హ్యూమన్‌ వర్షిప్‌..బెస్ట్‌ లీడర్‌ షిప్‌!

`సీఎం. రేవంత్‌ పై రాహుల్‌ ప్రశంసలు.

`సంక్షేమ సారథి రేవంత్‌.

`పట్టుదలకు మారు పేరు రేవంత్‌.

`ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ రేవంత్‌ తో రాహుల్‌ ఆలింగనం.

`రేవంత్‌కు అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`ద బెస్ట్‌ లీడర్‌ రేవంత్‌ అని సోనియా కితాబు.

`రేవంత్‌ పై ప్రియాంక పొగడ్తలు.

`డిల్లీ వర్గాలలో లో రేవంత్‌ పాలనపై సానుకూల చర్చలు.

`తెలంగాణలో సంపూర్ణ, సమగ్ర, అర్థిక, సామాజిక, కుల గనణపై రేవంత్‌ చిత్తశుద్ధిపై మెచ్చుకోలు.

`రేవంత్‌ భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్న ఖర్గే.

`రేవంత్‌ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం ఖుషీ.

`మోడల్‌ ఆఫ్‌ తెలంగాణ ఈస్‌ ద బెస్ట్‌ అని అందరి కితాబు.

`రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానం పెద్దల నుంచి సానుకూల స్పందన.

`అధిష్టానానికి రేవంత్‌ దూరమనే వార్తలు పటా పంచెలు.

`త్వరలో రేవంత్‌ బిహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలు.

`రైజింగ్‌ తెలంగాణతో బీహార్‌లో రేవంత్‌ ప్రచారం.

`అధిష్టానంతో ఎలాంటి గ్యాప్‌ లేదు.

`గాసిబ్స్‌ ప్రచారానికి ఇక తావులేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ అధినేతల నుంచి ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్షనేత, పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాందీ నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి అభినందనలు అందుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి చాలా గొప్పగా పాలన సాగిస్తున్నారు. తన అంచనాలకు మించి పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రబుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమంలో ముందుందని కొనియాడేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాన ప్రభత్వం నిర్వహించిన సమగ్ర సంపూర్ణ ఆర్దిక, సామాజిక, గణనపై పార్టీ అగ్రనేతలకు సిఎం. రేవంత్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇచ్చారు. సిఎం. రేవంత్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌కు ముగ్థులైన పార్టీ అదినేతి సోనియా గాంధీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతోపాటు, తొలి అడుగు వేసింది. దేశానికి ఆదర్శవంతమైన పాలనతోపాటు, సామాజిక గనణపూర్తి చేసంది. దాంతో కాంగ్రెస్‌ పెద్దలు సిఎం. రేవంత్‌ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్‌రెడ్డి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తెలంగాణలో కుల గణనతోపాటు చేపట్టిన అన్ని రకాల అంశాలు సుదీర్ఘం వివరించారు. తెలంగాణలో కుల గణన ఎలా చేపట్టారు. ఎంత మంది ఈ కార్యాక్రమంలో వినియోగించారు. కేవలం 60 రోజుల్లో ఎలా పూర్తి చేశారు. సమగ్ర సమాచారాన్ని ఎలా సేకరించారు. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు వస్తే, మరో 15 రోజుల గడువుతో పూర్తి స్ధాయి సామాజిక గణన ఎలా పూర్తి చేశారన్న విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి అదిష్టానానికి చక్కగా వివరించారు. దాంతో రాహుల్‌ గాంధీ మెచ్చుకొని రేవంత్‌ రెడ్డిని లయన్‌ ఆఫ్‌ ది తెలంగాణ అని కీర్తించారు. రేవంత్‌ రెడ్డి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలనుద్దేశించ రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ రేవంత్‌ను సంక్షేమ సారధిగా అభివర్ణించారు. పట్టుదలకు రేవంత్‌ రెడ్డి మారు పేరంటూ కీర్తించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్‌ రెడ్డిన శ్రమను రాహుల్‌ కొనియాడారు. పార్టీని అదికారంలోకి తేవడంతోపాటు, ఆదర్శవంతమైన పాలన రేవంత్‌ సాగిస్తున్న తీరును అభినందించారు. దేశమంతా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్న బిసి గణనను చేపట్టేందుకు ముందుకు రాలేదు. కాని కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విధానంపై దేశమంతా ఆసక్తికనబర్చింది. దాంతో ప్రజల నుంచి కూడా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడిరది. బిజేపి పాలిత రాష్ట్రాలే కాకుండా ఎన్డీయే పక్ష రాష్ట్రాలు కూడా బిసి గణనపై మొగ్గు చూపాయి. దాంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ ఘనతే అన్నారు. అయితే అందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌ గాందీ పేర్కొన్నారు. ఎంతో పట్టుదలతో కుల గణన చేపట్టిన సిఎం. రేవంత్‌ను పట్టుదలకు మారు పేరుగా రాహుల్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఫార్టీ ధ్యేయాం ఒక అడుగు ముందుకు పడేలా చేసిన రేవంత్‌ రెడ్డిని ఆలింగనం చేసుకొని అభినందించారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ నచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సిఎం. రేవంత్‌ చొరవ వల్లనే ఇదిసాధ్యమైందన్నారు. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సామాజిక సృహ కల్గి వుంటే బిసిలకు భవిష్యత్తులో పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. బిజేపి ప్రభుత్వాలు కాంగ్రెస్‌ డిమాండ్‌కు తలొగ్గేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కారణమని, బెస్ట్‌ లీడర్‌ అని రేవంత్‌ రెడ్డిని కొనియాడారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ అగ్ర నాయకురాలు, వాయినాడ్‌ ఎంపి. ప్రియాంకా గాంధీ కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. రేవంత్‌ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్చే రేవంత్‌ రెడ్డి భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఈ సమయంలో పార్టీ పెద్దలను ప్రశంసలు అందుకున్నతీరును గుర్తు చేస్తూ సోనియా గాందీ మాటలే తనకు నోబెల్‌, ఆస్కార్‌ అవార్డులనుకుంటానన్నారు. ఏద ఏమైనా తెలంగాణలో 42శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసి, రిజర్వేషన్లపై వున్న గీత చెరిపేస్తామన్నారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుగావున్న 50శాతం సీజింగ్‌ను బద్దలు కొడతామన్నారు. అయితే కొంత కాలం పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర కాలేనంత దూరం ఏర్పడిరదంటూ పెద్దఎత్తున ప్రచారం జరగుతూ వచ్చింది. సిఎం.రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్‌ గాంధీ అప్పాయింట్‌ మెంటు ఇవ్వడం లేదని పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చేవి. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు సాగించింది. రేవంత్‌రెడ్డిని కలవడానికి రాహుల్‌ ఇష్టపడడం లేదని ప్రచారం సాగించారు. రేవంత్‌రెడ్డి రోజుల తరబడి పడిగాపులు కాసినా కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటూ వార్తలు రాశారు. రేవంత్‌ రెడ్డిమీద అదిష్టానం ఎంతో కోపంగా వుందంటూ కూడా పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రెండు సంవత్సరాలలో కొన్ని సందర్భాలలో రాహుల్‌ గాందీ ఎదురైనా సిఎం.రేవంత్‌రెడ్డితో కనీసం పలకరించలేదంటూ కూడా వార్తలురాశారు. డిల్లీలో మొదట్లో కలిసిన ఫోటోలు తప్ప, ఇప్పటి వరకు కొత్త ఫోటోలు విడుదల చేయలేదని రకరకాల వార్తలు రాశారు. బిఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ రెడ్డి మీద నిత్యం అబాండాలు వేస్తున్నారు. వాటన్నింటికీ ఈ ఒక్క సందర్భం అనుమానాలన్నీ పటాంపంచెలు చేసినట్లైంది. రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇస్తున్న సమయంలో రాహుల్‌ గాందీతోపాటు, పార్టీ పెద్దలందరూ ఎంతో ఆసక్తితో గమనించారు. ఆ సమయంలో రేవంత్‌ సర్కారు సాధించిన విజయాన్ని చూస్తూ ఆనందంగా పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ తిలకించారు. కొన్ని సందర్బాలలో రాహుల్‌ గాందీ ఎంతో ఆసక్తితో ఆ ప్రెసెంటేషన్‌ విన్నారు. ఆ సమయంలో రాహుల్‌ గాందీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తర్వాత రేవంత్‌ రెడ్డిని పొగడ్తలతో రాహుల్‌ గాందీ ముంచెత్తారు. అయితే రాహుల్‌ గాందీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలన్నీ పటాపంచెలైపోయినట్లే అంటున్నారు. ఇక సిఎం. రేవంత్‌ రెడ్డి మీద మాట్లాడేందుకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. ఓ వైపు సిఎం. రేవంత్‌రెడ్డి పనితీరును ప్రశంసిస్తూనే హ్యూమన్‌ వర్షిప్‌ రాహుల్‌ కొనియాడారు. అంటే పేదల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప నాయకుడు అన్నారు. ప్రజలను ఆరాదించే పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీయే అని రాహుల్‌ అన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం, రేపటి తరం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు. అలా కాంగ్రెస్‌ భావాలను, ఆచరణలోకి తీసుకెళ్తున్నా రేవంత్‌ రెడ్డిని రాహుల్‌ అభినందించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా ప్రచారం జరగాలని రాహుల్‌ కోరుకున్నారు. తెలంగాణ రైజింగ్‌ దేశమంతా చూస్తుందన్నారు. జిడీపి గ్రోత్‌లో దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, అందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వస్తేనే సాద్యమౌతాయని అన్నారు. వచ్చే బీహార్‌ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి ప్రచార బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించనున్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై రేవంత్‌రెడ్డి చేత పెద్దఎత్తున ప్రచారం సాగించాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది. తెలంగాణలో సక్సెస్‌ పుల్‌గా అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ ఫార్టీ తరుపున విసృతంగా ప్రచారం చేయడానికి రేవంత్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు పధకం వల్ల మహిళలకు ఎంత మేలు జరుగుతుందో బిహార్‌ ఎన్నికల్లో చెప్పనున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రవాణా ఎలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో రేవంత్‌ వివరించనున్నారు. ఈ పద్దెనమిది నెలల్లో రెండు వందల కోట్ల ప్రయాణాలను మహిళలు సాగించారు. అంతే కాకుండా ఆర్టీసీ లాబాల పట్టింది. ఉచిత బస్సు పధకం విజయవంతం కావడంతో బిఆర్‌ఎస్‌కు పాలు పోవడం లేదు. ఆర్టీసి మరింత బలోపేతమౌతుంటే బిఆర్‌ఎస్‌ ఆశ్చర్యపోతోంది. తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పధకం గురించి రేవంత్‌ రెడ్డి బిహార్‌లో విసృతంగా ప్రచారం సాగించనున్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్న తీరు, విధానం గురించి బీహార్‌ ప్రజలకు వివరించనున్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై కూడా రేవంత్‌ రెడ్డి ప్రచారం సాగిస్తారు. తెలంగాణ రైజింగ్‌పై ప్రచారం సాగించనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version