రాయికోడ్ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం…

రాయికోడ్ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లో ఇటీవల మండల నూతన ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. నూతన కమిటీ అధ్యక్షులు నదరి రమేష్, ఉపాధ్యక్షులు సాయిరాం శెట్కార్, ప్రధాన కార్యదర్శి శ్రీను తదితరులు రాయికోడ్ లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ కమిటీ కార్యాలయం లో ఛైర్మెన్ సతీష్ కుమార్ (ప్రభాకర్ రావు )వైస్ ఛైర్మెన్ భీమన్న లు ప్రెస్ క్లబ్ నూతన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు అక్షంతలు వేసి ఆశీర్వచనం చేశారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, నాయకులు బి. సంగమేశ్వర్ పాటిల్ తదితరులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి లో జర్నలిస్టు నాయకులు మరింత భాగస్వాములై తమ వృత్తిని కొనసాగించాలన్నారు. త్వరలో నిర్వహించే జాతర ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ ఆలయ కార్యక్రమాల కవరేజ్, ఆలయ అభివృద్ధి కి తమ సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఆలయ కమిటీ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, ధర్మకర్తల మండలి సభ్యులకు,నాయకులకు, అర్చకులకు, సిబ్బందికి నూతన ప్రెస్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు బసంతి, వీరయ్య స్వామి, నాయకులు, అర్చకులు, సిబ్బంది సంగమేశ్వర్ పాటిల్, డాక్టర్ వెంకటేశం, సంగన్న,ఇందూరి కృష్ణ,సందీప్ స్వామి, బస్వరాజ్ స్వామి, మఠం బస్వరాజ్ స్వామి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version