రైతులు వేసిన వరి పంటలో అగ్గి తెగులు, మెడ విరుపు రోగాలు, మరోవైపు అకాల వర్షం రావడంతో రైతన్నలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషంగా ఉండాల్సిన రైతన్నలకు ఒకవైపు, వరి వేసిన తర్వాత పొట్ట కచ్చిన వరి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు అందక కొందరి రైతుల పొలాలు ఎండిపోయి రైతులు విలువలాడుతున్నారు.
మరోవైపు వరి ఈ నిన దశలో మెడవిపు రావడంతో రైతులు స్ప్రే మందులకే పరిమితమై పోతున్నారు.
మరోవైపు అకాల వర్షం ఈదు గాలులు రైతులను వెంటాడుతున్నాయి.
Farmers
అన్నమొ రామచంద్ర అంటూ అలమటిస్తు, దిక్కు తోచని స్థితిలో రైతులు అప్పుల పాలవుతున్నారు.
అయ్యో ఈ బాధ మాకేనా మా బాధ ఎవరికి చెప్పుకోలే దేవుడా అంటూ నెత్తికి చేయి పెట్టుకొని అలమటిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని గ్రామ ప్రజలకు,ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు చలివేంద్ర కేంద్రాలను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు.ప్రజలకి కాకుండా పశువులకు,పక్షులకు కూడా ప్రజలు తమతమ నివాసాలలలో ధాన్యాన్ని నీళ్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…
గణపురం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన దూడపాక లావణ్యశంకర్ చిన్న కుమార్తె రిషిత రాష్ట స్థాయిలో ప్రతిభ కనబర్చింది. గత ప్రిభవరి 23న జరిగిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 52,314 మంది హాజరు కాగా శనివారం ప్రకటించిన ఫలితాల్లో రిషిత రాష్టా స్థాయిలో 3521 ర్యాంకు సాధించింది.ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం,కాలనీ వాసులు అభినందనలు తెలియజేశారు.
వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈనెల 6న జరగబోయే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి ఈరోజు ఆలయ పరిసరాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్త సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ, వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర ఉత్సవం. ఈ వేడుకలు భక్తులంతా భద్రంగా, ఆధ్యాత్మికంగా అనుభవించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, శాశ్వత టెంట్‌ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. పెను తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి అని తెలిపారు. అలాగే, అన్నదానం, ప్రసాద విభాగాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో క్యూలైన్లను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, హరికథలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలి అని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్, పోలీస్ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం విశేషంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
యాదవుల కులదేవత ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు భారీగా పాల్గొనాలని రాంపురం శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయ కమిటీ యాదవ కుల సంఘ పెద్దలు భక్తులను కోరుతున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుండి 13వ తారీకు వరకు వేద పండితులు బ్రహ్మశ్రీ అప్పి రవిశంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందని, ఏప్రిల్ 9న విగ్రహాల ఊరేగింపు, ఏప్రిల్ 11న గణపతి పూజ,హోమాలు మొదలైన పూజా కార్యక్రమాలు, ఏప్రిల్ 12న స్థాపిత దేవత హవానములు, రుద్ర దుర్గా హోమాలు, కలన్యాస వాహనము, ధాన్యాది,పుష్పాది,ఫలాది, శయ్యది వాసములు, షోడ, శోపచార పూజ, మంత్ర పుష్పము తీర్థప్రసాద వితరణ ఉంటాయని, ఏప్రిల్ 13 ఆదివారం చైత్ర బహుళ పాడ్యమి రోజున ఉదయం 8 గంటల 31 నిమిషములకు చిత్త నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తములో యంత్ర విగ్రహ ప్రతిష్ట, బలి ప్రధానము, అవృదస్థానము నేత్ర దర్శనము వేద పండితులచే ఆశీర్వచనము ఉంటాయని తెలిపారు. కావున ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు నియమ నిష్ఠలతో వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు యాదవ కుల సంఘ పెద్దలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో బియ్యం మాత్రమే
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది
ఊర నవీన్ రావు మండల అధ్యక్షులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ప్రతి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం ఒక్కో కిలో కు40 రూపాయలను వెచ్చిస్తున్నది ఈ మొత్తం కూడా కేంద్రమే భరిస్తున్నది అలాగే కరోనా ఆపద సమయం నుంచి పేదలకు ఇబ్బంది కాకుండా ఉచిత పథకాన్ని నిరాటంకంగా ఇప్పటికీ కేంద్రం కొనసాగిస్తున్నది కేంద్రం ఐదు కిలోలు అందియగా రాష్ట్రం ఒక్క కిలో మాత్రమే కలుపుతున్నారు సన్నబియ్యానికి 10 రూపాయలు మాత్రమే కలిపిన రాష్ట్ర ప్రభుత్వం దీంతో మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుతుంది ఇవన్నీ స్థానిక ఎన్నికల కోసమే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లో విఫలమై ప్రజలను మార్చడానికి కేంద్ర పథకాన్ని కూడా వాడుకోవడానికి దిగజారారు ఇక మీ మాయ మాటలు ప్రజలు నమ్మరు. రాబోయే కాలంలో స్థానికఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. అని ఆయన అన్నారు.
గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం లో.,ఏప్రిల్ 6వ, తారీకు నిర్వహించనున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయటం జరిగింది, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించబోనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలో భాగంగా మొదటిగా ఆలయంలో వేద పండితులు చేత తొలక్కం పారాయణం జరుగుతుంది ఏప్రిల్ ఆరో తారీకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది . తదుపరి హోమాలు అదేవిధంగా గ్రామ పర్యటనలో భాగ ంగా రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 11 వ తారీకు నాగబెల్లి తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని తెలిపారు రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్, శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . అదేవిధంగా గణపురం చెందిన కీర్తిశేషులు అమరాజి మొగిలి జ్ఞాపకార్థం కుమారుడు అమరాజి సతీష్, ఆలయ అభివృద్ధి కొరకు 10, వేల 116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క..
కొత్తగూడ, నేటిధాత్రి :
ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు.
గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ములుగు క్యాంప్ కార్యాలయంలో ఐజేయు సభ్యులు కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులను అన్యాయాలకు గురి చేసినటువంటి దుస్థితి గత పాలకులదేనని, కెసిఆర్ కు వత్తాసు పలికే కొన్ని మీడియా యాజమాన్య సంస్థలతో కుమ్మక్కై మీడియా రంగాన్ని అనేక విభాగాలుగా విభజించి ఫోర్త్ ఎస్టేట్ అనే రంగాన్ని పూర్తిగా కనుమరుగు అయ్యే విధంగా వ్యవహరించిన తీరు నాటి పాలకుల పాపమేనని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఇళ్ల స్థలాల మంజూరు,ఆరోగ్యశ్రీ ,హెల్త్ కార్డుల మంజూరు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించే విధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో విధి విధానాలు చేపడుతున్నామని, కచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చిరకాల ఆకాంక్ష కోరికైనా ఇళ్ల స్థలాల మంజూరుకు కచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల అధ్యక్షుడు ఎస్. కె .సల్మాన్ పాషా, జిల్లా నాయకులు శెట్టి పరశురాం, మహమ్మద్ అజ్మీర్, మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్, దేశ వెంకటేశ్వర్లు, మండల ప్రచార కార్యదర్శిలు తీగల ప్రేమ్ సాగర్, ఈక నరేష్, ఉబ్బని శ్రీహరి, గంగిశెట్టి రాకేష్ వర్మ, ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్, యూనియన్ నాయకులు చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, తాటి సుదర్శన్, బిక్షపతి, గట్టి సుధాకర్, అశోక్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు…
గణపురం గ్రామ నీకి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు కల్లుగీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడటం జరిగింది. తోటి మిగతా కార్మికులు చూసి హాస్పిటల్కు తీసుకుపోగా సీరియస్ గా ఉన్నాడు వరంగల్కు తీసుకుపోవాలి తెలిపారు గార్డెన్ హాస్పిటల్ లో ఉన్నాడు ఈ ప్రమాదంలో గీతకార్మికుడైనా గడ్డమీది వెంకటేశ్వర్లు కి ప్రక్కటేముకలు,తొంటెముక, వెన్నుముక,భుజం ఎముకలతో పాటుగా కాలు కి గాయాలు కావడం జరిగింది.. నిరుపేద గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు
ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి — బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీ దేవ్
కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు… ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, మాజీ అధ్యక్షులు నరసింహ, గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ నరేష్ చారి, నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, శివ, అరవింద్ రెడ్డి, కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు
కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా
బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్
పరకాల నేటిధాత్రి
మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా అందరికీ ఆహారం పౌష్టిక సమాజం భాగంగా ప్రతి పేదవాడికి కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పథకంలో 5 కిలోల బియ్యం కేంద్రప్రభుత్వం 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.
Modi.
కరోనా సమయం నుండి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక వ్యక్తికి ఒక కిలో ఇస్తూ మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది అందుకోసమే లబ్ధిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్రమోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ ల వద్ద నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,62 వ బూత్ అధ్యక్షులు తండ కుమారస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జి ఎదునూరి లింగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర చక్ర పాణి, బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్, ప్రమోద్ కుమార్,తడుక సురేష్,వి ఎన్ రెడ్డి,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. భూములను వేలం వేసే ఆలోచనను రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రామారపు వెంకటేష్,మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్.సి.యు.) భూముల్ని కాపాడాలని, హెచ్.సి.యు. విద్యార్థులపై లాఠీచార్జి నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ ముట్టడించాలని పిలుపునిచ్చిన సందర్భంగా గురువారం నిర్వహించే సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా తెల్లవారు జామున ఇంటి వద్దకు వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల కర్కశంగా, అత్యంత పాశవీకంగా వ్యవహరిస్తూ, అక్రమ లాఠీ చార్జీలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జి కి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. హెచ్.సి.యు. భూములను కార్పొరేట్, పెట్టుబడిదారులకు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హెచ్సీయూలో చెట్లను నరికి వేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలను విరమించుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను, విశ్వవిద్యాలయాల భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని తెగ నమ్మాలని చూడటం కంచే చేను మేసిన చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, భవిష్యత్ విద్యార్థుల ప్రయోజనాలకు, యూనివర్సిటీలో పరిశోధనల అభివృద్ధికి, నాణ్యమైన ప్రయోగశాలల నిర్మాణానికి ఉపయోగపడే భూములను వేలం వేసే పద్ధతులను విడనాడాలని ప్రభుత్వాన్ని ఈసందర్బంగా డిమాండ్ చేశారు.
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమహోత్సవం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు డింగరి సత్యనారాయణ చార్యులు, కిరణాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈకళ్యాణోత్సవంలో మోర బద్రేశం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, దాసరి బాబు అనురాధ దంపతులు స్వామివారికి పుస్తె మట్టలను అందజేశారు. వెంకటేశ్వర ఆలయం నుండి స్వామి వారిని ఎదుర్కొని ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కన్నుల పండుగగా, అంగరంగా శ్రీలక్ష్మినరసింహస్వామి కళ్యాణం కొనసాగింది. కళ్యాణ ఉత్సవం అనంతరం భక్తులు మహిళలు కొబ్బరికాయలు కొట్టి పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకళ్యాణోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తిరుపతి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, మాల స్వాములు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి:-
మండల కేంద్రంలో పేర్ని రవి కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ సాయిధరైతంగ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కురుమ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భూమికోసం ,భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి నిజాం నిరంకుశ తూటాలకు బలి అయినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తలుచుకుంటే మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి దొడ్డి కొమురయ్య తెలంగాణలో బానిసత్వాన్ని నిర్మూలించాలని గ్రామ గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచినటువంటి వ్యక్తి దొడ్డి కొమురయ్య కాబట్టి ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ.
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా నాయకులు గొరిగె రవి కురుమ, మాల్ల యాకయ్య , పేర్ని వీరస్వామి, మరాటి జంపయ్య, దేవర మహేందర్, పేర్ని వెంకటేష్ ,పేర్ని అనిల్ ,దేవర కుమార్ ,కొలుపుల రాజు, పేర్ని శ్రీశైలం యాదగిరి ,నర్సయ్య, పేర్ని వీరయ్య, దేవర సత్తయ్య,కురుమ సంఘం పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఘనంగా సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి 98 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి అన్నం రాజ్ సురేష్ , కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నేయాదగిరి , ప్రధాన కార్యదర్శి నోములనాగరాజు కురుమ, సలహాదారుడు చిన్నం భాస్కర్ కురుమ ,జంగారెడ్డి, రెడ్డినాయక్, నాగరాజు,కురుమ సంఘం సభ్యులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేడు బిజెపి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆహార భద్రత చట్టంను (ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను తీసేయడానికి ప్రయత్నించింది కేంద్ర బిజెపి ప్రభుత్వం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పన్నును కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. నేడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అటువంటి నిధులు కేవలం 100 రూపాయలలో కేవలం 42 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది.అంతేతప్ప వేరే రాష్ట్రాల్లో బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ కాని రాష్ట్రాలలో పది రూపాయలకు 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పై వివక్షత చూపుతో చూస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తుంది.అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెలుముల తిరుపతిరెడ్డి స్వరూప, సిరిసిల్ల మహిళా పట్టణ అధ్యక్షురాలు కామూరి వనిత నలినీకాంత్, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాలమండలం లోని చల్లగరిగే గ్రామంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం రోజున చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* అధ్యక్షతన చల్లగరిగే యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది..చల్లగరిగే గ్రామ యూత్ అధ్యక్షులు గా కట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా:దూడపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*గా: సిరిపేల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి*గా దూడపక సురేందర్ సహాయ కార్యదర్శిగా పినగాని సురేష్, గొల్లపెల్లి నగేష్ సెక్రటరీగా అల్లె ప్రవీణ్ ప్రచార కార్యదర్శులుగా గువ్వ శ్రీకాంత్.కార్యవర్గ సభ్యులు గా .గొల్లపెల్లి అనిల్ దూడపాక లక్ష్మణ్ .అల్లె తిరుపతి దూడపాక రాజు .వేమునూరి రాకేష్ లను ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండిరాజు మండల యూత్ నాయకులు గోపగాని శివ చిరంజీవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.