పాఠశాల ఆవరణలో వర్షపు నీరు…

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు వర్షపు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది.
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి పడిన వర్షనికీ పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు.విద్యార్థులు పాఠశాల గదులకు వెళ్ళటానికి,పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో మన ఊరి మనబడి లో ఎన్నో నిధులతో పనులు చేశారు.పాఠశాల ఆవరణలో మట్టి వేసి ఎత్తుగా చేయడం లేదు,
కానీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.

చల్మెడ వాగు వద్ద.. గేట్లు ఏర్పాటు..

చల్మెడ వాగు వద్ద..
గేట్లు ఏర్పాటు..

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగుల వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిజాంపేట – చల్మెడ గ్రామాల మధ్య వాగు నిన్న రాత్రి కురిసిన వర్షానికి పొంగిపోర్లడం తో స్థానిక ఎస్ఐ. రాజేష్, ఎంపీడీఓ రాజీరెడ్డీ రోడ్డుకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. చెరువులు కుంటలు నిండుకుండాల మారడం తో ప్రజలు చెరువుల వద్దకు వెళ్ళవద్దన్నారు. అత్యవసర సమయంలో 100 కు డయాల్ చేయాలన్నారు.

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…

కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్‌కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.

చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.

స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం:

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం: శిల్ప సంపదతో రామాయణ గాథ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం. వందల ఏళ్ల నాటి రావి చెట్టు కింద కొలువై ఉన్న ఈ దేవాలయం, అద్భుతమైన శిల్ప సంపదతో రామాయణ చరిత్రను రంగుల రూపంలో కనువిందు చేస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.

స్థానిక సమరం.. ఎవరికీ అనుకూలం?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-67.wav?_=1

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం!

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అంచనాలు ఉన్నా యని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పదేండ్ల టిఆర్ ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంపాటు పడితే గెలిచిన అనంతరం తమను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదార్లకే పెద్ద పీటా చేస్తున్నారని చాలా రకాలుగా పార్టీల క్యాడర్ మండిపడుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ ని కాదని గత బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుప ట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపోవడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే అటు కేంద్రంలో కాం గ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికారంలో ఉంది. పదేళ్ల రాష్ట్రంలో పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలుకు కట్టడాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆరు గ్యారెంటీలు అమలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో! ఆలోచించాల్సి ఉంది.

ఉరివేసుకొని వ్యక్తి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T154900.138-1.wav?_=2

 

ఉరివేసుకొని వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ టౌన్ / ఝారసంగం మండలం
గుర్తు తెలియని మగ వ్యక్తి సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు అందాజు 30 నుండి 35 సంవత్సరాలు, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కుప్పానగర్ గ్రామ శివారులో ఒక పురాతన పాడుబడిన డాబా యందు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు ఇతని యొక్క వివరాలు తెలిసినచో క్రింది నంబరుకు ఎస్ ఐ
8712656771జహీరాబాద్ రూరల్ సిఐ 8712656732. సంప్రదించగలరని తెలిపారు,

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-66.wav?_=3

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడిన ఐపీఎస్‌ అధికారి డి.ఎస్‌. చౌహాన్‌, ఐ.ఎ.ఎస్‌ అధికారి హరి చందనలపై ఆల్‌ ఇండియా సర్వీస్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. మంగళవారం ఢల్లీిలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖా మంత్రి జితేంద్ర ప్రసాద్‌ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌లు

భూపాలపల్లిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-65-1.wav?_=4

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ 186 దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

ఘనంగా 186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను
ఫోటో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఫోటోగ్రఫీ సాంకేతికతను , కళను ప్రపంచానికి తెలియజేసిన లూయిస్ మాండే డాగురే జన్మదినాన్ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ప్రోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు కార్కురి సతీష్ అన్నారు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ లో జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి రఫీ మండల అధ్యక్షులు కార్కురి సతీష్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి, డాగురే చిత్రపటానికి , పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎండి రఫీ కార్కురి సతీష్ మాట్లాడుతూ డాగురె సృష్టించిన ఫోటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు , ఈ ఫోటోగ్రఫీ రంగాన్ని ఆధారం చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒక ఫోటో ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు అందిస్తుంది, ఫోటోగ్రఫీ ద్వారా ఎన్నిరంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగు రవీందర్, మండల కోశాధికారి కార్కురి శ్రీనివాస్ , సీనియర్ ఫోటోగ్రాఫర్ రాచర్ల సుధాకర్, శ్రీరాముల రమణ, కోరే సదానందం, అడ్డగట్ల శ్రీనివాస్, దిడ్డి సత్యం,మాదాసి శ్రీనివాస్, మాదాసి సతీష్, మనీషా శ్రీనివాస్, నేరేళ్ల శ్రీనివాస్, ఆముదాల మహేందర్, కన్నం కుమార్, బండ మోహన్, కిషోర్,సుమన్, మనోహర్, పూర్ణచందర్, భాస్కర్, రాజు శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, కళ్యాణ్, శ్రీనివాస్, అనిల్, రాకేష్, శ్రీధర్, రాజేష్, వినయ్, మధు, శ్రీకాంత్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శబరిమలైలో పూజలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T150518.761-1.wav?_=5

 

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శబరిమలైలో పూజలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ప్రియ శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మడిపల్లి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి ఆరాధనతో అర్చన, అభిషేకాలు ఘనంగా చేపట్టారు. మంత్రి కొండా సురేఖ ఆయురారోగ్యం, సుసంపన్నం కోసం ప్రత్యేక హోమాలు, ప్రార్థనలు నిర్వహించామని మడిపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు.ప్రజల కోసం శ్రేయస్సు సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరిన్ని సేవలు అందించాలని స్వామివారిని మిత్రులతో కలిసి ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-64-1.wav?_=6

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.

రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల నేటి ధాత్రి

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

MLA Janampally Anirudh Reddy.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-63.wav?_=7

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూరైన సందర్భంగా ఘన సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో డిఈఓ జ్ఞానేశ్వర్ ను ఏఎంఓ సృజనతేజ, జీఈసిఓ ఫ్లోరెన్స్, డిఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్, కోఆర్డినేటర్లు, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం జగదీశ్వర్ లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిట్యాలలో బిజెపి నాయకుల పరామర్శ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-62-1.wav?_=8

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో ఇటీవల కాలంలో మరణించిన బుర్ర రాజయ్య గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రవి కిరణ్ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య రేగొండ మండలం ఉపాధ్యక్షులు శివ కృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.

పరకాలలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-61-1.wav?_=9

పరకాలలో ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం

రోగులకు పండ్లు పంపిణీ చేసిన అసోసియేషన్ నాయకులు

పరకాల నేటిధాత్రి
186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పరకాల పట్టణ అవుట్ డోర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ తో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్ కి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీధర్ రూరల్ అధ్యక్షులు కె.కృష్ణ ప్రధాన కార్యదర్శి బండారి గిరిప్రసాద్ ల్,కోశాధికారి గూడెల్లి శివ ల్,ఉపాధ్యక్షులు పసుల బిక్షపతి,ఆకుల వెంకటేష్,క్యాతం రాజు,సుమన్,రమేష్,సాయికిరణ్,వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-60.wav?_=10

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ముర్తుజ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన.

BRS Leaders

జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ ,నాయకులు చిన్న రెడ్డి,దీపక్ ,అలి,సలీం, అర్షద్,ఆసిఫ్ తదితరులు .

మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-59-1.wav?_=11

మండిబజార్లో ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని 25వ డివిజన్ మండిబజార్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, పండ్ల పంపిణీ చేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖకు భద్రకాళి అమ్మవారి దీవెనలతో నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొందిన నాయకురాలు, మా తూర్పు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో మేమంతా కలిసి సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ తోట వేణు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజు సాంబయ్య, కొల్లూరి మల్లేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ వసీం, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

అదనపు ఎస్పీ ని అభినందించిన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-58-1.wav?_=12

అదనపు ఎస్పీ ని అభినందించిన జిల్లా న్యాయమూర్తి

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తి నీరజ ఈరోజు కోర్టు ఆవరణలో అదనపు ఎస్పీకి పుష్పగుచ్చము ఇచ్చి అభినందించారు. అంతే కాకుండా జిల్లా న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ ఉద్యోగరీత్య, కర్తవ్య రీత్య, ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల దృష్ట్యా, సామాజికంగా గాని, ఎల్లవేళలా సేవ, సహ సహకారం అందించినటువంటి ఉద్యోగులకు మంచి గౌరవం దక్కుతుందని తెలిపారు. అలాగే జిల్లా కోర్టులోఉన్న తదితర న్యాయవాదులు, అదనపుఎస్పీ అభినందించారు

‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T131456.880-1.wav?_=13

అయ్యో దేవుడా
‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’
వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు యువకులు దుర్మరణం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:

 

 

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-57-1.wav?_=14

మరోసారి ఐటీ దూకుడు
మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ సంస్థల్లో కూడా..సోదాలు

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్‌ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
డీఎస్‌ఆర్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎస్‌ఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎంపీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సురారంతోపాటు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఐదేండ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి డీఎస్‌ఆర్‌ గ్రూప్‌లో భాగస్వామిగా ఉన్నారు.

సింగరేణి కార్మికులకు 40% లాభాల వాటా ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56.wav?_=15

సింగరేణి కార్మికులకు
లాభాల వాటా 40% వెంటనే ఇవ్వాలి

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కంపెనీ. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ను సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెమొరండం ఇచ్చిన
శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు. విమలక్క
ఏఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి.
ఎం. పోచ మల్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
24-25-సంవత్సరపు. సింగరేణి కార్మికులు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకోవాలని. ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు.
పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం.
యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన
ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40%
ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇప్పించాలని.
ఉత్పత్తిలో భాగస్వామ్యమైన
కాంట్రాక్ట్ కార్మికులకు
గత సంవత్సరము. ప్రభుత్వము
లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది
24-25-సంవత్సరం. కూడా.
10.000 రూపాయలు. ఇవ్వాలని
గత విఆర్ఎస్ ఉద్యోగాలు కొనసాగించాలని. పాత పద్ధతిని అమలు చేయాలని.
మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని
సొంతింటి కల అమలు చేయాలని
ఓసిపిలను రద్దుచేసి భూగర్భ గనులను నిర్మించాలని.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి
44 కార్మిక చట్టాలను అమలు చేయాలని .
ఫెరాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని.
వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
తదితర కార్మిక సమస్యల పైన మెమోరండం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం. ప్రధాన కార్యదర్శి. వెల్తురు సదానందం. నాయకులు. విజయ్. ఐఎఫ్టియు నాయకులు. చంద్రగిరి శంకర్ స్త్రీ విముక్తి. నాయకురాలు. లావణ్య.
డిస్మిస్ సంఘాల నాయకురాలు.
రాజేశ్వరి. లక్ష్మి. రాజేశ్వరి. రాజు తదితరులు పాల్గొనడం జరిగింది

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T130448.674-1.wav?_=16

 

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

కేరళలోని అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మడిపెల్లి కృష్ణ గౌడ్

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన సందర్భంగా, కొండా దంపతుల ప్రియ శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మడిపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆరాధనతో అర్చన, అభిషేకాలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యం, సుసంపన్నం కోసం ప్రత్యేక హోమములు, ప్రార్థనలు నిర్వహించామని మడిపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు. మంత్రివర్యులు ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరిన్ని సేవలు అందించాలని స్వామివారి కృప లభించాలని మిత్రులతో కలిసి ప్రార్థనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version