బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్…

బాల్య వివాహాలు జరుగకుండా అడ్డుకోవాలి కలెక్టర్

100 ఫిర్యాదు చేయాలి ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి .

 

బాల్యా వివాహాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.శుక్రవారం ఐ.డి. ఒ .సి ఆవరణలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గ్రామీణ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు వనపర్తి, మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలలో ఒక్కో జిల్లాలో 10 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు,చట్ట ప్రకారం పడే శిక్షల పై విస్తృత ప్రచారం చేయనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదాలు ఉంటాయన్నారు. పుట్టబోయే పిల్లలు శారీరక ఎదుగుదల లేకపోవడం తల్లి బిడ్డలు అనేక రోగాల బారిన పడి జీవితాలు నాశనం అయిపోతాయని తెలిపారు.బాల్య వివాహాలు చేసే వారి పై ఎలాంటి జాలి లేకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు వేయడం జెరుతుందని అన్నారు
ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 100..112 నెంబరు కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు బాల్య వివాహం చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, పెళ్ళికి వెళ్ళే బంధు మిత్రుల పై సైతం కేసులు పెట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని చెప్పారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. సంతకాల సేకరణలో భాగంగ ప్లెక్సీ పై సంతకాలు చేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఎస్ కోఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం ఆఫీసర్ చూచేత, సహాయ ప్రోగ్రాం ఆఫీసర్ జూవెద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి డి సి పి ఓ రాంబాబు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి…

బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి

బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన పేర్కొన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిషన్ వాత్సల్యలో భాగంగా బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసులు, వారి హక్కుల పరిరక్షణ తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్పించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేయాలని సూచించారు.

విద్యాలయాలు, హాస్టల్ లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై, 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థులను విద్యా ద్వారా సామాజికంగా, ఆర్థికంగా రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.

అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, చిల్డ్రన్ హోమ్ పనులు పూర్తి చేయిస్తామని, పిల్లల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీ వీహెచ్ఓ రవీందర్ రెడ్డి, డీఈఓ వినోద్ కుమార్, డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జీసీడీఓ పద్మజ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version