తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు.
దుగ్గొండి,నేటిధాత్రి:
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి దారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాల పాలయ్యాడు ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి రెవెన్యూ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు బాధితుడు,తెలిపిన వివరాల ప్రకారం మల్లంపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధి చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద సాంబయ్య గీతవృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు దారడంతో కిందపడ్డాడు.వెంటనే గమనించిన తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు ఎక్కుతుండగా జారీ కిందపడి గాయాల పాలైన గీత కార్మికుడు గడ్డమీది సాంబయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గౌడ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు దొనికెల సదానందం గౌడ్, కక్కర్ల ఆనందం గౌడ్ కోరారు.
