డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పల్లెర్ల నిరంజన్ రెడ్డి డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ 2025 సంవత్సరమునకు గాను గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ యూనివర్సిటీ యు ఎస్ ఏ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల 28/06/2025 రోజున చెన్నయ్ స్నాతకోత్సవంలో పాల్గొన లేకపోయారు ఈ డాక్టరేట్ ని గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి విజయ్ మోహన్, సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత యునివర్సిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఈ రోజు హానరరి డాక్టరేట్ పట్టా ప్రదానోత్సవం కెటిపిపి చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగడ ప్రకాష్ చేతుల మీదుగా జెన్ కో కాలనీలో నిరంజన్ రెడ్డి కి అందజేశారు
ఈ సంధర్భంగా గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు అత్యంత ప్రతిభావంతులైన వారిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేయడం అందులో క్యాతపల్లి గ్రామ వాస్తవులైన పల్లెర్ల పుల్లారెడ్డి పూలమ్మ దంపతుల కనిష్ట కుమారుడైన పల్లెర్ల నిరంజన్ రెడ్డి మా కెటిపిపి ఇంజనీర్ కి అంతర్జాతీయ స్థాయి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం గర్వించదగ్గ విషయం అని మీ అత్యుత్తమ కృషి మరియు విజయాలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ అవార్డును ప్రదానం చేయడానికి మేము సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ ముత్యాల రావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లు కాటం రవి, మాకుల సంతోష్, జెరిపోతుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

 

“Vijetha Supermarket” launched in Shankarpally

శంకర్‌పల్లి, నేటిధాత్రి :
“విజేత సూపర్ మార్కెట్ ” తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంత ప్రఖ్యాతి పొందింది. అలాంటిది మన శంకర్‌పల్లి పట్టణంలోని వాణిజ్య రంగానికి కొత్త ఒరవడి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “విజేత సూపర్ మార్కెట్” గురువారం చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ “ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వినియోగ సామగ్రి నాణ్యతతోపాటు సరసమైన ధరలకూ అందుబాటులో ఉండేలా ఈ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం,” అని పేర్కొన్నారు.
స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఈ మార్కెట్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే
విజేత సూపర్ మార్కెట్ యజమానులు మాట్లాడుతూ,
“ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నదే మా ముఖ్య లక్ష్యం. నిత్యం తక్కువ ధరలకు అధిక నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులో ఉంచుతాము. కస్టమర్ల విశ్వాసమే మా శక్తి” అని తెలిపారు.

సూపర్ మార్కెట్‌లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, ప్యాకెజ్డ్ ఫుడ్, గృహోపయోగ వస్తువులు, మరియు ఇతర డైలీ నీడ్ ఉత్పత్తులు సమృద్ధిగా లభించనున్నాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధిలో భాగంగా శంకర్‌పల్లిలో ఇటువంటి సదుపాయాలు ఏర్పడటం సంతోషకరమని స్థానికులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు

*ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు*

 

నడికూడ,నేటిధాత్రి:


ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించి వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక సంఘం పీఆర్టీయూ టీఎస్ మాత్రమే అని హనుమకొండ జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి అన్నారు. గురువారం రోజు నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ లోకానికి ఎన్నో సౌకర్యాలు కల్పించిన సంఘం పీఆర్టీయూ మాత్రమే అని, అతి త్వరలోనే జిపిఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించే దిశగా సంఘం కృషి చేస్తుందని,మిగతా పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సాధ్యమైన తొందరగా క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తామని,ఉపాధ్యాయ బదిలీలు,పదోన్నతులు ఇప్పించిన సంవత్సరంలోనే మళ్ళీ త్వరలోనే పదోన్నతులు కల్పించే దిశగా పిఆర్టియు టి ఎస్ సంఘం కృషి చేస్తుందని,ఇంకా ఎన్నో సమస్యలు త్వరలోనే పరిష్కరించే దిశగా సంఘం కృషి చేస్తుందని అన్నారు. మండలంలోని కంఠాత్మకూర్, కౌకొండ,నడికూడ,వరికోల్, రాయపర్తి, నార్లాపూర్, చర్లపల్లి,పులిగిల్ల ఉన్నత పాఠశాలలు తిరిగి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి కట్టుకోజ్వాల సతీష్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోడం రాజేందర్ బాబు,నన్నేసాహెబ్,శ్రీధర్ రెడ్డి, బురుగు శంకర్ జిల్లా బాధ్యులు శరత్ గౌడ్,నగేష్ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 56మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు తవక్కల్ విధ్యాసంస్థల అధినేత, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ,గాండ్ల సమ్మన్న మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ గురుపౌర్ణమి సంధర్భంగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ మంచి కార్యక్రమాన్ని చేయడం హార్షనీయమైన గత 8సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్ పట్టణంలో యువత జనం సభ్యులు సేవలు చేస్తున్నారనీ భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువ మంది సేవలు చేయాలని సంస్థ సభ్యులనీ అభినందించారు … యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు రమాదేవి శోభ నాయకులు గూడ సత్తన్న,కోక్కుల సతీష్ సంగ రవి యాదవ్ భాస్కర్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే

*నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే*

*బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శి సబ్బని హరీష్*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సబ్బని హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుంది తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్లను చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుంది. దీనివల్ల వాళ్లు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారు

బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటివరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి విద్యా వ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర తీశారు.స్వయానా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గురుకులాల్లో విషాహారం, పాము కాట్లు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పుడు నర్సింగ్ కళాశాల విద్యార్థుల ను హాస్టల్ నుండి గెంటి వేతలు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది
ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థుల హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము చూస్తూ ఊరుకోం వెంటనే వాళ్ళ స్టైఫండ్ విడుదల చేయాలి.
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు అందరితో కలిసి ఆయా కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని
బిఆర్ఎస్వి పక్షాన హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టల సాయి దీపక్ రాచమల్ల మోహన్ కనుకుంట్ల వెంకటరమణ రాచమల్లు రామ్, భరత్,రాము,చిరంజీవి, నరేష్, సోఫీయాన్, మణి దిప్ సాయి తదితరులు పాల్గొన్నారు

మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు వుంది

*మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు వుంది…

*కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు..

*విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నత శిఖరాలకు ప్రభుత్వ విద్య..

*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ క్రీడా పై శిక్షణ ఏర్పాటు చేస్తాం..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 10:

విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి కొర్లగుంట లోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పొశారు. అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్, షూ లు అందిస్తున్నారని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13000 జమ చేయడం జరిగిందని తెలియజేశారుదేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. చదువుతోపాటు ఆటపాటల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తెలివితేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడ పై శిక్షణ ఏర్పాటు చేస్తామని ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు తుడా తోపాటు తన వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని పాఠశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్
మాస్టర్, రవిచంద్రన్, ఇన్ చార్జీ,
హెడ్
మా
స్టర్ రవికుమార్, పాఠశాల చైర్మన్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.

కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

వనపర్తి నేటిదాత్రి :

గురుపౌర్ణిమ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం ము ఎన్ టి ఆర్ లలిత కళాతోరణం లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పిలుపుమేరకు గురువులను మహిళ మోర్చా నేతలు గురువులు రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీవెంకటేశ్వర ఆలయ చైర్మన్ అయ్యలూరి రంగనాథచార్యులు విజయకుమార్ శ్రీమతి శ్యామల,

స్వర్ణముకి అకాడమీ చైర్మన్ నాట్యకలా వి నీరజ దేవి లను ఘనంగా సన్మానము చేశారు వారు గురువుల ఆశీర్వాదం తీసున్నారు సన్మానము చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి శ్రీమతి నారాయణదాసు జ్యోతి రమణ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత మాజీ జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా కల్పన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి సుగూరు లక్ష్మి, అర్చన తదితరులు.ఉన్నారు

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట లో మే 2025 నెలలో నిర్వహించిన బిఏ,బికామ్,బిఎస్సి (లైఫ్ సైన్సెస్),బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామ్ చంద్రం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాల అటానమస్ సెమిస్టర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కాకతీయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్ రెడ్డి అభినందించారని అన్నారు.అనంతరం ప్రిన్సిపాల్ ఫలితాల వివరాలు తెలిపారు.బిఎస్సిలో 41.74 శాతం,
బి.ఏ లో 51.85 శాతం,బి.కామ్ లో 39.02 శాతం పాస్ కాగా మొత్తం 42.62 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు క్యూ.ఆర్ కోడ్ తో పాటు లింక్ ద్వారా అందుబాటులో కళాశాల వెబ్సైట్ లో ఉంటాయని తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కళాశాల విద్య కమీషనర్ ఎ.శ్రీదేవసేన, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫలితాల విడుదల ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ ఎస్. కమలాకర్,అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజీరు,
డాక్టర్ భద్రు, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్ పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

మరిపెడ నేటిధాత్రి.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరకజాల తండా పూర్వ విద్యార్థి భానోత్ అనిల్ కుమార్, ప్రస్తుతం వారి స్వంత తండ పాఠశాల లోని విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ప్రహారీగా గ్రీన్ మ్యాట్ ను సైతము బహుకరణ చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బానోత్ వినోద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ . హఫీజర్, సహోపాధ్యాయురాలు గీతా దేవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంత్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం సత్కరించడం జరిగింది.

ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు

రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అమలు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల గీతానగర్ బడిలో మొదలు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జెడ్పి.హెచ్.ఎస్ లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులకు కట్టెల పొయ్యి పై ఆహార పదార్థాలు సిద్ధం చేయవద్దని సూచించారు. దీంతో వాతావరణ కాలుష్యం, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిల్లాలోని 458 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
గ్యాస్ స్టౌ పై సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధముగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ లపై సిద్దం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా సిరిసిల్ల లోని గీతా నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పినచ్చాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పినచ్చాలి

పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో సకాలం లో అందజేయాలి

విద్య హక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి

కార్పొరేట్, ప్రైవేటు విద్య సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి

విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి

గుండాల మండల కార్యదర్శి గడ్డం వరుణ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

మండల లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలికవసతులు కల్పించాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు దోపిడీని అరికట్టాలినీ, విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏంఈఓ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి వరుణ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం పున ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నసందంగా కనిపించడం బాధాకరం అని అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నిచోట్ల అరకొర వసతులు మాత్రమే ఉన్నాయని సరిపడ గదులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని . ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ హైస్కూల్లో వన మహోత్సవం.

కాకతీయ హైస్కూల్లో వన మహోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత చెట్లను మనం రక్షించినట్లయితే చెట్లు మనలను రక్షిస్తాయి చెట్లు నాటడం వలన పర్యావరణం సమతుల్యంగా ఉండి సకాలంలో వర్షాలు పడి నీటి ఎద్దడి ఉండదు చెట్లు మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి చెట్లు కార్బన్డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చి ఆయుష్షును పెంచే విధంగా చేస్తాయి చెట్లు అనేక జీవులకు నివాసం కల్పించి మనకు పండ్లు వేసవికాలంలో నీడనిచ్చి సేద తీరుస్తాయి అందుకే విద్యార్థులు మీ ఇంటి ముందు గానీ ఖాళీ ప్రదేశాలున్నచోట మొక్కలు నాటాలని కోరారు ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ ఆఫీస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్

Parakala నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించారు.మల్లక్కపేట పాఠశాలలో ప్రిన్సిపాల్ మరియు సిబ్బందితో ఎస్ఎఫ్ ఐ నాయకులు కలిసి మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు చెప్పి తీసుకురావాలని బడి బాట కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ స్కూల్లో చదివితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వ పాఠశాలను రక్షించాలన్నారు.గతంలో మూసి ఉన్న హైబోతు పల్లె స్కూల్.ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా తిరిగి ప్రారంభించారన్నారు.ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కళ్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మణికొండ ప్రశాంత్,పట్టణ కార్యదర్శి కోగిల సాయి తేజ,రాజశేఖర్ పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు.!

ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

◆: ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రవైట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయిలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లల కోసం ఉచితంగా కేటాయించాలని ఇది 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించా లని  అన్నారు.

విద్యా హక్కు చట్టం (RTE) 2009

 

 

, ప్రైవేట్ పాఠశాలలు

RTE చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయి తరగతుల్లో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని అన్నారు.ఈ సీట్లలో పిల్లలకు ఉచితంగా విద్యను అందించి, పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలను కూడా అందించాలని, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ఎలాంటి ప్రవేశ రుసుములు లేదా వార్షిక రుసుములు వసూలు చేయకూడదని అన్నారు.

 

 

 

 

 

చట్టం పొరుగు పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తుంది. ప్రతి పిల్లవాడు తమ ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాల కోసం పిల్లలను స్క్రీనింగ్ చేయడం లేదా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని  ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

 

 

 

 

ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు నిధులు సమకూర్చాలి, తద్వారా వారు ఉచిత విద్యను అందించగలరని,ప్రభుత్వాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కోరుతున్నాయి, తద్వారా వారు తమ పిల్లల విద్య కోసం ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చుని RTE చట్టం ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను వివక్షత లేకుండా చేర్చుకోవడానికి, వారి విద్యకు హామీ ఇవ్వడానికి ఉద్దేశించబడిందని,ఈ చట్టం అమలులో ప్రభుత్వాలు,ప్రైవేట్ పాఠశాలలు రెండు బాధ్యత వహించాలని అన్నారు.ప్రభుత్వాలు నిధులు అందించడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు సహాయం చేయాలని, తద్వారా విద్యార్థుల హక్కులను కాపాడడానికి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవచ్చని అన్నారు.

బాల్యం పై పుస్తకాల భారం…?

బాల్యం పై పుస్తకాల భారం…?

పెరుగుతున్న బడి పుస్తకాల బరువు…

కిలోల కొద్ది బరువును విద్యార్థుల వీపునకు తగిలిస్తున్న వైనం…

పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుందా?..

బరువుకు మించిన బడి సంచి…

విద్యార్థులకు తప్పని తిప్పలు…

అమలు కానీ నో బ్యాగ్ డే…

పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి…

నేటి ధాత్రి

 

 

 

-మహబూబాబాద్ -గార్ల :- ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్య బోధనతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.అడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్త కాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది.ఏటా పై తరగతికి వెళ్తుంటే, పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది.

 

 

 

 

 

ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు,బ్యాగు నిండా పుస్తకాలతో నాలు గైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలా మంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యల తో సతమతమవుతు న్నారు.విద్యార్థులకు గుణాత్మక నైపుణ్యత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం చెబుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు.పుస్తకాల భారం తగ్గించాలని,2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ప్పటికీ,వాటిని అమలు చేయడం లేదు,దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.

 

 

 

 

మరోవైపు పిల్లలపై పుస్తకాల భారం వలన వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.పాఠశాల బ్యాగుల బరువు, తరగతి గదిలో అవసరమయ్యే పుస్తకాల సంఖ్య, ఇంటి వద్ద చదవాల్సిన హోంవర్క్ పుస్తకాల పరిమాణం అన్నీ కలిపి పిల్లలపై అధిక భారాన్ని పెంచుతున్నాయి.బరువైన పుస్తకాలు మోయడం వలన వెన్నునొప్పి,కండరాల నొప్పులు, భుజాల నొప్పి వంటి శారీరక సమస్యలు వస్తాయి. పుస్తకాల భారం పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 

 

 

 

చదువుపై ఏకాగ్రత తగ్గడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.అవసరం ఉన్న లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి కిలోల కొద్ది బరువులను విద్యార్థుల వీపునకు తగిలిస్తున్నారు. పోటీ చదువుల పేరిట అటు తల్లిదండ్రులు,ఇటు పాఠశాల యాజమాన్యాలు పిల్లలపై పుస్తకాల భారం మోపుతున్నారు.ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టమొచ్చినట్లు పుస్తకాలు అంటగడుతున్నారు.

 

 

 

 

 

దీంతో పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుంది. పాఠశాలలు పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేలా ఆయా పాఠశాలల్లో ర్యాక్స్ ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలల్లోనే ఉంచుతూ,హోంవర్క్ పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని విద్యావంతులు, మేధావులు,ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా విద్యాబోధన ఉండాలని ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

నా తెలుగు భాష పుస్తకావిష్కరణ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పద్మశాలి భవనంలో మాణిక్ ప్రభు పాఠశాల ఆవరణలో శనివారం నా తెలుగు భాష అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ సీనియర్ సివిల్(జడ్జ్) న్యాయమూర్తి గంటా కవితా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నా తెలుగు భాష అనే పుస్తకాన్ని రచయిత పివి భైరవన్ శర్మ రాశారు. ఈ కార్యక్రమం సమాచార్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా న్యాయ మూర్తి గంటా కవితదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించి నా తెలుగు భాష అనే పుస్తకాని ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ ముందుగా మాణిక్ ప్రభు పాఠశాల క్యారస్పాండెంట్ వెంకటయ్య ను అభినందించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయులను, తల్లి తండ్రులకు మంచిపేరు తేవాలని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు పది సంవత్సరాలు కష్టపడి చదివితే విద్యార్థుల జీవితాలు మంచి స్థాయిలో ఉంటారని, విద్యార్థులు మీ సంతకం గురించి వేరేవారు ఎదురుచూతారో అపోయూడు విద్యార్థులు సక్సెస్ అవుతారని అన్నారు. అనంతరం రచయిత భైరవన్ శర్మను న్యాయమూర్తి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్ లు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహేబూబ్, హరికృష్ణ, ఆకాష్, మహా రుద్రయ్య స్వామి, సంజీవ్ కుమార్, అత్తర్, రాజేందర్, యువరాజ్, మధు మాణిక్ ప్రభు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థిని
మహాదేవపూర్ జులై 5( నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాల నుండి మాడిగ అక్షిత ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఇటీవల భూపాలపల్లిలో అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ లో జరగబోయే సబ్ జూనియర్ అండర్ 14 ట్రై అత్లాన్ విభాగంలో పాల్గొంటుందని,ఆ పాఠశాలపిడి గురుసింగ పూర్ణిమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO ప్రకాష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.సరిత మాట్లాడుతూ విద్యార్థిని అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ఉపాధ్యాయలు మడక మధు,సుధారాణి,సరితా దేవి,హోలీ పాషా, శ్రీనివాస్,వసుదప్రియ,వీరేశం,సమ్మయ్య,లీలారాణి,రజిత,సాహెదా బేగం,ప్రసూన, దీపిక,ఆంజనేయులు, అజ్మత్ పాషా లు విద్యార్థినిఅభినందించారు

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version