మండిబజార్లో ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని 25వ డివిజన్ మండిబజార్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, పండ్ల పంపిణీ చేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖకు భద్రకాళి అమ్మవారి దీవెనలతో నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొందిన నాయకురాలు, మా తూర్పు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో మేమంతా కలిసి సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ తోట వేణు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజు సాంబయ్య, కొల్లూరి మల్లేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ వసీం, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.