మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేత..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఒకే కుటుంబానికి చెందిన బార్య భర్తలు మృతి చెందిన సంఘటన పట్టణంలో కలిచివేసింది. రామకృష్ణాపూర్ పట్టణం సర్దార్ వల్లభాయ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎలగందుల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం తొమ్మిదవ రోజు తిథి కర్మ ఉండగా అతని భార్య ఎలగందుల పద్మ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడంతో కాలనీవాసులు ద్రిగ్బాంధీ చెందారు. లింగయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో మృతురాలు పద్మా అక్క కుమారులు బాధ్యతను చేపట్టి దహన సంస్కారాలు చేశారు. పట్టణ ఆటో యూనియన్, ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న లింగయ్య, ఎస్ఆర్కే పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరణమని పాఠశాల యాజమాన్యం, ఆటో యూనియన్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.
