మానసిక ఒత్తిడి.. కండరాల నొప్పికి కారణమవుతుందా?
కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, మానసిక ఒత్తిడి కూడా కండరాల నొప్పికి కారణమవుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, మానసిక ఒత్తిడి కూడా కండరాల నొప్పికి కారణమవుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సంతపేట ప్రాంతంలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయి. తెల్లవారుజామున వీధుల్లో ఏనుగులను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా పంట పొలాల్లో కనిపించే ఏనుగులు.. జనసంచారం అధికంగా ఉండే నగర వీధుల్లోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. భయంతో పరుగుపరుగున ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కేశారు.
రెవా – ప్రయాగ్‌రాజ్ హైవేపై బైక్‌ను ఆడీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముగ్గురూ పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
`రేవంత్ రెడ్డి సర్కార్ వార్తలు మోస్తున్న లీకు కాకులు?
`ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తున్న ద్రోహులు?
`తిన్నింటి వాసాలు అప్పుడే లెక్కపెడుతున్నారు?
`బాధ్యతలు మర్చిపోయి లీకులివ్వడంలో మునిగి తెలిపోతున్నారు?
`పదవులు పొందినా పాత వాసనలు పోలేదు?
`వెనుకటి కోవర్ట్ గుణాలు మానుకోలేదు?
`క్యాబినెట్ ర్యాంక్ లొచ్చినా లోబి తనం పోలేదు?
`నమ్మిన వారికి వెన్నుపోటు మానుకోలేకపోతున్నారు?
`ఇప్పటికే అర్హతకు మించి పదవులు పొందారు?
`పార్టీ ని, ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు?
`చీమ చిట్టుక్కు మనక ముందే లీకులు చేరవేస్తున్నారు?
`సీఎం రేవంత్ ను నమ్మించి మోసం చేస్తున్నారు?
`పెద్దలుగా చెలామణి అయ్యి సీఎం రేవంత్ రెడ్డి పక్కన చేరారు?
`పదవులు పొంది ప్రతిపక్షం కోసం పని చేస్తున్నారు?
`ఎవరు నమ్మకస్తులో, ఎవరు కాదో తెలుసుకోలేక రేవంత్ సతమతమౌతున్నారు?
`అధికారులతో అంట కాగుతూ అసలు సమాచారం ముందే సేకరిస్తున్నారు?
`క్షణాలలో ప్రతిపక్షానికి ఉప్పందిస్తున్నారు?
`రహస్యంగా ఉంచాల్సిన వాళ్లే బహిర్గతం చేస్తున్నారు?
`అవసరం లేని విషయాలలో తలదూర్చుతున్నారు?
`బాధ్యతలు పక్కన పెట్టి బద్మాష్ పనులు చేస్తున్నారు?
`మోసగాళ్ళను నమ్మి సీఎం రేవంత్ బాధపడుతున్నారా?
`మంత్రి వర్గంలో కొంత మంది అలాగే వున్నారు?
`ఇద్దరు, ముగ్గురు తప్ప ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్పడం లేదు?
`ప్రతి దానికి సీఎం రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాల్సి వస్తోంది?
`కోవర్ట్ లే కాంగ్రెస్ కొంప ముంచుతున్నారు?
`కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు?
`అధికారం లోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కే ఎసరు పెట్టాలని చూస్తున్నారు?
`ఆదరించి అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే వాళ్ళుంటారు?
`నమ్మించి నట్టేట ముంచే వాళ్ళు నమ్మకంగా నటిస్తారు?
`వాళ్ళు ఎవరో ఇప్పటికైనా సీఎం గుర్తించి పక్కన పెట్టకపోతే కష్టం?
`కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు నష్టం?
హైదరాబాద్, నేటిధాత్రి:
బుద్ది చెప్పాలనకున్నప్ప్పుడు గుద్ది చెప్పినా తప్ప్పులేదని వేమన ఓ పద్యంలో చెబుతాడు. మంచి చెయానుకున్న వారు అలాగే వుండాలి. కాని సమాజంలో మంచి తనం వున్న వాళ్లుంటారు. చెడు గుణం కల్గిన వారుంటారు. ఈ ఇద్దరే కాకుండా మరో రకంగా కూడా వుంటారు. వాళ్లే అవకాశవాదులు. మంచి తనం ముసుగేసుకొని చెడును స్వభావం మెండుగా వున్న వారు వుంటారు. వాళ్ల మాటలు తియ్యగా వుంటాయి. నమ్మేలా వుంటాయి. నంగనాని మాటలు చెప్పినా వినసొంపుగా చెబుతారు. తర్వాత గోతులు తీస్తారు. ఎందుకంటే అబద్దాలు ఎంతో అందంగా వుంటాయి. వినడానికి కూడా చాలా అందంగా వుంటాయి. మంచి మాటలు కొంచెం కటువుగా వుంటాయి. కాని వాటిని వినడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే మంచి తనం ముసుగేసుకున్న వారు దూరి పోతుంటారు. అభినవ నారద మునీంద్రులుగా కనిపిస్తుంటారు. కాని వారు తవ్వే గోతులు తెలుసుకునే లోపు పుణ్యం పూర్తవుతుంది. ఇలాంటి వారిని ముందే గుర్తిస్తేగాని సమాజం బాగు పడదు. వ్యవస్ధలు ముందుకు పోవు. సరిగ్గా ఇలాంటి వారే కాంగ్రెస్ ఫ్రభుత్వంలో చేరిపోయారు. సహజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోళా శంÅ£రుడు లాంటి వారు. ఆయనకు అందర్నీ నమ్మడం అలవాటు. దాని వల్ల కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన సందర్బాలు గతంలో వున్నాయి. ఇప్ప్పుడు కనిపిస్తున్నాయి. సిఎం. రేవంత్ రెడ్డి ఎంత నిక్కచ్చిగా వుంటారో తెలియంది కాదు. అయినా అలాంటి మంచి మనిషిని కూడా సులువుగా బోల్తా కొట్టించిన వారు కూడా ఆయన చుట్టు కొంత మంది వున్నారు. నిజం చెప్పాలంటే వారిని సిఎం. రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మారన్న మాటలు కూడా ఇప్ప్పుడు వినిపిస్తున్నాయి. ఎక్కడ నమ్మకం ఎక్కువ వుంటుందో అక్కడే ఎక్కువ మోసానికి తావుంటుందని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్ప్పుడు అదే నిజమౌతోంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అని తెలిసిన తర్వాత ఆయన వద్దకు చేరిన వారు కొంత మంది వున్నారు. అంతకు ముందు రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన వారు ఆయన చుట్టూ చేరిపోయారు. వారికి అబద్దాలు అల్లడం నోరుతో పెట్టిన విద్య కలిగిన వారున్నారు. వార్తలను సష్టించి నమ్మించడం అలవాటు చేసుకున్నారు. నిజాలు ఎప్ప్పుడూ వారు చెప్పరు. కాని మసిబూసి మారెడు కాయ చేయడంలో సిద్దహస్తులు. అందుకే వారిని సిఎం. రేవంత్ రెడ్డి బాగా నమ్మారని అంటారు. అందులో ఒకరిని రేవంత్ రెడ్డి సిఎం. అయ్యాక తనకు అత్యంత సన్నిహింతగా మెదిలే పదవిలో కూర్చోబెట్టుకున్నారు. అయినా వారిలో ఆశ తీరలేదు. సంపాదన మీద ఆశ చావలేదు. పదవితో వారికి సంతప్తి కలగలేదు. సంపాదన పెరిగే మార్గం కనిపించలేదు. దాంతో కోవర్టు అవతారమెత్తినట్లు తేలింది. వెంటనే అనుమానం వచ్చిన సిఎం. రేవంత్ రెడ్డి ఆ వ్యక్తిని పక్కన పెట్టాలనుకున్నారు. అsదులోనూ సిఎం. తన మంచితనాన్నే చాటుకున్నారు. పూర్తిగా పక్కన పెట్టకుండా ఓ రాజ్యాంగబద్ద పదవి కట్టబెట్టి మరీ దూరం పెట్టారు. ఇక్కడ కూడా సిఎం. రేవంత్ రెడ్డి మంచి తనం ఆ వ్యక్తికి కనిపించలేదు. తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. క్యాబినేట్ ర్యాంక్ పదవి ఇచ్చినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. కాంగ్రెస్ ఇంటి మీద వాలిన కాకి, ప్రతిపక్షాల ఇంటి మీద వాలొద్దన్నంతగా నిక్కచ్చి రాజకీయాలు చేసే రేవంత్‌రెడ్డికే సవాలు విసిరేటు వంటి పనులు ఆ వ్యక్తి చేస్తున్నట్లు మళ్లీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి తోడుగా మరో అవకాశ వాది కూడా అదే దారిలో నడుస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. బిఆరఎస్ పదేళ్ల కాలం పాటు అదికారంలో వున్నప్ప్పుడు ఆ వ్యక్తి పదవులు కోరుకున్నా తీరలేదు. పైగా ఆ వ్యక్తి అత్యాశలను గమనించి పార్టీ ఆ వ్యక్తిని తప్పించాలనుకున్నది. అక్కడనుంచి తరిమేసింది. ఒక రకంగా పక్కన పెట్టేసింది . రాష్ట్రంలో ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం మొదలైంది. మెల్లిగా ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సిఎం. రేవంత్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. తాను ఎంత చేసినా బిఆరఎస్ నాయకులు తనకు అన్యాయం చేశారని మొసలి కన్నీళ్లు పెట్టుకున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అలా సిఎం. రేవంత్ రెడ్డికి దగ్గరైనా ఆ వక్తి వల్ల కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. ఆ సమయంలో నిర్భయంగా కాంగ్రెస్‌కు ముందుండి ప్రచారం చేసింది లేదు. కాని నేనున్నాన్నట్లు మాత్రమే వ్యవహరిస్తూనే వచ్చారు. అంటీ ముట్టనట్లే వుంటూ వచ్చారు. పార్టీ ముద్ర తన మీద పడకుండా చూసుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర వుందని చెప్ప్పుకోవడం, సిఎం. రేవంత్ రెడ్డితో పదవి పొందడం అన్నీ జరిగిపోయాయి. అయినా ఆ వ్యక్తికి విశ్వాసం లేదన్న మాటలే ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్నాయి. కొంత కాలం సిఎం. రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి, ఈ వార్తలోని మరో వ్యక్తికి మరింత దోస్తానా పెరిగింది. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని ఆరా తీయడం, దానిని ప్రతిపక్షాలకు చేరవేయడం మొదలైందని తెలుస్తోంది. ప్రభుత్వం దష్టికి కూడా వచ్చినట్లు సమాచారం. అందుకే ఇటీవల సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత నమ్మకస్తుడైనా సరే మాట వరుసకు కూడా ప్రభుత్వ విషయాలు బైటకు రాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా వుంటే మంత్రి వర్గంలో వున్న కొంత మంది మంత్రుల్లో కూడా కోవర్డులున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సిఎం. రేవంత్ రెడ్డి ప్రజల్లో చులకన కావాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు బైటకు వెళ్లినా, ప్రభుత్వం మీద ప్రతిపక్ష బిఆరఎస్ ఆరోపణలు చేస్తున్నా చాలా మంది మంత్రులు సైలెంట్‌గా వుంటున్నారు. ప్రభుత్వం అబాసుపాలైతే తమ రాజకీయ జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుందన్న ఆందోళన ఆ మంత్రులలో లేకుండాపోతోంది. వచ్చేది కూడా మన ప్రభుత్వమే..మళ్లీకాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని సిఎం. రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను మంత్రులే నమ్మనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టింపు లేనట్లు వుంటున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు మంత్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి అండగా ఓ ఇద్దరు ముగ్గరు మంత్రులు తప్ప మిగతా వాళ్లంతా సైలెంట్‌గానే వుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూడా మంత్రులు ఏం పాత్ర పోషిస్తున్నారో కూడా అ ర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఎన్నికకు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా సిఎం. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసే వరకు మంత్రులు చొరవ చూపలేదు. అంత వరకు ప్రతిపక్షానికి అనుకూలంగా వున్న వాతావరణాన్ని ఒక్కసారిగా సిఎం. రేవంత్ రెడ్డి మార్చేసి, పార్టీని గెలిపించారు. గత సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఎవరు ఏమనుకున్నా, సర్పంచ్ ఎన్నికల్లోకూడా సిఎం. రేవంత్ స్వయంగా ప్రచార సభలు నిర్వహించారు. మెజార్టీ సర్పంచ్‌లను గెలిపించారు. అయినా కొందరు మంత్రుల్లో మార్పు రావడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇప్ప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించాల్సి వస్తోంది. ఇంత మంది మంత్రులున్నాము..మేం చూసుకుంటామని సిఎం.కు దైర్యం చెబుతున్న వారే కరువౌతున్నారు. జగిత్యాల వంటి జిల్లాలో జరిగుతున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఏ ఒక్క మంత్రి మాట్లాడడం లేదు. ఏ ఎమ్మెల్యే స్పందించం లేదు. పదేళ్ల తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి సిఎం. రేవంత్ రెడ్డి పడిన శ్రమను అధిష్టానం గుర్తించి ఆయనను సిఎం చేసింది. ఆ మాత్రం కతజ్ఞత కూడా చాలా మందిలో కనిపించడం లేదు. ఇప్ప్పుడు మంత్రులైన వారిలో, ఎమ్మెల్యేలైన వారిలో సిఎం. రేవంత్‌రెడ్డి చరిస్మా వల్ల గెలిచిన వారే ఎక్కువగా వున్నారు. అయినా వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. ఇప్పటికీ ప్రభుత్వంలో లుకలుకలుండాలని కోరుకుంటున్నవారు కూడా వున్నారు. ఓ వైపు ఎన్నిÅ£ల ప్రచారం సాగుతున్న తరుణంలో కాంగ్రెస్‌ను ఓడించినా సరే, తమకు వచ్చే ఇబ్బందులు లేవని ఎవరైనా అంటారా? అలా అన్నారంటే అర్దమేమిటో ప్రజలకు తెలియదా? సిఎం. రేవంత్‌కు అర్దం కాకుండా వుంటుందా? ఏది ఏమైనా సరే సిఎం. రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీకి రక్షకుడు. అనే నిజాన్ని ఇప్పటికీ, ఎప్పటికీ కాంగ్రెస్ నాయకులు నమ్మితేనే పార్టీకి భవిష్యత్తు!!
32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత.
బెల్లంపల్లి, నేటిధాత్రి:
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మున్సిపాలిటీ 32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ కార్యక్రమంలో అభ్యర్థి దేవ రజిత, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
`మున్సిపల్ ఎన్నికలలో పార్టీలకు గుండె దడ?
`రెబెల్స్ ను కూడా పార్టీలు ప్రోత్సహిస్తున్నాయా?
`అన్ని పార్టీల స్థానిక నాయకత్వం చేతులెస్తోందా?
`జగిత్యాలలో జీవన్ రెడ్డి రెబెల్స్ తరుపున ప్రచారం చేస్తున్నారు?
`పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న చోట కాంగ్రెస్ కు తలనొప్పులు?
`బీఆరఎస్ కు రెబెల్స్ బెడద కాస్త తక్కువే?
`బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ చుక్కలు చూపిస్తున్నారు?
`ఉత్తర తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లో ఎక్కువగా రెబెల్స్ రంగంలో వున్నారు?
`రెబెల్స్ గెలిస్తే పరిస్థితిలో మార్పు రాదు?
`రెబెల్స్ మూలంగా బీజేపీ, కాంగ్రెస్ లు ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది?
`రాష్ట్ర రాజకీయాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది?
హైదరాబాద్, నేటిధాత్రి:
మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆయా పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. అందులో కొంత మంది పార్టీలు బుజ్జగిస్తే విన్నారు. చాలా చోట్ల వినలేదు. పార్టీల మాట లెక్క చేయలేదు. పార్టీలు ప్రకటించిన అభ్యర్దులకంటే రెబెల్సే మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దూకుడుగా రాజకీయం చేస్తున్నారు ప్రచారంలో అసలైన అభ్యర్ధులకంటే ముందున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఎందుకంటే రెబెల్స్‌గా పోటీ చేసి పరువ పోగొట్టుకోవడం రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది. ఒక వేళ గెలిస్తే పార్టీలో పట్టు దొరుకుతుంది. పార్టీలో గౌరవం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఆదిపత్యం చూపించుకునే అవకాశముంటుంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కొని లాతభపడ్డట్లుంటుంది. అందుకే తమను తక్కువగా అంచనా వేసిన స్దానిక నాయకుల మీద పై చేయి సాదించినట్లౌవుంది. పార్టీ ఇక భవిస్యత్తులో తనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్తితి వుంటుంది. రెబెల్‌గా పోటీ చేసి గెలిస్తే ఇన్ని రకాల మర్యాదలు పార్టీలో వుంటాయి. ఇవే కాకుండా ఒక వేళ గెలిస్తే, మెజార్టీ స్దానాలు పొందిన పార్టీకి గెలిచిన రెబెల్స్ అవసరం రావొచ్చు. ఊహించని విదంగా రెబల్స్‌కే పదవులు అందొచ్చు. ఇలా అనేక రకాల రాజకీయ లాభలు వుంటాయి. కొన్ని సార్లు ఇలా రెబెల్స్‌గా గెలిచిన వాళ్లు చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు అయిన వాళ్లు కూడా వున్నారు. ఏ అవకాశం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించేది కాదు. వారి వారి పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడం కూడా కొన్ని సార్లు అదష్టాన్ని తీసుకురావొచ్చు. అందుకే పార్టీలో ఎంతో కొంత పేరుండి, ప్రజల్లో పలుకుబడి వున్న వాళ్లు ఇలా రెబెల్స్‌గా పోటీ చేసిన గెలిచిన సందర్భాలు అనేకం వున్నాయి. రాత్రికి రాత్రి పెద్ద పెద్ద నాయకులైన వారు కూడా వున్నారు. అందుకే పార్టీలు పక్కన పెట్టిన వారు ఆత్మాభిమానం చంపుకోలేక రెబెల్స్‌గా పోటీ చేసి గెలుస్తుంటారు. ఈసారి ఆ బెడద అన్ని పార్టీలకు ఎక్కువైందనే చెప్పాలి. అంతే కాకుండా జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏకంగా రెబల్స్‌నే ప్రోత్సహిస్తున్నారు. వారి తరుపున ప్రచారం చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్ధులను ఓడించాలని చెబుతున్నారు. పదేళ్లుగా పార్టీని పట్టుకొని, నమ్ముకొని వున్న వారిని రెబెల్స్‌గా రంగంలోకి దింపారు. ఇలా గతంలో ఎప్ప్పుడూ జరగలేదు. ఇలా తిరుగుబాటు పెద్ద నాయకులతో కూడా ఎదురైన సందర్భం గతంలో చూడలేదు. కాకపోతే ఈసారి రెబెల్స్ వల్ల పార్టీలకు గుండె దడలు వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల ప్రచారం తారాస్దాయికి చేరుకున్నది. మున్సిపోల్స్‌లో మునిగేదెదరు? లేలేదెవరు? అనే చర్చ మొదలైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తుందా? లేక కారు దూసుకుపోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. దానికి తోడు కమలం వికసిస్తుందా? అనే మాటలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో పట్టు ఏ పార్టీకి వుంది? అనేది మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. సహజంగా పట్టణ ప్రజలు కోరుకునేదేమిటి? అనేది రాజకీయ పార్టీలకు తెలుసు. కాని పట్టణ ప్రజలకు ఈ రెండేళ్ల కాలంలో న్యాయం జరిగిందా? అనేది ఎన్నికలు జరిగి, ఫలితాలు వస్తే గాని తెలియదు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల ప్రభావం కాంగ్రెస్ మీద పడుతుందా? లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. జనం కాంగ్రెస్‌ను కూడా ఎక్కడా నిలదీస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజంగా జనంలో ఆక్రోశం వుంటే ఆరుగ్యారెంటీలు ఏవి? అని అడిగేవారేమో! ఇదిలా వుంటే తెలంగాణలో బిఆరఎస్ బలం చెక్కు చెదరకుండా వుందా? లేదా అన్నది కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే పట్టణ ప్రజలు కొంత వి ద్యావంతమైన సమాజంతో కూడుకొని వుంటుంది. ప్రజలు అభివద్దిని కోరుకుంటారు. గత పదేళ్ల బిఆరఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను అంచనా వేసుకొని ఓట్లు వేస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా వున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టమౌతుంది. అయితే పట్టణ యువత ఎటు వైపు మొగ్గుచూపుతుంది? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇటీవల యువత బిజేపి మంత్రం జపిస్తున్నారు. బిజేపి వైపు ఆకర్షితులౌతున్నారు. అదే బిజేపికి కొంత అనుకూలమైన వాతావరణం తీసుకొస్తుందా? అనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. మున్సిపోల్స్‌లో అసలైన ప్రచారం ఊపందుకున్నది. సిఎం. రేవంత్ రెడ్డి రంగ ప్రవేశంతో మొదలైందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు హడావుడిగా నిర్వహించేందుకు యుద్ద ప్రాతిపదికన సన్నాహాలు చేశారు. కాని అన్ని పార్టీలలో ఈ ఎన్నికలపై నాయకులకు ఇంత ఆసక్తి వుందని ముందు ఎవరూ ఊహించలేదు. నిజానికి పంచాయితీ సర్పంచ్ ఎన్నికల మందు కాంగ్రెస్‌లో కూడా పెద్దగా ఊపు కనిపించలేదు. ఓ వైపు ఆరు గ్యారెంటీల ప్రభావం పల్లెల్లో ఎలా వుంటుందో అని అందరూ భయపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూడా సర్పంచ్ ఎన్నికల కోరలేదు. ఎప్ప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెల్చుకున్నదో అప్ప్పుడు కాంగ్రెస్‌లో ఆశ మొదలైంది. ఫలితాలు కూడా ఆశాజనంగానే వుంటాయన్న నమ్మకం ఏర్పడింది. దాంతో పంచాయితీ ఎన్నికల ధైర్యం చేశారు. ఊహించినట్లుగానే ఎంతో కొంత మెరుగైన ఫలితాలే సాదించారు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదని గమనించారు. అయితే మున్సిపల్ ఎన్నిÅ£లకు ఇప్పట్లో వెళ్తారని అనుకోలేదు. పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్‌లు కాంగ్రెస్ గెల్చుకున్నది. అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అదే సమయంలో కారు పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద గెలిచే అవకాశం లేదు. కాని మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తుతోనే నిర్వహిస్తారు. ఇప్ప్పుడు అసలైన ఆట వుంటుందని బిఆరఎస్ అనుకుంటోంది. కాకపోతే రెండు పార్టీలలోనూ రెబల్స్ బెడద మరీ ఎక్కువైపోయింది. గతంలో అవకాశాలు రాలేదని బిఆరఎస్‌లో చాలా మంది నాయకులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. అదే సమయంలో పదేళ్ల పాటు పార్టీని పట్టుకొని వున్న వాళ్లకు కాకుండా కొత్తగా పార్టీలోకి చేరినవారికి టిక్కెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్‌లో కూడా రెబెల్స్ విపరీతంగా పెరిగారు. దాంతో రెండు పార్టీలలో దడ మొదలైంది. అంతే కాదు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బిజేపిలో కూడా రెబల్స్ పోటీ చేయడం విశేషం. కరీంనగర్‌లో కాంగ్రెస్, బిఆరఎస్ పార్టీలకన్నా బిజేపి పార్టీ ఎక్కువగా రెబల్స్ బెడదను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. ఇలా రెబల్స్ పార్టీల కొంప ముంచుతారా? లేక వాళ్లే గెలిచి పార్టీలకు సవాలుగా మారుతారా? అనే సందేహం వ్యక్తమౌతోంది. నిన్నటి దాకా రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నం పార్టీలు బాగానే చేశాయి. అదికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి, మున్సిపల్స్‌లో అవకాశం రాని వారికి నామినెఏటెడ్ పోస్టులు ఇస్తామని కూడా ప్రకటించింది. అందుకు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా హమీ ఇచ్చారు. అయినా చాలా చోట్ల కాంగ్రెస్ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా బిఆరఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా వుంది. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దుమ్మెత్తిపోశారు. జగిత్యాలతో టికెట్ల కేటాయింపు తన చేత కాకుండా పార్టీ మారిన సంజయ్‌కి ఎక్కువ టిక్కెట్లు ఇ చ్చారు. దాంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక దశలో కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి ఆయనను దూషించారు. పార్టీ మారిన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్ప్పు పట్టారు. పార్టీని ఇంత కాలం పట్టుకొని వేళాడిన వారికి అన్యాయం జరుగుతోందని మండి పడ్డారు. అయినా పార్టీ జీవన్ రెడ్డి మాటలు లెక్క చేయలేదు. దాంతో అక్కడ కూడా కాంగ్రెస్ రెబెల్స్ ఎక్కువ మంది బరిలో నిలిచారు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న చోట ఈ వివాదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. అలాంటి మున్సిపాలిటీలలో గెలుపోటములు ఎలా వుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొని వుంది. ఏది ఏమైనా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ కీలక భూమిక పోషిస్తారని చెప్పడంలో సందేహమే లేదు.
బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్
100 ఫిర్యాదు చేయాలి ఎస్పీ
వనపర్తి నేటిధాత్రి .
https://youtu.be/i0vGPu1YW4s?si=VEMl1XTexUQ7bDT4
బాల్యా వివాహాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.శుక్రవారం ఐ.డి. ఒ .సి ఆవరణలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గ్రామీణ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు వనపర్తి, మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలలో ఒక్కో జిల్లాలో 10 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు,చట్ట ప్రకారం పడే శిక్షల పై విస్తృత ప్రచారం చేయనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు. పుట్టబోయే పిల్లలు శారీరక ఎదుగుదల లేకపోవడం తల్లి బిడ్డలు అనేక రోగాల బారిన పడి జీవితాలు నాశనం అయిపోతాయని తెలిపారు.బాల్య వివాహాలు చేసే వారి పై ఎలాంటి జాలి లేకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయడం జెరుతుందని అన్నారు
ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 100..112 నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు బాల్య వివాహం చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, పెళ్ళికి వెళ్ళే బంధు మిత్రుల పై సైతం కేసులు పెట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని చెప్పారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. సంతకాల సేకరణలో భాగంగ ప్లెక్సీ పై సంతకాలు చేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఎస్ కోఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం ఆఫీసర్ చూచేత, సహాయ ప్రోగ్రాం ఆఫీసర్ జూవెద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి డి సి పి ఓ రాంబాబు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు
జర్నలిస్టు దంపతులకు అండగా నిలిచిన మీడియా లోకం
యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ నాయకుల ఏకగ్రీవ మద్దతు
సుత్తి కొడవలి నక్షత్రం’ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ఎర్రం అనూష సతీష్ కుమార్ విజయానికి జర్నలిస్టు లోకం ఏకమైంది. శుక్రవారం 27వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు మద్దతుగా తోటి జర్నలిస్టులు పైలెట్ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
పార్టీలు, యూనియన్లకు అతీతంగా తరలివచ్చిన జర్నలిస్టులు.. తమ తోటి జర్నలిస్ట్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో పాల్గొన్న కాకతీయ ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… ప్రజల సమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు నేడు నేరుగా ప్రజా సేవలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. “అనూష సతీష్ కుమార్ గెలిపిస్తే, జర్నలిస్టులందరం కలిసి ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకువస్తాం. పైలెట్ కాలనీతో పాటు 27వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న విద్యావంతురాలైన అనూష సతీష్ కుమార్‌ను గెలిపించడం ద్వారా వార్డు రూపురేఖలు మార్చుకోవచ్చని వారు నినదించారు. సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఖ్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్, జల్ది రమేష్, ఎడ్ల సంతోష్, అంబాల సంపత్, తడుక సుధాకర్, గుజ్జ సారేశ్వరరావు, రవీందర్,
ములకల లక్ష్మారెడ్డి, చెరుకు సుధాకర్, సమ్మయ్య, కడపాక రమేష్,కొంకుల
సాంబయ్య, వెంకన్న,ప్రవీణ్, రజినీకాంత్, రాంబాబు,
జగన్, పవన్, చంద్రమౌళి, సృజన్, సుమారు 50 మంది సీనియర్ జర్నలిస్టులుపాల్గొన్నారు.
ఆదరించండి అమ్మ గార్డెన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా…
9వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి బీమా మల్లేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రజలంతా ఒక్కసారి ఆదరించి, ఓటు వేసి గెలిపిస్తే అమ్మ గార్డెన్ ఏరియాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీమా మల్లేష్ అంటున్నారు. మునిసిపాలిటీ ఎన్నికలలో భాగంగా అమ్మ గార్డెన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భీమా మల్లేష్ గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఆదరించి గెలిపిస్తే కాలనీని మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు తెలియపరుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో కాంపెల్లి సమ్మయ్య, మెట్ట సుధాకర్, చంద్రగిరి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కోహీర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు కలిమ్, యువ నాయకులు మిథున్ రాజ్ కోహీర్ పట్టణం లోని వివిధ వార్డ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ నాయకులు మాట్లాడుతూ ,ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు, బి ఆర్ ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులు వేసి మేమే చేసాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు,ప్రజల ఆశీస్సులతో కోహీర్ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు,నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు..
ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల ఎలుగుల సురేష్ , ఎలుగుల చందు ఇరువురు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు నాణ్యమైన వైద్యం అందించుటకు నావంతు సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…
ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని అంటున్నారు. గద్దె రాగడి ఏరియాలోని కాలనీలలో గడపగడపకు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు.ఎనిమిదవ వార్డు ప్రజలు అవకాశం ఇస్తే కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. స్థానిక బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత- సత్తయ్యలు సైతం కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండడంతో గెలుపు లాంచనమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో మేరుగు రాజేశం, కుర్మ గురువయ్య, దినేష్, దేవి సాయి కృష్ణ, రాజ్ కుమార్, శ్రీనివాస్, వంశీ, రాజేందర్, సాంబయ్య, మనోహర్, రమేష్, మొండయ్య, హరీష్ లు పాల్గొన్నారు.
వనజ రాజేష్ ను ఆశీర్వదించండి
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా టిటి కోటర్స్ కారన్ మాస్ కాలనీ లో గొడుగు వనజ రాజేష్ స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు సార్లు పోటీ చేసి కౌన్సిలర్ గా ఓడిపోయాను కావున కాలనీ ప్రజలు అందరూ ఆలోచించి ఈసారి నన్ను మున్సిపాలిటీ కౌన్సిలర్ గా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
13వ వార్డు అభ్యర్థి బొచ్చు మాధవి లత ప్రచారం
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/i0vGPu1YW4s?si=VEMl1XTexUQ7bDT4
మున్సిపాలిటీలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొచ్చు మాధవిలత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను కలిసి ఆశీర్వాదం కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు,వీధి దీపాల సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతిపత్రం ఇచ్చిన సర్పంచి సరిత
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గోదావరి తీరాన వెలసిన మల్లన్న దేవుని ఆలయానికి నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని మద్దులపల్లి సర్పంచి సరిత, ఉపసర్పంచి లచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సానుకూలంగా స్పందించి దేవాదాయశాఖ డిఈ రమేష్ కు ఆలయానికి సంబంధించిన వివరాలు చూడాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచి సరిత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో ముందంజ
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే.
మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి
కేసముద్రం/ నేటిధాత్రి
కేసముద్రం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 వ వార్డు అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు కేసముద్రం మున్సిపాలిటీ లో 7 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని తెలియజేశారు. కేసంద్రం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మరియు మాజీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు.7వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రడం శ్రీనుకి మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల మనసు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రచారంలో రడం శ్రీను, రడం నిఖిల్,గుండు గోపాల్, మాదాసు సారంగం, కోలిపాక వెంకన్న, చిలుముల సదానంద చారి, బండి రమేష్, బండి తోట వెంకన్న, కొనతం కోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాయికోడ్ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లో ఇటీవల మండల నూతన ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. నూతన కమిటీ అధ్యక్షులు నదరి రమేష్, ఉపాధ్యక్షులు సాయిరాం శెట్కార్, ప్రధాన కార్యదర్శి శ్రీను తదితరులు రాయికోడ్ లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ కమిటీ కార్యాలయం లో ఛైర్మెన్ సతీష్ కుమార్ (ప్రభాకర్ రావు )వైస్ ఛైర్మెన్ భీమన్న లు ప్రెస్ క్లబ్ నూతన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు అక్షంతలు వేసి ఆశీర్వచనం చేశారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్ తదితరులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి లో జర్నలిస్టు నాయకులు మరింత భాగస్వాములై తమ వృత్తిని కొనసాగించాలన్నారు. త్వరలో నిర్వహించే జాతర ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ ఆలయ కార్యక్రమాల కవరేజ్, ఆలయ అభివృద్ధి కి తమ సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఆలయ కమిటీ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, ధర్మకర్తల మండలి సభ్యులకు,నాయకులకు, అర్చకులకు, సిబ్బందికి నూతన ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి, వీరయ్య స్వామి, నాయకులు, అర్చకులు, సిబ్బంది సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న,ఇందూరి కృష్ణ,సందీప్ స్వామి, బస్వరాజ్ స్వామి, మఠం బస్వరాజ్ స్వామి తదితరులు ఉన్నారు.
నియోజకవర్గ సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల, నేటిదాత్రి :
https://youtu.be/i0vGPu1YW4s?si=VEMl1XTexUQ7bDT4
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున చిట్యాల, రేగొండ, టేకుమట్ల, ఘన్పూర్ గోరుకొత్తపల్లి, మొగుళ్ళపల్లి, శాయంపేట, భూపాలపల్లి 8 మండలాల సీఎం కప్ నియోజకవర్గ క్రీడలను ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అంతకుముందు విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఆరోగ్యానికి స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడంలో ఉపాధ్యాయులు అధికారులు ప్రోత్సహించాలన్నారు, అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కబడ్డీ ఆడి నారు, కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, క్రీడల కన్వీనర్ ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ తవు టం లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ మాజీ ఎంపిటిసి దబ్బేట అనీల్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధరి రవి, కాంగ్రెస్ నాయకులు చిలకల రాయకొమురు, బుర్ర లక్ష్మణ్ గౌడ్ , గుర్రపు నరసయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.