అప్పుల బాధతో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి…

అప్పుల బాధతో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

పరకాల,నేటిధాత్రి

 

 

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన రాసమళ్ళ సురేష్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పురుగుల మందు సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.బుధవారం ఆర్థిక సమస్యలతో మానసికంగా తీవ్రంగా కలత చెందిన సురేష్ పురుగుల మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా,వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.సురేష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇదిలా ఉండగా,తన మరణానంతరం కళ్లను దానం చేయాలని సురేష్ ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.కుటుంబ సభ్యులు ఆయన చివరి కోరికను గౌరవిస్తూ కంటి దానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటారు.

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి…

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి.!

 

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. కానీ, అవసరానికి మించి నీరు తాగడం కూడా శరీరానికి మంచిది కాదని మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం, ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో, శరీరంలోని ప్రతి కణం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిర్జలీకరణం మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. కాబట్టి, దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే, అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం శరీరానికి హానికరం. కొన్నిసార్లు శరీరంలో నీటి శాతం తగ్గకూడదని మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతాము. ఈ అలవాటు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? దాహం లేకపోయినా నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దాహం వేయకపోయినా నీళ్లు తాగవచ్చా?

దాహం లేకపోయినా నీరు తాగడం వల్ల శరీరానికి హాని ఉండదు, పైగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే, అతిగా నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందికి తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.దాహం శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని సూచించిస్తుంది, ఈ సంకేతం కనిపించే ముందు నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. వేడి వాతావరణంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ నీరు తాగడం మంచిది. శరీరం హైడ్రేట్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి, మీ మూత్రం రంగును చూడండి. అది లేత రంగులో ఉంటే, మీరు బాగా హైడ్రేట్ అయ్యారని అర్థం.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?

రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వ్యక్తుల లింగం, వయస్సు, బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీకు ఎక్కువగా చెమట పడుతుంటే, దీని కంటే కొంచెం ఎక్కువ నీరు తాగడం మీకు మంచిది.

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి..

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: నవమాసాలు మోసి, ప్రేమగా
పెంచుకున్న బిడ్డ మరణాన్ని తట్టుకోలేక, “బిడ్డా నువ్వు లేని ఈ జీవితాన్ని నేను భరించలేను జీవించలేను..” అంటూ విలపిస్తూ తీవ్ర మనోవేదనకు గురైన తల్లి, చివరికి ఆ వేదనను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్లోయ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బోయిని వెంకట్-లావణ్యలకు వైష్ణవి (6) అనే ఒకే పాప ఉంది. అయితే ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుండగా మొదట జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు నిమోనియా నిర్ధారించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మృతిని భరించలేక తల్లి లావణ్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు తల్లి-బిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ణించలేని రీతిలో విలపిస్తున్నారు. కాగా గత రాత్రి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఝరాసంగం ఎస్సె క్రాంతి కుమార్ తెలిపారు.

తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి…

తిరుమలాపురంలో విద్యుత్ షాక్ తో గేదలు మృతి

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం తిరుమలాపురం గ్రామంలో పూసల చెరువులో ఎనిమిది గేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి ఈ విషయం తెలియడంతో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేత పోలికపాడు సత్య శిలా రెడ్డి తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version