వెలుగులో చీకటి బాగోతం.

 

వెలుగులో…చీకటి బాగోతం…!

నిలువునా ముంచేస్తున్న మహిళా సంఘాల సిఏలు

మహిళా సంఘాలు ఆదమరిస్తే…. తస్మాత్ జాగ్రత్త…?

కేసముద్రం నేటి ధాత్రి:

కేసముద్రం మండలంలోని మహిళా సాధికార మండల సమాఖ్య కార్యాలయంలో లోని సిఐలు గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం ప్రదర్శిస్తూ మహిళా సంఘాల మహిళలను అడ్డగోలుగా లక్షల రూపాయలు దోచుకు తింటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలం లోని కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన మహిళ సంఘాల రోదన అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళితే కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన రెండు ఒక మహిళ స్వయం సహాయక సంఘాల బ్యాంకు నుండి లోను పొందారు కానీ అట్టిలోనూ డబ్బులు సంఘంలోని మహిళా సభ్యులకు పంచకుండా అట్టి మొత్తం డబ్బులను తన సొంత అవసరాలకు స్వాహా చేశాడు ఇట్టి విషయమై పలుమార్లు సంఘం సభ్యులు నిలదీయగా రేపిస్తామాపిస్తా అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు చివరకు విసిగి వేసాగిన మహిళా సంఘం సభ్యులు గట్టిగా నిలదీయడంతో మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అట్టి డబ్బులు నేను చెల్లించను మీకు దిక్కున కాడ చెప్పుకోండి ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ మహిళల పట్ల దుర్భాష వాడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని సంఘం సభ్యులు ఆపోతున్నారు చివరకు గురువారం నాడు ఆ సంఘాల మహిళలు వెలుగు ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది ఇంత చేసినా కూడా సంబంధింత పైగా అధికారులకు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు ఆ అధికారులే ఎవరికీ చెప్పకండి అంటూ గుట్టు చప్పుడు కాకుండా ఇట్టి బాగోతాన్ని వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో ఇలాంటి మహిళా సంఘాల చేతివాటం ప్రదర్శించి మహిళా సంఘాలలోని డబ్బులను లక్షలకు లక్షలు కాజేసిన సంఘటనలు జరిగాయని పలువురు భావిస్తున్నారు. ఇంత చీకటి కుంభకోణాలు జరుగుతున్న సీఎంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనక అంతర్యం ఏమిటో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా సంబంధిత వెలుగు కార్యాలయ అధికారులు స్పందించి బాధ్యులైన అధికారులను అలాగే ఇట్టి బాగోతానికి సూత్రధారి అయిన అతన్ని ఉద్యోగం నుండి తొలగించి అతని నుండి అట్టి మొత్తాన్ని కాబట్టి మహిళా సంఘాలకు ఇవ్వవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి డిసిఓ వాల్య నాయక్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని సహకార సంఘం జిల్లా డిసిఒ వాల్య నాయక్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓద్దుల పల్లె మైలారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు వర్ష ప్రభావం సూచనల నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు ఈ సందర్భంగా రైతులతో కొనుగోలు కు సంబంధించి ముఖాముఖి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలను ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు రైతులు ధాన్యం విక్రసించిన వెంటనే ట్రక్ సీట్ ఇవ్వాలన్నారు అకాల వర్షాలు వస్తున్నాయని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలువ లేకుండా తక్షణమే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు ప్రక్రియలో కేటాయించిన బిల్లులకు రవాణా చేయాలని ఆదేశించారు కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన సూచించారు అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలో పరదాలను సిద్ధంగా ఉంచాలని ఆయన తెలిపారు కొనుగోలు జరిగిన తదుపరి రైతులకు బాధ్యత లేదని కొనుగోలు కేంద్రాల్లో ఇన్చార్జీలు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సి ఓ పుట్ట సురేష్ ఓద్దుల పల్లె ఇన్చార్జి కుక్క ముడి సంపత్ మైలారం ఇంచార్జి కండే కుమార్ రైతులు పాల్గొన్నారు.

సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా.

సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా…?

సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ఆవేదన

వీణవంక, ( కరీంనగర్ జిల్లా ) నేటి ధాత్రి :

 

 

నేటి ధాత్రి :వీణవంక మండల పరిధిలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 23 మంది వివిధ రకాల వాణిజ్య, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న విషయంపై సమాచార హక్కు చట్టం కింద అదే ప్రాంతానికి చెందిన ముదిగంటి రఘునాథ్ రెడ్డి గ్రామం ఇప్పలపల్లి, 86 సంవత్సరాల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సమాచారం కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో సమస్యను హైదారాబాద్ ప్రజా దర్బార్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఏట్టకేలకు స్పందించిన అధికారులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పవన్ సమక్షంలో ఈ నెల 3న విచారణ చేపట్టగా.. ఆ సమయంలో తనపై దుకాణ సముదాయ ఏర్పాటు చేసుకున్న పలువురు దుర్భాషలాడినట్లు ఆరోపించారు. తక్షణమే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై వీణవంక పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10న, కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ కి ఈ నెల 13న సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు మోతుకు కోమాల్ రెడ్డి, గడ్డం నారాయణ, కళ్యాణ్ ల నుండి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారి నుండి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు.

జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే.

‘జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే’

బాలానగర్ నేటి ధాత్రి :

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి మాజీ ఎంపీటీసీ నేనావత్ వెంకట్ రాము కూతురు నేనావత్ వందన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వందనాకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందన ఉన్నత విద్యలు చదివి తిరుమలగిరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాండవాసులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్

గణపురం నేటి ధాత్రి :

 

గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను మరిచిపోయి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి ఉన్న సమయం చదువుకునే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ అకాల వానలతో చేతికొచ్చిన పంటలను కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి సమయం ఉండాదని ఎద్దేవ చేశారు సరస్వతి పుష్కరాలకు కోట్ల రూపాయల డబ్బుతో భక్తుల సౌకర్యాలకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోయినా ఆగమేఘాల మీద పుష్కరాలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు

బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ పిల్లలకు వైట్ టోపీలు

బాల్ బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ పిల్లలకు వైట్ టోపీలు

సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్

 

గణపురం నేటి ధాత్రి

Ball badminton

 

గణపురం మండల కేంద్రంలో బాల్ బ్యాడ్మింటన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ కోచ్ మామిడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో బాల్ బ్యాడ్మింటన్ సమర్ కోచింగ్ కు పిల్లలకు ఎండ దెబ్బ తాకకుండా వైట్ క్యాప్ లను స్పాన్సర్ చేసిన ఉప్పుగల్లు గ్రామానికి చెందిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వైట్ క్యాప్ లను బహుమతి గా ఇచ్చారు ఇందులో పాల్గొన్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబయ్య సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రమేష్ చిరంజీవి సతీష్ మహేందర్ బుచ్చి రెడ్డి హంచత్ ఈర్ల స్వామి పాల్గొన్నారు ఈ యొక్క గణపురం క్యాంప్ కే కాకుండా వేములపల్లి క్యాంపు కూడా 20 టోపీలను అందజేయడం జరిగింది ఇంకా ఏ అవసరం పడ్డ నన్ను అడగండి అని అన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రివర్యులు.!

వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన

★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

కోహిర్ మండలంలోని మనియర్పల్లి గ్రామ. కాంగ్రెస్ నాయకులు దేవదాస్ గారి సోదరుని కుమారుని వివాహనికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,జె జె కన్స్ట్రక్షన్ జావీద్ భాయ్,ఎస్సి సెల్ ఛైర్మెన్ అనిల్,కోహిర్ పట్టణ అధ్యక్షులు శంషీర్,మాజీ సర్పంచ్ రచన్న,గ్రామ కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా మత్స్యగిరిస్వా మి నాగవల్లి మహోత్సవం.

వైభవంగా మత్స్యగిరిస్వా మి నాగవల్లి మహోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుక ళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించినారు స్వామివారికి విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యా వచనము ద్వాదశ ఆరాధన లతో వివిధ రకాల పుష్పాలతో పుష్ప యాగాన్ని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవల్లి వేణుగోపాలాచార్యు లు వేదమంత్రాలు మధ్య నిర్వహించినారు మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి వేద పారాయణాలను చేసుకుంటూ దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఊరేగించారు ఒక్కొక్కసారి ఒక్కో వాయిద్యం తో 12 రకాల వాయిద్యాలతో 12సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పండిత సన్మానం చేసినారు పండిత సన్మానంతో శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సైనా రెడ్డి కృపాకర్ రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి శివరామకృష్ణ రెడ్డి మనీష్ రెడ్డి కందగట్ల కోటేశ్వరరావు సామల రవీందర్ కుసుమ శరత్ బాబు దిండిగాల వంశీ కాంబత్తుల ప్రకాష్ బాసని వెంకటేశ్వర్లు నామనిశివ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి

* పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి.*

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

బైక్ ఇప్పివ్వలేదని బావిలోకి ఆత్మహత్యాయత్నం.

బైక్ ఇప్పివ్వలేదని బావిలోకి ఆత్మహత్యాయత్నం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

బైక్ ఇప్పించడం లేదని బావిలోకి యువకుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన న్యాల్కల్ మండలం మామిడిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సాల్మన్ (32) బైక్ ఇప్పించాలని తల్లితో తరచుగా గొడవపడేవాడు. గురువారం కూడా తల్లితో గొడవపడి బయటికి వెళ్లి గ్రామంలో ఉన్న బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు సాల్మన్ ను బయటకు తీశారు.

ఘనంగా గీసుకొండ శ్రీమంతుని వజ్రోత్సవ జన్మదిన.!

*ఘనంగా గీసుకొండ శ్రీమంతుని
వజ్రోత్సవ జన్మదిన వేడుకలు*

పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.

వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:

గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు ‌నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన !

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు

మల్లాపూర్ మే 15 నేటి ధాత్రి:

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది మండలానికి చెందిన అఖిలభారత మహాసభ మండల యాదవ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏదైనా అవసర నిమిత్తం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరేకుల సంతోష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్, కార్యవర్గ సభ్యులు బండారి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంగ గంగారాజం, జిల్లా యూత్ అధ్యక్షులు రేబ్బటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహేష్, మామిడి తిరుపతి, రాజలింగం మాదం రాజేందర్, రాజు గణేష్ , అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సంఘటితంగా అందరూ పాల్గొనాలి .!

దేశవ్యాప్త సమ్మెలో సంఘటితంగా అందరూ పాల్గొనాలి

ఏ ఐ సి టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం నేటి ధాత్రి :

 

 

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కో-పరేటివ్ సెంటర్లో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన జరిగేటువంటీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని దీని ద్వారా పెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం,అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;వేటగాని శ్రీనివాస్,కలపాక వంశీ,జల్లే జాన్సన్,యాటగాని రాములు,గడ్డం నరసయ్య,పానుగంటి రాములు,అయినల శ్రీనివాస్,చాగంటి రాములు,కలపాక శ్రీను,మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

కేతకీకి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉంది.

◆ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్…

◆ అభివృద్ధి పనులపై సమీక్ష…

◆ సమస్య ఉంటే వెంటనే చెప్పండి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో అష్ట తీర్థాల సంగమంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకుగాను అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. బుధవారం మండల కేంద్రమైన ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం వచ్చే మార్గంలో పారిశుద్ధ్య, మొక్కల సంరక్షణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవి ధంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూసు కోవాలన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు అంద జేయాలన్నారు. మేదపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావే శంలో జిల్లా పరిషత్ సీఈవో జానకిరామ్ రెడ్డి, డీపీఓ సాయి బాబా, జహీరాబాద్ ఆర్డీఓ రాజిరెడ్డి, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిఎం నల్లమల పర్యటన.

‘సిఎం నల్లమల పర్యటన’

కల్వకుర్తి నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ మల్లు రవి పత్రిక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు గ్రామంలో గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా గిరి జల సౌర వికాస్ పథకాన్ని రూ. 12,600 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పత్రిక సమావేశం నిర్వహించి తెలియజేశారు. ఇందిర జల సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధికి,వారి సంక్షేమం కోసం,వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాడుతుంది అని ఎంపీ మల్లు రవి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలోపాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ ,కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

గోదావరి వద్ద ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసి మా పుట్ట కొడుతున్నారు.

వెంటనే స్కూల్ బస్సులను నిలిపివేయాలి.

పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్ల నిరసన. రోడ్డుపై బైఠాయి.

మహదేవ్పూర్ -నేటి ధాత్రి;

 

కాలేశ్వరం బస్టాండ్ వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుండి గోదావరి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానిక ఆటోల్లో భక్తులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా భక్తులను ఆటోలో తరలించడంతో స్థానిక ఆటో డ్రైవర్లకు ఉపాధి కలుగుతుంది. కానీ పుష్కరాల సందర్భంగా మండలానికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను భక్తుల కు గోదావరి వద్ద తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే స్కూల్ బస్సులను తీసివేయాలంటూ ఆటో డ్రైవర్లు సుమారు రెండు గంటల పాటు ధర్నా కొనసాగించడం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆటో డ్రైవర్లు ధర్నా ను విరమించినట్లు తెలుస్తుంది.

ఆదివాసీ యువకుడి పై దాడి.!

ఆదివాసీ యువకుడి పై దాడి చేసిన గిరిజనేతరుడి పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్..

.. ఆదివాసీ నవనిర్మాణ సేన, తుడుందెబ్బ సంఘాలు…

వలస గిరిజనేతరుల నుండీ ఆదివాసీలకు రక్షణ కల్పించాలి..

ఆదివాసీల పైన అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలి.

ఎస్సై రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు..

నూగూర్ వెంకటాపురం

 ములుగు జిల్లా వెంకటాపురం నేటి ధాత్రి:

ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. మండపాక గ్రామానికి చెందిన తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ పైన విచక్షణ రహితంగా దాడి చేసిన నాగేంద్ర బాబు రాజు పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాయం జానకి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాయకులు నర్సింహా మూర్తి, పాయం జానకిరావు వాజేడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రాజ్ కుమార్ ని కలిసి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసినారు. తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ యువకుడిని వాజేడు గ్రామానికి చెందిన కృష్ణబాబు రాజు తన ఇంటి ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలు చదును చేయమని ట్రాక్టర్ డ్రైవర్ తోలేం సర్వేశ్వరరావు ని తీసుకెళ్ళినరాని అన్నారు. పని చేస్తున్న డ్రైవర్ ని నాగేంద్ర బాబు రాజు అకారణంగా కొడుతూ,కులం పేరుతో దుర్భాషలు ఆడినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నట్టు తెలిపారు. అనంతరం ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి, పాయం జానకి రావు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వల్ల ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పని చేస్తున్న యువకుడి పైన రాత్రి ఏడున్నర గంటల సమయం లో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. యువకుడి పై దాడి చేయడం తో పాటు ట్రాక్టర్ పైన కూడా రాళ్లతో దాడి చేసినారని అన్నారు.యువకుడి తండ్రి ముందు కూడా కొడుతూ హైదరాబాద్ బాద్ నుండి రౌడీలను తెప్పిస్తా ట్రాక్టర్ ని పెట్రోలు పోసి కాల్చేస్తా అని బెదిరించినట్టు నాయకులు మీడియా కు తెలిపారు. అగ్రవర్ణాలకు ఆదివాసీల పైన అంత అక్కస్సు ఎందుకని అన్నారు. వలస వచ్చి వాజేడు మండలం లో ఉన్న సారవంత మైన వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు తెలిపారు. ఇక్కడున్న స్థానిక గిరిజన గిరిజనేతరుల పైన పెత్తనం చెలయిస్తూ ఉన్నారని అన్నారు. పూర్వం వాజేడు మండలం లోని ఆదివాసీల పైన అరాచకాలు, హత్యలు, హత్యా చారాలు చేసినారని అన్నారు.రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని నేటికీ వాజేడు మండలం లో వలస గిరిజనేతరుల అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడున్న ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వ భూములకు పట్టాలు చేపించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వాదులకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధన్యత ఇస్తూ ఉండడం కారణంగానే ఆదివాసీల పైన దుర్మార్గాలకు తెగపడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరుల స్వాధీనం లో ఉన్న గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. తోలేం సర్వేశ్వర్ రావు పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడి గా నాయకులు పేర్కొన్నారు. అగ్రవర్ణాలు అహంకారం తో ఆదివాసీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారని అన్నారు. తోలేం సర్వేశ్వర్రావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే వాజేడు లో భారీ ర్యాలీ చేస్తామని నాయకులు ప్రకటించారు. నాయకులు మోడెం నాగరాజు, నల్లేబోయిన సర్వేష్, కుంజ మహేష్, యుగంధర్,చాప కిరణ్, మండపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ .!

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది… సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు. సంబంధించి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్. చెక్కులను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక మార్కండేయ భవన్ లో ఏర్పాటుచేసిన. దానిలో భాగంగా మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి . షాది ముబారక్. చెక్కుల పంపిణీలను. స్థానిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు. తంగళ్ళపల్లి ఎమ్మార్వో సంబంధిత అధికారుల. చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. కొంచెం ఆలస్యం.అయిన అర్హులందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్. చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి. ఎమ్మార్వో . జయత్ కుమార్. జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్. సిరిసిల్ల ఏఎంసి. చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు.!

కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు శ్రవణ కుమారికి డాక్టరేట్

నేటిధాత్రి:

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (ఆటనామస్) కంప్యూటర్ సైన్స్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న కుడికాల శ్రవణ కుమారికి కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి. మంజుల గారి పర్యవేక్షణలో పరిశోధన గ్రంధం సమర్పించిందుకు గాను కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ట రాజేందర్ డాక్టరేట్ ప్రకటించారు. డాక్టరేట్ సాధించిన వీరిని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హన్మకొండ ప్రిన్సిపాల్ కె. రజనీలత మరియు అధ్యాపకులు అభినందించారు. తన పిహెడి పరిశోధన సాధనలో ఎల్ల వేళల సహాయ సహకారం అందించిన సూపర్వైజర్, అధ్యాపక బృందానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.

ఝరాసంగం తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండల గ్రామాల్లో బంగ్లాగడ్డ కాలనీ ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు బంగ్లాగడ్డ కాలనీ చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు.

 

Jhara Sangam

జిల్లా కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 5 రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్‌ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో నీరు వృథాగా పోతున్నది.అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.

Jhara Sangam

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version