విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు
బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్
పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కాలేజీల్లో నేలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రేపు విద్యార్థి సంఘల నాయకుల ఆధ్వర్యంలో బంధు ప్రకటించడం జరిగింది.ఈ బందుకు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్ సంపూర్ణ తెలుపుతున్నామని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని అనేక ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాటాలు చేశామని,ఎంత చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని,పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నిధులను కేటాయించాలని,బెస్ట్ అవైలబుల్ నిధులను విదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.