బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాల్వాయి వెంకట్ రెడ్డ..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T155707.184.wav?_=1

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాల్వాయి వెంకట్ రెడ్డి

మృతురాలి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మంగళవారం కాట్రపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత యాకయ్య భార్య బొంత దేవ,అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో చాలా రోజులుగా బాధపడుతూ మంగళవారం మృతి చెందగా వారి పార్థివదేహాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుంటూ వారి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *పాల్వాయి వెంకట్ రెడ్డి,

కాట్రపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి : పాల్వాయి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లే యాకాంబరం ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బారాజు ఐలయ్య 7 వ వార్డు సభ్యులు , చాగంటి యాదగిరి, 3 వ వార్డు సభ్యులు బొంత సంపత్ బోదాసు బిక్షపతి మాజీ వార్డు సభ్యులు ఆంగోతు ఈరు బోదాసు చంద్రయ్య జాటోత్ లాల్ సింగ్ బొంత రాజశేఖర్ ఓర్సు ముత్తయ్య తదితరులు పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుంటూ వారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ…

మృతుడి కుటుంబానికి పరామర్శ

ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక,(కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరం మల్లయ్య 70 సం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందగా, మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల కిరణ్ గుప్తా,దూలం సమ్మయ్య గౌడ్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య, మోరెచంద్రయ్య తదితరులు ఉన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీ రామారావు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ అధ్యక్షులు జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొ ల్లి రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఆయాంలో .ఆటో డ్రైవర్లుఅందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారని. ఇప్పుడున్న సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆటో డ్రైవర్ లు జీవనోపాధి మీద చాలా భారం పడిందని. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి. మీ మాట ప్రకారం అటు డ్రైవర్లఅకౌంట్లో డబ్బులు వేస్తామని ఆటో డ్రైవర్లకు మాయమాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారని పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారని. అందుకు అనుగుణంగా వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పై .దయ తలచి మీరు ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లో డబ్బులు వేయాలని. ప్రభుత్వపరంగా జీవిత బీమా 10 లక్షలకు విధంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎందరో నిరుపేద కార్మికులు ఆటో డ్రైవర్ గా జీవిస్తున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారి బాగోబాగులు. చూసుకోవాలని. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పించడం మంచిదే అయిన దానికి వ్యతిరేకం మేము కాదు అని. దీనివలన ఆటో జీవన ఉపాధి పై. భారం పడుతుందని దయచేసి ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి వారి జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాలాభిషేక. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్. నులిగొండ శ్రీనివాస్. ఆటో యూనియన్ అధ్యక్షులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T170759.628.wav?_=2

 

 

*పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం..

*డాక్టర్ వి.ఎం. థామస్…

 

గంగాధర నెల్లూరు(నేటిధాత్రి)

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి
అర్హులైన లబ్ధిదారులు గంగాధర్ నెల్లూరు మండలం చిన్న 48,500 రూపాయలు, కొత్త వెంకటాపురం ప్రేమ్ నాథ్ నాయుడు 1,27,969 రూపాయలు, ముక్కుల్తూరు వినోద్ కుమార్ 62,021 రూపాయలు, వేల్కూర్ మునెమ్మ 20,000 రూపాయలు, కడపగుంట ఆదిలక్ష్మి 76,495 రూపాయలు, కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి గోవింద్ స్వామి 38,541 రూపాయలు,
సిడి,
కండ్రిగ దాసరి గణేశం 1,09,660 రూపాయలు, అమ్మపల్లి భారతి 9,000 రూపాయలు, ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి చంద్రశేఖర్ 1,60,826 రూపాయలు, పెనుమూరు మండలం సాతంబాకం విజయ 87,384 రూపాయలు, మొత్తం 7,40,316 లక్షల రూపాయల చెక్కులను
లబ్ధిదారులకు
ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు(ఎమ్మెల్యే) డాక్టర్ వి.ఎం. థామస్ పంపిణీ చేశారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన రామిండ్ల యాదగిరి వయసు 35 సం:: బుధవారం రోజున అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ బిఆర్ఎస్ నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్తలతో మృతిని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గం లోఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటరెడ్డి తిరుపతిరెడ్డికి టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఎక్కడ ఏ చిన్నపాటి కష్టం ఎవరికైనా వచ్చిన వెంటనే స్పందించి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న తిరుపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గయ్య, ఎల్లం యాదవ్,మంగలి నరసింహులు ఎండి హబీబ్, మెట్టు లింగం, మెట్టు బాలయ్య,మెట్టు రాజు, పంగ రాజు, మన్నె రవి, బాల నర్సు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట పరిధిలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణ ముప్పై రెండు వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన కోత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్.
ఈసందర్భంగా తిరుపతినాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఈపథకం ఉపయోగపడుతుందని, వీరికి రావడానికి కృషిచేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు.

తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి దారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాల పాలయ్యాడు ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి రెవెన్యూ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు బాధితుడు,తెలిపిన వివరాల ప్రకారం మల్లంపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధి చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద సాంబయ్య గీతవృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు దారడంతో కిందపడ్డాడు.వెంటనే గమనించిన తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు ఎక్కుతుండగా జారీ కిందపడి గాయాల పాలైన గీత కార్మికుడు గడ్డమీది సాంబయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గౌడ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు దొనికెల సదానందం గౌడ్, కక్కర్ల ఆనందం గౌడ్ కోరారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు https://cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం…

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మచ్చిక సునిల్ కుమార్ గౌడ్ గత నెల 26 న గుండెపోటుతో మరణించారు.తను పని చేసిన సిద్దార్థ డిగ్రీ కళాశాలకు చెందిన తోటి అధ్యాపకులు మేరుగు శ్రీధర్ గౌడ్,ఏ.ఓ పరమేష్ ఆధ్వర్యంలో ,10 వ తరగతి స్నేహితులు కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ జన పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మచ్చిక రాజు గౌడ్,గుంటి అశోక్,ప్రభాకర్ రెడ్డి, కోమాండ్ల రఘు, బండారి శ్రీనివాస్, సహాదేవ్, దండెం రవీందర్, రాజు కుమార్,వాళ్ళల రమేష్, అనిల్,మచ్చిక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య గౌడ్, ఊడ్గుల సాంబయ్య గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్,గాదెగోని లింగయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, గండు రమేష్ గౌడ్, సుదీర్ గౌడ్, రవితేజ గౌడ్,సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రామగిరి సుమన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్…

రామగిరి సుమన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో ఆర్ బి న్యూస్ రిపోర్టర్ రామగిరి సుమన్ అమ్మ సుజాత అనారోగ్య కారణంతో ఇటీవల మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి సుమన్ కుటుంబాన్ని పరామర్శించి పాగాడ సానుభూతి తెలియజేయడం జరిగింది అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే…

మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఒకే కుటుంబానికి చెందిన బార్య భర్తలు మృతి చెందిన సంఘటన పట్టణంలో కలిచివేసింది. రామకృష్ణాపూర్ పట్టణం సర్దార్ వల్లభాయ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎలగందుల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం తొమ్మిదవ రోజు తిథి కర్మ ఉండగా అతని భార్య ఎలగందుల పద్మ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడంతో కాలనీవాసులు ద్రిగ్బాంధీ చెందారు. లింగయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో మృతురాలు పద్మా అక్క కుమారులు బాధ్యతను చేపట్టి దహన సంస్కారాలు చేశారు. పట్టణ ఆటో యూనియన్, ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న లింగయ్య, ఎస్ఆర్కే పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరణమని పాఠశాల యాజమాన్యం, ఆటో యూనియన్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి…

తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం తిరుమలాపురం గ్రామంలో పూసల చెరువులో ఎనిమిది గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి ఈ విషయం తెలియడంతో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేత పోలికపాడు సత్య శిలా రెడ్డి తదితరులు ఉన్నారు

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత…

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావు గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ 13 వేల రూపాయల చెక్కును నార్లపూర్ గ్రామానికి చెందిన కాశమైన వెంకటలక్ష్మి దశరథం కుటుంబానికి బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి భరోసాగా మెదక్ ఎంపీ నిలుస్తారని కొనియాడా రు అలాగే ఇంటింటికి తిరుగుతూ జి ఎస్ టి తగ్గిన వస్తువుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చిమ్మనమైన శ్రీనివాస్, చంద్రశేఖర్, నరేష్ , సంజువు, ప్రణయ్ కుమార్, పరశురాములు, తిరుపతి, అరవింద్, నాగభూషణం, కరుణాకర్, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T122357.569.wav?_=3

 

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

కరకగూడo మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడుకొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందినారు కరకగూడెం మండలంలో కాకుండా మంగపేట గోవిందరావుపేట ఏటూర్ నాగారం మండలాలలో అందరికీ సుపరిచితుడు గొప్ప మానవతవాది డ్రైవింగ్ ఫీల్డ్ లో సిద్ధహస్తుడు రాజకీయంలో తుమ్మల నాగేశ్వరరావు వీరఅభిమాని కావడంతో ఇతనిని తుమ్మల అని పేరు పెట్టి పిలుస్తారు. అతనికి భార్య ముగ్గురు కూతుర్లు 10 సంవత్సరాలలోపు ఉన్నారు అందరూ చిన్నపిల్లలు కావడంతో పెద్ద దిక్కు కోల్పోవడంతో అందరూ కన్నీటి పర్వతమయ్యారు దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో పరిస్థితి తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ఎంతో బాధపడుతూ హృదయం చలించిపోయి గుర్తు చేసుకుంటూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 11000/రూపాయలు దశదినకర్మలకు ఆర్థిక సహాయం చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు. పోలబోయిన రామారావు కొమరం తాతారావు చందా నాగేశ్వరరావు గొగ్గలి కృష్ణ పోలే బోయిన కృష్ణారావు పోలే బోయిన సత్యనారాయణ పోలే బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

లింగంపేట లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

లింగంపేట లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు లింగంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శీనన్న సహకారంతో చెక్కులు మంజూరు చేయడం జరిగింది.
కొత్తపెళ్లి లావణ్య, గుడిసె రాములు, బండారు నరసవ్వ, మేకల పవిత్ర, యన్నం భవాని లబ్ధిదారులకు మొత్తం రూపాయలు 1,92,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కృష్ణ, ఇందూరి రాజు, బండారి శేఖర్, తర్రే గణేష్, ఇరుమల్ల నాగరాజు, గుడిసె నర్సయ్య, ఈగ రాజేశం, మేకల వెంకటేశం, పాశం లక్ష్మీనారాయణ, కొత్తపెళ్లి రామచంద్రం, శేఖర్, భూమయ్య, గుంట మనోజ్, శ్రీనివాస్, లింగాల ప్రభాకర్, తర్రే లక్ష్మీ రాజం, బుర్ర సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శంకరం పేట్ (A) మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన గోసాయిపల్లి సాయమ్మ, భర్త సంగయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 2.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రెండవసారి బాధితుడికి అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తూ ఆర్థికంగా ఆదుకుంటుందని బుధవారం ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ జైహింద్ రెడ్డి, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version