వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…

వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…

ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డ్ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి మినుగు ముని అంటున్నారు. గద్దె రాగడి ఏరియాలోని కాలనీలలో గడపగడపకు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు.ఎనిమిదవ వార్డు ప్రజలు అవకాశం ఇస్తే కాలనీలలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. స్థానిక బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత- సత్తయ్యలు సైతం కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండడంతో గెలుపు లాంచనమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో మేరుగు రాజేశం, కుర్మ గురువయ్య, దినేష్, దేవి సాయి కృష్ణ, రాజ్ కుమార్, శ్రీనివాస్, వంశీ, రాజేందర్, సాంబయ్య, మనోహర్, రమేష్, మొండయ్య, హరీష్ లు పాల్గొన్నారు.

ఝరాసంగం లో పర్యటించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

ఝరాసంగం లో పర్యటించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆-: ఝరాసంగం మండలం చిలమామిడి, జీర్లపల్లి, బొప్పన్పల్లి, కొల్లూరు,

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం,కుప్పానగర్ ,ఈదులపల్లి,చిల్కేపల్లి* గ్రామాలలో పర్యటించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ గారి సహకారంతో నియోజకవర్గ గ్రామాలు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం.మళ్లీ గ్రామలు అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిలను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు.ఎమ్మెల్యే గారితో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్ ,ముర్తుజా, దీపక్ , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version