చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం
రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.