చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..

చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..

 చిత్తూరు జిల్లాలో ఏనుగులు (Elephants) గత కొంతకాలంగా అడవిని దాటి జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిత్తూరు నగరవాసులను గజరాజులు గజగజలాడించాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు.. ఏకంగా నగరం నడిబొడ్డుకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు అడవి మార్గం తప్పిపోయాయో.. లేక ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయో తెలీదు కానీ, రెండు ఏనుగులు నగరం మధ్యలోకి రావడంతో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
సంతపేటలో ఏనుగుల సంచారం..

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సంతపేట ప్రాంతంలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయి. తెల్లవారుజామున వీధుల్లో ఏనుగులను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా పంట పొలాల్లో కనిపించే ఏనుగులు.. జనసంచారం అధికంగా ఉండే నగర వీధుల్లోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. భయంతో పరుగుపరుగున ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version