పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ…

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

 

ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు.

హైదరాబాద్, నవంబర్ 6: గ్రూప్ 1లో ఎంపికైన 115 మంది డీఎస్పీలకు ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు (గురువారం) ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజీపీఏకు చేరుకున్న డీజీపీకి టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రాజేంద్రనగర్‌‌లోని టీజీపీఏలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని అన్నారు.
ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు. కొత్తగా రిక్రెట్ అయిన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రైనింగ్‌లో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు ముఖ్యంగా గుర్తించుకోవాలని అన్నారు. ఈ వంద మంది ట్రైనింగ్‌‌లోనే కాదు.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపారు. పోలీసింగ్‌కు నెట్వర్క్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version