మృతుడి కుటుంబానికి పరామర్శ
ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి
వీణవంక,(కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరం మల్లయ్య 70 సం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందగా, మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల కిరణ్ గుప్తా,దూలం సమ్మయ్య గౌడ్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య, మోరెచంద్రయ్య తదితరులు ఉన్నారు.
