సొమ్ము కేంద్రానిది
సోకు రాష్ట్రానిది
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో బియ్యం మాత్రమే
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది
ఊర నవీన్ రావు
మండల అధ్యక్షులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం
ప్రతి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం ఒక్కో కిలో కు40 రూపాయలను వెచ్చిస్తున్నది
ఈ మొత్తం కూడా కేంద్రమే భరిస్తున్నది అలాగే కరోనా ఆపద సమయం నుంచి పేదలకు ఇబ్బంది కాకుండా ఉచిత పథకాన్ని నిరాటంకంగా ఇప్పటికీ కేంద్రం కొనసాగిస్తున్నది కేంద్రం ఐదు కిలోలు అందియగా రాష్ట్రం ఒక్క కిలో మాత్రమే కలుపుతున్నారు
సన్నబియ్యానికి 10 రూపాయలు మాత్రమే కలిపిన రాష్ట్ర ప్రభుత్వం
దీంతో మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుతుంది ఇవన్నీ స్థానిక ఎన్నికల కోసమే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లో
విఫలమై ప్రజలను మార్చడానికి
కేంద్ర పథకాన్ని కూడా వాడుకోవడానికి దిగజారారు ఇక మీ మాయ మాటలు ప్రజలు నమ్మరు. రాబోయే కాలంలో స్థానికఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. అని ఆయన అన్నారు.