బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.
ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి.. పనిచేసే వారికే పట్టం కట్టండి. మండలంలో ఎవరికిచ్చిన పార్టీకి అతీతంగా కార్యకర్తగా పనిచేస్తాను.
మండలంలో. త్వరలో రానున్న తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవులపై మండలంలో కొందరు నాయకులు పార్టీ ఏదైనా సరే పనికట్టుకొని అవసరమైన ఆరోపణలు చేస్తూ పార్టీకి భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు.
ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల అధ్యక్ష స్థానంపై ఎందరిదో కనుపడిందని.
అధికారం ఉంది కదా అని ప్రచారం చేస్తున్న నాయకులు ఇదే విషయమై.ముందుకు రాకపోగా పేరు చెప్పుకో పోగా తెరవెనక రాజకీయాలు నడిపిస్తున్నారని జగమెరిగిన సత్యం.
ఇంతకముందు కొన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి సేవకుడిగా ఉన్న వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అరెస్టులకు వెనుకాడకుండా జైలు జీవితం గడిపి.
ఒకప్పుడు.అధికార పార్టీకి భయపడకుండా వెనుకాడకుండా మండలంలోని ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ.
అధికార పార్టీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుసమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.
మండలంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నిలిచిన.
మండల పార్టీ అధ్యక్షుడు నాయకుడు.
అని అటువంటి నాయకుడిపై దొంగ మాయ మాటలు చెప్పి పబ్లిక్ పరంగా అతనిపై వ్యతిరేకత. తమకు అనుకూలంగా ఉన్న.
పత్రికలలో.
వ్యతిరేకత వార్తలు పెడుతూ మండలంలో.
ప్రజలకు ఏదో జరుగుతుంది అనే సంకేతాలు పంపిస్తున్నారని.
ముసుకు రాజకీయాలు .
కార్య పాలు చేస్తున్నారని అందరికీ తెలుసునని.
అటువంటి నాయకులు.
ముందుకు రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారని తెరవెనక రాజకీయాలు మానుకోవాలని.
నీతిగా పనిచేసే వారికే పట్టం కట్టించాల్సిన బాధ్యత సంబంధిత నాయకుల పై ఉందని దీనిపై సమగ్రంగా ఆలోచించాలని.
అలాగే మండలంలో ఎటువంటి సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందుండే నాయకుడు కావాలని.
ఒకవేళ అధిష్టానం నిర్ణయించి సదురు ఉన్న అధ్యక్షుడిని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గాని తీసుకువెళ్తే ఇక్కడ ఉన్న సామాన్య యువ నాయకుడు పార్టీకి పనిచేసే నాయకుడు కావాలని అలాంటి సమయంలో.
పనిచేసే నాయకునికే పట్టం కట్టాలని మెజార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలుకోరుకుంటున్నారు.
వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండే నాయకుడు కావాలని ఇంత కుముందు పని చేసే నాయకుడు.
అటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆదుకున్నారని ఇంతకముందు అధికార పార్టీ నాయకులు మామీద కేసులు పెట్టిన అరెస్టుకు ప్రయత్నాలు కేసులు పెట్టిన మాకు అండగా నిలిచిన ఏకక నాయకుడు మండల అధ్యక్షుడు అని.
జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం లో మంచి పేరున్న నాయకుడు మన మండల అధ్యక్షుడు ప్రవీణ్ అని.
అధిష్టానం ఆలోచన చేసి మండల అధ్యక్ష.పదవిని. ఎస్సీ. ఎస్టీ. బీసీ .మైనార్టీ. పార్టీలో పనిచేసిన నాయకులకు ఎవరికిచ్చిన పార్టీ అధిష్టాన నాయకత్వం ఆలోచన చేసి పార్టీకి పనిచేసే నాయకుని కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని
ఈ సందర్భంగా మండల ప్రజలు అనుకుంటున్నారు అలాగే.
మండల అధ్యక్ష పదవిపై .
ఆరోపణ చేస్తున్న సదరు నాయకులు తెరమీద కొచ్చి తమ పేరు చెప్పి మాట్లాడాలని తెరవెనుక రాజకీయాలు మానుకోవాలని ఇకనైనా ప్రజలకు మంచి చేయాలి తప్ప మంచి చేస్తున్న నాయకులను ఓర్వలేక అనవసర ఆరోపణ చేయడం మానుకోవాలని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు . కోరుతున్నారు
బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ప్రభుత్వ భూములను కాపాడండి అంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం సమర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రి మండలం లో మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 ఎకరం 30 గుంటలు, మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి పై అధికారులకు, వినతి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ గాజుల బాలకిష్టయ్య మనవరాలు లక్ష్మి (రమ్యశ్రీ )-భగత్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాలోన్నారు.
కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులుగ బుర్ర లక్ష్మణ్ గౌడ్.
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం కాంగ్రెస్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి తెలిపారు, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి* నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం మేరకు చిట్యాల మండల కేంద్రం కార్యకర్తలు నాయకులు జిల్లా, మండల నాయకత్వం సమావేశంలోచిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులుగా బుర్ర లక్ష్మణ్ గౌడ్* ఏకగ్రీవంగా రెండోసారి జరిగింది. ఈ సందర్భంగా బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నా ఎన్నిక కుసహకరించిన ఎమ్మెల్యేకు జిల్లా నాయకులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల టౌన్ ఎంపీటీసీ లా పరిధి ఇంచార్జ్ లు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మరియు జయశంకర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి పింగిలి జ్యోతి, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిలకల రాయకుమురు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ మండల నాయకులు చిలుములరాజమౌళి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని బిజెపి నాయకులు సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూత న వధూవరులను ఆశీర్వదిం చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందు పట్ల కీర్తి రెడ్డి నూతన దంపతు లను అక్షింతలు వేసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు చదువు రామచంద్రా రెడ్డి మండల అధ్యక్షులు నర హరి శెట్టి రామకృష్ణ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ కానుగుల నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు సుధాకర్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ బిల్లా రాజ్ కుమార్ దేశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.
చిట్యాల నేటిధాత్రి:
జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్* ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు* వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య* సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు* కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,* ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి
నేటిధాత్రి మొగుళ్ళపల్లి
భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా గందె వెంకటేశ్వర్లు
అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేస్తా-గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్స్ పేస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రేటర్ గందె వెంకటేశ్వర్లు ను,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ,కోశాధికారిగా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Gande Venkateshwarlu
ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు కి ఎల్లవేళలా రుణపడి ఉంటు పరకాల పట్టణ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.
దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆగిన దళిత బంధు ఇవ్వాలని …,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….
జమ్మికుంట :నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన
MLA Padi Kaushik Reddy
ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు
డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి నేటిధాత్రి :
శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.
భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.
వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.
అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు.
37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – శంకుస్థాపన కార్యక్రమాలు
షాద్ నగర్/నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో మంజూరైన 37 ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నంత సేపు ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా గ్రామస్తులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసి పునాదులు తీశారు.
MLA Shankar.
శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి కక్షలు దుర్మార్గాలు దౌర్జన్యాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని గత పాలకులు గ్రామంలో ఏమేం చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అందరికీ తెలుసని వారి పేర్లు తీయదలుచుకోలేదని మీడియా ముఖంగా శంకర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన వై యాదయ్య యాదవ్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో గ్రామాల్లో నిరూపిస్తున్నామని శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు సమకూరలేదని కాలయాపన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తప్ప సక్రమంగా పాలించలేదని ధ్వజమెత్తారు. నేడు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని ఉచిత బస్సు సిలిండర్ కరెంటు తోపాటు సన్నబియ్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు.
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం
వనపర్తి నేటిధాత్రి:
చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమీషా.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రక్షణ శాజకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ వనపర్తి న్యాయవాది మున్నూరు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది ప్రపంచ దేశాలలోనే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. ఏ దేశంలో రక్షణ రంగానికి కేటాయించని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల కోట్లు దాటిందని గతంలో ఉన్న 6.81 లక్షల కోట్లు ఉందని వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మరో 50 వేల కోట్లు కేటాయించడం వల్ల రక్షణ రంగం బడ్జెట్ ఏడు లక్షల కోట్లకు దాటిపోతుందని ఆయన అన్నారు.
BJP State Council Member
భారత సరిహద్దులు నిరంతరం నిలువ నీడ లేకుండా ఎండ. వర్షం. చలి లెక్కచేయకుండా రక్షణ దళాలు దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్నారని దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎంతటికైనా త్యాగం చేస్తుందని అందుకే అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతూ వీరోచితంగా దేశ సైనికులు కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్నారని దేశ సైనికులు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 26 మంది ప్రయాణికులు మరణించడం నా తర్వాత జరిగిన పరిణామాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న అంతర్గత పోరాటం అందరికీ తెలిసిన విషయం అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రముకలను తుద ముట్టించడంలో పై చేయి సాధించిందని ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగానికి దేశ సరిహద్దుల్లో భద్రత కాస్తున్న భద్రత దళాలకు ఈ బడ్జెట్ ధైర్యాన్ని నింపుతుందని సైనికులలో ఆత్మ సైర్యాని కోల్పోకుండా గుండె ధైర్యం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బడ్జెట్ మరింత పెంచినందుకు భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల తరపున ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ కి మున్నూర్ రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన మండల కేంద్రానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మీద రామడుగు పోలీసు స్టేషన్ లో పిటీషన్ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని, భారత ప్రధాని నరేంద్రమోదీ మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో ఉన్నటువంటి అధైల్ జైల్ ఈవ్యక్తికి ఎలా తెలుసని, మరి అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
వెంటనే ఆవ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టి, అతడికి ఉన్న ఉగ్రవాద సంబంధాలు బయట పెట్టాలని కోరారు. మండలంలో ఉన్న పలు మదర్సలో ఇతర దేశస్తులు నివాసిస్తున్నారని వెంటనే వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
మోడీ మీద పోస్టు చేసిన ఈవ్యక్తి మీద వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, అతడిని ప్రభుత్వ ఉద్యోగం విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈసందర్భంగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లలో కి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
వెంటనే ఆవ్యక్తి మీద కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని బిష్మించుకొని ఉండడంతో కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కారుపాకల అంజిబాబు, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి కడారి స్వామి
జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేణి అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపు అనంత రెడ్డి, దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి, రాగం కనకయ్య, జంగిలి కరుణాకర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.
మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఆపరేషన్ సిందూర్ సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారు…
దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.
ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదు..
నేటి ధాత్రి
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు .
ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి..
మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి..
విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి..
ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు..
CM Revanth Reddy
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి..
పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి..
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి..
శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి..
బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి…
అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి..
ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి…
CM Revanth Reddy
రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలి..
ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి..
సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి.
ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి…
ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది..
CM Revanth Reddy
ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి..
రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి…
అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి..
హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలి..
ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి…
హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…
CM Revanth Reddy
అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి…
హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి…
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.