“గాలి గూడకు కునుకు కరువు”
విష సర్పాలతో.. బెంబేలు.
భయాందోళనలో గ్రామస్తులు.
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని గాలిగూడ గ్రామంలో గత రెండు నెలలుగా గ్రామంలో పరిసరాల సస్యరక్షణ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గ్రామంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని.. దీంతో విషసర్పాలకు ఆవాసంగా మారిందని గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామ పారిశుద్ధ్యం గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో.. రాత్రిపూట నిద్ర పట్టడం లేదని, ఎప్పుడు ఇంట్లోకి పాములు దూరుతాయోనని భయంతో వణికి పోతున్నామన్నారు. రాత్రిపూట కాల కృత్యాలకు వెళ్లలేక పోతున్నామన్నారు. విష సర్పాల కరిస్తే.. ప్రజలు చనిపోయే ప్రమాదం ఉందని.. ఉన్నతాధికారులు స్పందించి గ్రామ సస్యరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.