జర్నలిస్టు దంపతులకు అండగా నిలిచిన మీడియా లోకం
యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ నాయకుల ఏకగ్రీవ మద్దతు
సుత్తి కొడవలి నక్షత్రం’ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ ఎర్రం అనూష సతీష్ కుమార్ విజయానికి జర్నలిస్టు లోకం ఏకమైంది. శుక్రవారం 27వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు మద్దతుగా తోటి జర్నలిస్టులు పైలెట్ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
పార్టీలు, యూనియన్లకు అతీతంగా తరలివచ్చిన జర్నలిస్టులు.. తమ తోటి జర్నలిస్ట్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో పాల్గొన్న కాకతీయ ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… ప్రజల సమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు నేడు నేరుగా ప్రజా సేవలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. “అనూష సతీష్ కుమార్ గెలిపిస్తే, జర్నలిస్టులందరం కలిసి ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకువస్తాం. పైలెట్ కాలనీతో పాటు 27వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఓటర్లకు భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న విద్యావంతురాలైన అనూష సతీష్ కుమార్ను గెలిపించడం ద్వారా వార్డు రూపురేఖలు మార్చుకోవచ్చని వారు నినదించారు. సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఖ్యాతం సతీష్ కుమార్, సామంతుల శ్యామ్, జల్ది రమేష్, ఎడ్ల సంతోష్, అంబాల సంపత్, తడుక సుధాకర్, గుజ్జ సారేశ్వరరావు, రవీందర్,
ములకల లక్ష్మారెడ్డి, చెరుకు సుధాకర్, సమ్మయ్య, కడపాక రమేష్,కొంకుల
సాంబయ్య, వెంకన్న,ప్రవీణ్, రజినీకాంత్, రాంబాబు,
జగన్, పవన్, చంద్రమౌళి, సృజన్, సుమారు 50 మంది సీనియర్ జర్నలిస్టులుపాల్గొన్నారు.
