ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

 

బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

మండల విద్యాధికారి కాలేరు యాదగిరి

2025 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన పెనుగొండ ఉన్నత పాఠశాల విద్యార్థికి సన్మానం:

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల యశ్వంత్ సాయిని మరియు అతని తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల శ్రీను, సరస్వతి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి చిన్నప్పటి నుండి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయుటకు ఈ విద్యార్థి సాధించిన మార్కులే నిదర్శనమని తెలియజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అందుకు మా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉంటాయని తెలియజేశారు. జడ్పిహెచ్ఎస్ పెనుగొండ పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పెనుగొండ పాఠశాలలో అత్యుత్తమమైన విద్యా బోధన మా పిల్లలకు అందుతుందని మా పిల్లల్ని తల్లిదండ్రుల వలె ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో చదువు నేర్పుతున్నారని చెప్పారు. ఈ సన్మాన సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య, హుస్సేన్, వెంకటగిరి, భాస్కర్, సత్యం, రవి, భీముడు, కిషన్, మల్లేశం, విజయ్ చందర్ మరియు అప్పరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేశారు.

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి..

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ

 

quality education

ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ ,
చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం

పరకాల నేటిధాత్రి

 

 

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగ అని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, పంచాయతీ కార్యదర్శి సుమలత,పాఠశాల చైర్మన్ దుమాల లక్ష్మి, కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్ ఉప్పరి భద్రమ్మ ఆయాలు,తల్లిదండ్రులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా గ్రామ కూడలిలో గ్రామ సభ గ్రామస్తులు, విద్యార్థుల చే నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు, రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే పాఠశాల లు మూత పడి పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, కావున ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు ప్రతి గ్రామస్తుడు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సాధించిన విజయాలపై “కరపత్రాలు “ముద్రించి గ్రామ సభ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ పెద్దలు దూదిగాం గంగాధర్, లక్ష్మి నర్సయ్య, ప్రసాద్, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, రాణి, నర్మదా, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

నేటిధాత్రి, రాయపర్తి.

 

 

 

 

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కొండూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత మాట్లాడుతూ పాఠశాలలో మంచి నైపుణ్యము, ఉన్నత విద్యార్హతలు కల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు అన్ని విధాల విద్యా సంబంధమైన విషయాలు, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుటకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తూ వారు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా అన్ని విధాల వారికి సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రఘు, నాగరాజు, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్యా నాయక్, స్వామి, అమర స్వర్ణ, శివకృష్ణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, రజినీకాంత్, అనిత, గౌతమిలు పాల్గొన్నారు.

వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం.

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ

ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధన వసతులు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలి

బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలు వసతులు తల్లిదండ్రులకు తెలియచేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తేదీ జూన్ 6 నుండి 19 వరకు జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాల, బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఆయా ఏఎన్ఎం వివోఏలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యా బోధన, వసతులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వివిధ పోటీ పరీక్షలు జేఈఈ నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు.

 

School Walk Program

 

 

జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, పిల్లలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ శేషాద్రి, జిల్లా వైద్య అధికారి రజిత ,విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పురస్కారాలు.

విద్యార్థులకు.. పురస్కారాలు

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ కల్వకుర్తి మండలంలోని,
పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పదవతరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక సంతోష్ యువజన విభాగం అధ్యక్షుడు సంబు తరుణ్ కుమార్ ఆద్వర్యంలో మెమెంటో లతో సన్మానం కార్యక్రమం నిర్వహిoచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా దేశానికి ముందు నడపాలని విద్యార్థుల చేతుల్లోనే దేశ బాధ్యత ఉంటుందని ఇలాగే చదివి మంచి ప్రతి కనబడచాలని మరి అబ్దుల్ కలాం లాగా దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండలం అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, వాస శేఖర్ ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ మహాసభ నాయకులు, ఆర్యవైశ్య సంఘం మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

-బడిబాట కార్యక్రమం ను విజయవంతం చేయాలి

-ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

–మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక

మంగపేట-నేటిధాత్రి

 

 

 

ప్రభుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అధిక సంఖ్యలో చేసి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దీనికోసం చేపట్టే బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని మంగపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ లో పాల్గొన్న మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు మంగపేట ఉన్నత పాఠశాల గెజిటెడ్
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక
అన్నారు.

 

Quality education

 

ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గూర్చిఅవగహన కల్పించడం జరిగింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య ,ల్యాబ్ సౌకర్యం,ఆటపాటలతో కూడిన విద్యార్థి కేంద్రీకృత విద్యాబోధన,ఉచిత యూనిఫాంలు,పుస్తకాలు, నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం,ఆడపిల్లలకు కరాటే శిక్షణ,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తదితర ఎన్నెన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని ,కావున విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాల్లో నమోదు చేపించి ప్రభుత్వం పాఠశాల లకు పూర్వ వైభవం కల్పించాలని ,ఈ దిశగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని,తద్వారా నేటినుండి చేపట్టబడినప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంను విజయ వంతం చేయాలని అన్నారు.

 

Quality education

 

ఈ సందర్భంగా బడిబాట ర్యాలీ ని కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకటస్వామి,ఉపాధ్యాయులు , సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, అనంత రావు ,వందన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన
• గ్రామ సభలో గ్రామస్తులకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం “మనబడి మన – బాధ్యత” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన విద్యాబోధన లభిస్తుంది అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ వడ్ల నర్మద, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు గణేష్, దశరథం, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ పుష్పలత, గ్రామస్తులు బురాని మంగ, బురాని వాణి, ఉడెపు శ్రీశైలం, మంగలి అమరేందర్ లు ఉన్నారు.

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజన పథకం,ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చిన్న కిష్టాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాటోత్ ప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, సర్వన్ తండ, ఎస్ టీ కాలనీ, మంగలి తండ గ్రామాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శనగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా జాటోత్ ప్రసాద్ మాట్లాడుతూ, నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, యువతి, యువకులు తమ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా చైతన్య పరచాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సయ్య, కిరణ్, గ్రామ యువకులు ఎం. సురేష్, అంగన్వాడీ టీచర్ లు మాలోత్ నీలా దేవి, బోడ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో బడిబాట గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ దొండి రావు పెట్లోళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్డు, రాగి జావ వడ్డిస్తారన్నారు.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం

సర్కారు బడిని బలోపేతం చేద్దాం

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు , సర్కారు బడిని బలోపేతం చేద్దామని డీఈవో రవీందర్, ఎంఈఓ అనిత దేవి ఆదేశానుసారం మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం మరిపెడ మండల కేంద్రం లోని రాంపురం, చిల్లంచర్ల, భావోజిగూడెం, వెంకంపాడు గిరిపురం,తానంచర్ల, మండలంలోని వివిధ గ్రామాల్లో బడి బాట కార్యక్రమం చేపట్టారు, రాంపురం గ్రామంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణవేణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో విద్యార్థులను చేర్పించాలని వారు కోరారు.గ్రామాల్లోని పిల్లలను వారి తల్లిదండ్రులు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు.ఆర్థిక భారం తగ్గించుకుందామని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఇంగ్లీష్ మీడియం తో పాటు, కంప్యూటర్ విద్యాబోధన జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాగి జావా, పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్, అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శశిధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి అజయ్,ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి,హరి శంకర్, గణేష్,శ్రీనివాస్,కిన్నర శ్రీను, మన్సూర్ ఆలి,చంద్ర ప్రకాష్ విద్యార్థుల తల్లిదండ్రులు పరశురాములు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుడాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈవో) మొండయ్యకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించిందని రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలా మారుతుందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు వూర్తిస్థాయిలో అందివ్వాలని పాఠశాలలో సబ్జెక్టు వైస్ గా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు, ప్రతి పాఠశాలకు గ్రంథాలయం, డిజిటల్ క్లాసులకు అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ మరియు ఎన్విరాల్న్మెంట్, ఎక్విప్మెంట్స్ పెంచుకునేందుకు ప్రతి పాఠశాలకు జిల్లా వ్యాప్తంగా సరిపడ గ్రాండ్స్ విడుదల చేయాలని అన్నారు.
జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలలో కనీసం టాయిలెట్స్, పాఠశాల
కాంపౌండ్ వాల్, కరెంటు, వాటర్ సదుపాయం కల్పించాలని అదేవిధంగా కాలిగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని, ఈఅంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్పించేలా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ పవణ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు.

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు ప్రవేశాలు

మరిపెడ:నేటిధాత్రి.

 

 

 

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో దోస్తు రెండవ విడతఅడ్మిషన్లు ప్రారంభమైనాయని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం పరిసర గ్రామాలలో పర్యటించి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలలో గల కోర్సుల వివరాల ను మరియు కళాశాల యొక్క వసతులను వివరించారు కళాశాలలో గల గ్రూపులు బిఎస్సి, ఎంపీసీ ,బీజేపీ ,
బి కం కంప్యూటర్ అప్లికేషన్ ,కోర్సులు గలవు అదే విధంగా టైలరింగ్ నేర్పబడును అని కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ తెలిపారు.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కల్వల బడి బాట కార్యక్రమం ను మంగళవారం కల్వల సమీపంలో గల బావోజీ తండ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బడి బాట కార్యక్రమం లో భాగంగా రోడ్ ప్రక్కన వ్యవసాయ పని చేస్తున్న గ్రామ ప్రజలను కలిసి, ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాల పై ప్రభుత్వ తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు తో పాటు, ఉద్యోగ,ఉపాధి అవకాశాల ల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అని నొక్కి వక్కానించారు. అవసరమయితే సుదూర ప్రాంత తండా పిల్లలకు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నందున వారికి రవాణా నిమిత్తము ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ,స్వరూప ,క్రిష్ణ, శ్రీదేవి, మోహనకృష్ణ ,తండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version