియోజకవర్గ విద్యార్థినిల భవిషత్తును కాపాడాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు..

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్బంగా శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరాభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని, ముస్లిం సోదరులు నెలరోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా దయతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాసన్ని విరమింప చేశారు.

Iftar dinner

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తాంజిమ్,మాజి పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్,డి ఆర్ యు సిసి మెంబర్ షేక్ ఫరీద్ , మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , పాక్స్ చైర్మన్ మచెందర్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,న్యాల్కల్ మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,మాజి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మన్నపుర్ గ్రామంలోని ఏస్. వి. కె ఫంక్షన్ హాల్ లో జరిగిన. కొంగల్ అంజన్న గారి కుమారుడి కొంగల్ వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన. శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, గోవింద్ పూర్ సర్పంచ్ రాజు, వీరితో పాటు తిరుపతి రాజు, మండల నాయకులు అంజన్న ,రాములు ,యువ నాయకులు మిథున్ రాజ్, దీపక్ అపి తదితరులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version