ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలి
నడికూడ,నేటిధాత్రి:
యూఎస్ పిసి స్టీరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి డిమాండ్
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో నడికూడ మండలంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నడికూడ మండల తహసిల్దార్ రాణి కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపాలని కోరనైనది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నందున సమస్యల పరిష్కారానికి యూఎస్ పిసి మూడు దశలలో పోరాటానికి సిద్దమైనదన్నారు.మొదటి దశ పోరాటంలో బాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల ద్వారా వినతిపత్రాలు ఇస్తున్నామన్నారు.వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రాథమిక పాఠశాలకు ప్రతి తరగతికొక టీచర్ ను నియమించాలని,టీచర్ల క్రమబద్ధీకరణ జీవో 25ను సవరించాలని, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులు,డీఏలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ఉద్యోగులకు పిఆర్సి ని అమలు చేయాలని కోరారు.సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
యూఎస్ పిసి నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ మాట్లాడుతూ 2008 డీఎస్సీ కాంట్రాక్టు టీచర్లకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని,సమగ్ర శిక్షలో కొనసాగుతున్న వెట్టిచాకిరి శ్రమదోపిడి విధానాన్ని రద్దుచేసి,ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ఎస్ ఎస్ ఎ ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆగష్టు ఒకటిన జిల్లాలల్లో, ఆగష్టు 23న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
వినతి పత్రం అందించినవారిలో యుఎస్ పిసి మండల నాయకులు శ్రీనివాస్,సుభాని, రవిందర్,కృష్ణంరాజు,విక్రమ్ గౌడ్,సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.