ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

బహుమతులు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎస్ఐ పవన్ కుమార్ కళాశాల చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ లు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి సిరివెన్నెల,రెండవ బహుమతి ఎస్ఆర్ స్కూల్ ఉతమ్ శెట్టి,ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమతి అక్షయలు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ ఇన్చార్జి కల్పన,పద్మ, ధనలక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.

పరకాలలో బైక్ దొంగ అరెస్ట్

బైక్ దొంగను పట్టుకున్న పరకాల పోలీసులు

 

పరకాల,నేటిధాత్రి

శనివారం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సై పవన్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన మంద అరవింద్ అనే వ్యక్తి హోండా స్పెండర్( టీఎస్ 03 ఈఎఫ్ 8733 నెంబర్ గల వాహనం మీద అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పట్టుకొని విచారించగా అతను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో బైక్ను దొంగలించినట్టు ఒప్పుకున్నాడు.అనంతరం పోలీసులు అరవింద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు తెలిపారు.దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ పవన్,సిబ్బందిని ఏసిపి సతీష్ బాబు మరియు సిఐ క్రాంతికుమార్ అభినందించారు.

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు…

లారీ డ్రైవర్ల అవగాహన సదస్సు**
* మహాదేవపూర్  నేటి ధాత్రి *

మహదేవపూర్ మండలానికి చెందిన లారీ డ్రైవర్లతో మహాదేవపూర్ పోలీసు వారు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని ,అతి వేగంగా వాహనం నడపకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తగినంత నిద్ర తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించి వాహనం నడపాలని, నియమాలు అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోబడును అని మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ మరియు సాయి శశాంక్ ఎస్సై తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మొహమ్మద్ యూనుస్…

రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మొహమ్మద్ యూనుస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, ఎంపీ ఎమ్మెల్యేలకు లేని పిల్లల నిబంధన కేవలం లోకల్ బాడీలో అమలు చేయడం వల్ల ఎంతోమంది నాయకులు పోటీకి దూరం అయ్యరని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారికి కూడా పోటీ చేసే అవకాశం దక్కిందని, దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన న్యాల్కల్ మండల అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్.

జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మహాదేవపూర్ పోలీస్

జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మహాదేవపూర్ పోలీస్
* పలు అంశాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ పవన్ కుమార్
మహాదేవపూర్ అక్టోబర్ 24 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ ను మహాదేవపూర్ పోలీసులు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భం గా ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో రెండో ఎస్సై సాయి శశాంక్ తో కలిసి జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించి దానిలో భాగంగా పోలీస్ స్టేషన్లో పిటిషన్ మేనేజ్మెంట్, ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్, డయల్ హండ్రెడ్, రికార్డ్ మేనేజ్మెంట్, సైబర్ క్రైమ్ తో పాటు పలు అంశాలపై సరళమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాపకేతర బృంద, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version