మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.