శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం..
*శ్రీకాళహస్తి శాసనసభ్యులతో కలసి శ్రీకాళహస్తి
నియోజకవర్గం లో పర్యటించిన తుడా చైర్మన్..
*ఎమ్మెల్యే నిధులు తుడా నిధులతో శ్రీకాళహస్తికి మహర్దశ..
*శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..
*అభివృద్ధి అజెండాగా తుడా పని చేస్తుంది..
*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 25:
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తూడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మొదటగా శుక్రవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్నారు.అక్కడ స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును అభివృద్ధి తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి. డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారుచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి చేరుకొని అక్కడి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తుడా నిధులతో ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని తుడా చైర్మన్ అధికారులకు ఆదేశించారు..జయ రామారావు వీధిలో పురాతన డ్రైనేజీ కాలువ ల ను ఆధునికరించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల ను డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా అధికారులను సన్మానించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో పట్టణాన్ని ఆకర్షణయంగా చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన జరినామాలు ఉంటాయని హెచ్చరించారుతుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ కాలువ ల అభివృద్ధికి ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తామని, గ్రీనరీ డెవలప్మెంట్ వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు.