ఇందిరమ్మ లబ్దిదారుల ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T134106.110.wav?_=1

ఆర్థిక భారంతో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

◆:- సొంతింటి కల నెరవేరేనా!

◆:- పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!

◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.

Indiramma Beneficiaries

 

పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు
నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.

ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.

త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం

-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం

ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

నిజాంపేటలో టీయూడబ్ల్యూజే ఐజేయు మండల కార్యవర్గం ఎన్నిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T132741.497.wav?_=2

టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలో మంగళవారం టియుడబ్ల్యూజే ఐజేయు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్గర్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జీడి చంద్రకాంత్ గౌడ్,కోశాధికారి బండారి సిద్ధ రాములు, ముఖ్య సహాయ కార్యదర్శిలుగా కుర్మ బాలరాజ్, ఊడెపుశ్రీకాంత్ ముఖ్య సలహాదారులుగా భైరవరెడ్డి ,భరత్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యలపరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

డిప్యూటీ తహశీల్దార్ జుబేర్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T131530.529.wav?_=3

ఘనంగా డిప్యూటీ తహశీల్దార్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ జుబేర్ జన్మదినాన్ని సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో జరుపుకున్నారు.

Deputy Tahsildar Juber Birthday Celebration

ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి డిప్యూటీ తాసిల్దార్ జుబేర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సిద్ధారెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ వద్ద మహా అన్నదానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T130836.794-1.wav?_=4

ఘనంగా ఓం శ్రీ సాయి అగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

* శివరాజ్ యాదవ్ కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, నియోజకవర్గ పట్టణ పరిధిలో కాంతా రెడ్డి కాలనీ బాలాజీ నగర్ సమీపంలో గల ఓం శ్రీ సాయిఅగ్ని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాంతారెడ్డి కాలనీకి చెందిన శివరాజ్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ అన్నదానం కేవలం ఆహారం అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్య కార్యమని, అన్నదానం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది. అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని అదేవిధంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సాను కూలతను తీసుకు వస్తాయి. అన్నదానం ద్వారా ఇతరులకు ఆహారం అందించడం ద్వారా వారి జీవితాన్ని ఇచ్చే అవకాశం లభిస్తుంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు తలారి సందీప్, ఉప్పరి మహేందర్, బి. సంతోష్, తరుణ్, ధనరాజ్, వినయ్ కుమార్, ఉప్పరి దత్తు, సాయి కుమార్, సాయి చరణ్, ప్రణీత్ కుమార్, లడ్డు, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T125829.950.wav?_=5

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 15800/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మరియు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పట్టణంలోని మస్తాన్ కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రిత్య చర్య తీసకుంటారని తెలిపారు.

గణపతికి 2000 దీపాల అంకితం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T124309.891-1.wav?_=6

2 వేల దీపాలతో గణపతికి అలంకరణ

భూపాలపల్లి నేటిధాత్రి

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో మహిళలు ఆరవ రోజు గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీలోని 200 మంది వరకు మహిళలు పాల్గొని గణపతికి 2000 దీపాలతో అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=7

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

– సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను అందజేసిన మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

https://youtu.be/83DNSaoHt1Q?si=8oiEeOH4m6nIWt0N

 

 

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామంలో ని ఎల్లమ్మ గడ్డ కాలనీ వాసులు అడగగానే వెంటనే మాట ఇచ్చిన ప్రకారం మారుతి అసోసియేషన్ చందాయిపేట గారికి గణపతి ఉత్సవాలకు గ్రామప్రజల ఆశీర్వాదంతో ని సుమారు 9500 రూపాయలు సెట్ హాంప్లివేర్ పుంగి సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను బహుకరణ సభ్యులకు తలారి రమేష్, జింక స్వామి కి అందజేయడం చేయడం జరిగింది.

బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించాలి…

బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించాలి

అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పట్ల సర్వత్ర హర్షం

స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల అమలు కై కాంగ్రెస్ చేస్తున్న కృషికి ధన్యవాదాలు

ప్రెస్ మీట్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ను పెంచుతూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం తడక కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన, సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే కసి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉండడం పట్ల ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి హాట్సాఫ్ చెబుతున్నట్లు పర్ష హన్మాండ్లు అన్నారు , బీసీ రిజర్వేషన్ల విషయమై కొన్ని పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని ఈ వ్యవహారం అంతా బీసీ సమాజం గమనిస్తుందని పర్ష హన్మాండ్లు అన్నారు,నిన్న అసెంబ్లీలో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు, 42 శాతం రిజర్వేషన్లు అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీతక్క కొండా సురేఖ లకు మా సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పర్ష హన్మాండ్లు తెలిపారు, బీసీ బిల్లు గవర్నర్ ఆమోదిస్తారని బిసి సమాజం ఆశిస్తున్నదని అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు,ఈ రిజర్వేషన్ల అంశం బీసీలకు నోటికి బుక్కలాగా దగ్గరగా వచ్చిందని దీన్ని ఎత్తగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదన్నారు, ఆరు నూరైనా ఏది ఏమైనా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో సాధించి తీరుతామని పర్ష హన్మాండ్లు అన్నారు ,గతంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేయకపోవడం వలన బీసీలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాలకు రాజ్యాధికారము దక్కిందని ప్రస్తుతం రాజ్యాధికారం వాటా దక్కాల్సింది బీసీలకేనని బీసీల జనాభా 56% ఉన్నదని ఆ జనాభా ప్రకారము బీసీల వాట బీసీలకే దక్కాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు, 42 శాతం రిజర్వేషన్లు అంశాన్ని మేము రాజకీయం చేయదలచుకోలేదని వేచి చూసే ధోరణిలో ఉన్నామని ఇంకా నాన్చివేస్తే ఇంకా ఏదైనా రాజకీయ పార్టీలు అడ్డగిస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ విద్యార్థులు, బీసీ ఉద్యోగులు, బీసీ రాజకీయ నాయకులు, బీసీ మేధావులు, అందరితోని జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా బీసీ ఉద్యమ ఉద్యమం మార్చుతామని దేనికైనా తెగిస్తామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కంచర్ల రాజు సీనియర్ నాయకులు చొక్కి కైలాసం, కొడం రవీందర్, సామల తిరుపతి ,దండు శ్రీనివాస్ ,ఇల్లంతకుంట తిరుపతి, బూర ఆంజనేయులు తర్వాత పాల్గొన్నారు.

“గణపతి లడ్డు వేలంలో జట్టగొండ మారుతి విజయం..

గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,

“గణపతి లడ్డు వేలంలో జట్టగొండ మారుతి విజయం…

గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,

సమాజ సేవ మహోన్నతమైంది జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి…

సమాజ సేవ మహోన్నతమైంది జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

సమాజ సేవ మహోన్నత మైన దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. ఇటీవల
66 యూనిట్ల రక్తం
సేకరించిన సందర్భంగా వనపర్తి శాఖ బ్రహ్మ కుమారిస్ శోభ . నాగమణిలను కలెక్టర్ అభినందించారు ఈమేరకు జిల్లా కలెక్టర్ వారికి
ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీ ఎమ్ హెచ్ ఒ డాక్టర్ శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్ట్ గంధం భక్త రాజు పాల్గొన్నారు

“గాలి గూడకు కునుకు కరువు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T142601.036.wav?_=8

 

“గాలి గూడకు కునుకు కరువు”

విష సర్పాలతో.. బెంబేలు.

భయాందోళనలో గ్రామస్తులు.

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గాలిగూడ గ్రామంలో గత రెండు నెలలుగా గ్రామంలో పరిసరాల సస్యరక్షణ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గ్రామంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని.. దీంతో విషసర్పాలకు ఆవాసంగా మారిందని గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామ పారిశుద్ధ్యం గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో.. రాత్రిపూట నిద్ర పట్టడం లేదని, ఎప్పుడు ఇంట్లోకి పాములు దూరుతాయోనని భయంతో వణికి పోతున్నామన్నారు. రాత్రిపూట కాల కృత్యాలకు వెళ్లలేక పోతున్నామన్నారు. విష సర్పాల కరిస్తే.. ప్రజలు చనిపోయే ప్రమాదం ఉందని.. ఉన్నతాధికారులు స్పందించి గ్రామ సస్యరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ నెల 7న ఎరుపు రంగులో చంద్రుడు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T141746.513.wav?_=9

 

 

ఈ నెల 7న ఎరుపు రంగులో చంద్రుడు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఈ నెల 7న ఎరుపు రంగులో చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 1.25 గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఆ రోజు చందమామ ఎరుపురంగులో ఉంటాడు. దీంతో చంద్రుడిని బ్లడ్ మూన్ కూడా పిలుస్తారు. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణే, లక్నో, హైదరాబాద్, చండీగఢ్ ప్రాంతాలవారు దీనిని వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో నేరుగా, స్పష్టంగా చూడొచ్చు.

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T141243.834.wav?_=10

 

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు

ఎలుకటి రాజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా విషయంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయని, యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని, చెప్పులు, ఆధార్ కార్డ్స్ వరుసలో పెట్టి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నా యూరియా దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో ఉందని,రాష్ట్ర మంతా యూరియా కోసం రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని,సకాలంలో యూరియా దొరకక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ శివారు ఉట్టి తండా కు చెందిన రైతు భూక్య బాలు అనే రైతు పత్తి పంటను తీసివేయడం ప్రభుత్వం వైఫల్యనికి నిదర్శనం అన్నారు.గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అలోచించి తగినంత యూరియా సరఫరా చేసిందని, కాని ప్రస్తుత ప్రభుత్వం రైతుల గురించి ఏరోజూ ఆలోచన చేయడం లేదని, 2 లక్షల ఋణమాఫీ అని కొంతమందికి మాత్రమే చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని, రైతులు అందరికి ఋణ మాఫీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము మాదిగ నాయకులు బొజ్జపెల్లి ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..

ఆదర్శనగర్లో భారీ దొంగతనం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T140702.731.wav?_=11

 

ఆదర్శనగర్లో భారీ దొంగతనం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో భారీ
చోరీ జరిగింది. ఆదర్శనగర్కు చెందిన శోభారాణి ఇంట్లో చొరబడ్డ దొంగలు బీరువా పగులగొట్టి రూ.2.50లక్షల విలువైన నగ నట్ర దొంగిలించారు. బైపాస్ సమీపంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని పసిగట్టిన దొంగలు ఇంటి తాళం, బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 2 తులాల బంగారం, 4 తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీ దొంగిలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం అధికారులు ఫింగరింగ్ ప్రింట్స్ సేకరించగా జహీరాబాద్ పట్టణ ఎస్ఐ. వినయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T140105.821.wav?_=12

 

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం.

కల్వకుర్తి / నేటి దాత్రి:

కల్వకుర్తి నియోజకవర్గం లోని గుండూర్ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయము భక్తి శ్రద్ధలతో గణపతి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నము అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రము గణేష్ నిమజ్జనంలో మొదటి లడ్డు వేలంలో రూ 2,50,116 ఆజాద్ యువజన సంఘం తీసుకోవడం జరిగింది. రెండవ లడ్డు రూ 30,000 భుజాల పర్వత్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పర్వత్ రెడ్డి, నర్మదా, గ్రామ పెద్దలు, హనుమాన్ గణేష భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T135104.883.wav?_=13

 

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

– ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

– విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, సెప్టెంబర్ – 01(నేటి ధాత్రి):

 

 

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.

“జహీరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T132220.018-1.wav?_=14

 

కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్
మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గణపయ్య పూజలో పాల్గొన్న లైన్ మెన్ బోగీ ఐలయ్య దంపతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T131412.245-1.wav?_=15

గణపయ్య పూజలో పాల్గొన్న లైన్ మెన్ బోగీ ఐలయ్య దంపతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సాంబమూర్తి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని అక్కడ కొలువు దీరిన గణనాదున్ని లైన్ మెన్ బోగీ ఐలయ్య సునీత దంపతులు సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను సమర్పించారు. ఈ సందర్భంగా లైన్ మెన్ ఐలయ్య మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయకుడి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంటా సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండుగా ఉండాలని ఆ గణనాథుడిని వేడుకుంటున్నట్లు ఐలయ్య తెలిపారు. వినాయక చవితి పండగ మనలో భక్తి, శక్తి మాత్రమే కాక ఐకమత్యం,స్నేహభావాన్ని పెంపొందిస్తుందన్నారు.

error: Content is protected !!
Exit mobile version