గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు.

గీత కార్మికుడికి తీవ్రంగా గాయాలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది వెంకటేశ్వర్లు అనే గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీది నుంచి జారి కింద పడగా తోటి కార్మికులు చూసి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించగా గాయాలు పరిస్థితి తీవ్రంగా ఉండడం వలన వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,10 చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాసరాజు, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, శ్యాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ,సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన వజ్రోత్సవ మహాసభలు.

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన వజ్రోత్సవ మహాసభలు,

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 03:

శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి 75వ జన్మదిన సందర్భంగా వజ్రోత్సవ మహాసభలు, తిరుపతి శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు.
శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ గుడిలో విశేష పూజా కార్యక్రమాలు అలాగే రాముల వారి గుడి ఉత్తరమాడవీధిలోని శంకరమఠంలో ఆది శంకరాచార్యుల వారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణ సుమారు 70 మంది ముత్తైదువులతో ఈ పారాయణ జరిగింది.
ప్రముఖ ప్రవచనకర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద శాస్త్ర పండితుల సభలు నిర్వహించినారు.
శ్రీ శాస్త్రి ఈరోజు ఆదిశంకరాచార్య గురు పరంపర గురించి శృంగేరి శంకరమఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు.
ఈరోజు విశేషంగా శ్రీ భారతీయ తీర్థ స్వామి వారి కృపతో గండ్రకోట లక్ష్మీ మనోహర్ ఈ తిరుపతి శంకర మఠం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమం మొత్తం ధర్మాధికారి రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.
తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ పూర్ణచంద్ర, సురభి మురళి పాల్గొన్నారు.

శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు.

శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు 2 లక్షలు విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బీరువోల నిర్మల – త్రిలోక రెడ్డి దంపతులు నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి నూతన శివాలయ ప్రతిష్టాపనకు 200116/- అక్షరాలా (రెండు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళం ఇస్తామని ప్రకటించడం జరిగింది..అందులో భాగంగా గురువారం రోజున 50000 /- ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్, ప్రధాన కార్యదర్శి సర్వ శరత్, కోశాధికారి మందల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం, తీగల నాగరాజు, తిప్పణవేణి రవి, బొమ్మ శంకర్, అనగాని రాజయ్య, మోతుకూరి రాజు, కాల్వ సమ్మిరెడ్డి, చెక్క నర్సయ్య, .ప్రధాన అర్చకులు రఘునందన్ శర్మ పాల్గొన్నారు.

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం..

నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గొల్లగూడెం గ్రామ ప్రజలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేందుకు కృషి చేస్తుందని , గొల్లగూడెం గ్రామపంచాయితీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామ పంచాయతీ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్ , సీఐ వెంకటేశ్వర్లు , ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , పోలబోయిన శ్రీవాణి ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడానికి భారతీయ జనతా యువమోర్చా(బిజేవైఎం) వ్యతిరేకించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ ఈరోజు జహీరాబాద్ పట్టణం లో బిజేవైఎం అధ్యారంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తున్న బిజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈకార్యక్రంలో సోమా అనిల్. నరేష్ పాటిల్ రూషబ్. నిఖిల్ యాదవ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలి అని బిజేవైఎం డిమాండ్ చేసింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన
• మండల ఎంపీడీఓ రాజిరెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పై అధిక డబ్బు వెక్షించి అప్పుల పాలు కావద్దని మండల ఎంపీడీఓ రాజీరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు… ప్రజలు ఇండ్లకు అధిక డబ్బు పెట్టి అప్పులపాలు కావద్దని ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులతో ఇండ్లను నిర్మించుకోవలన్నారు. గ్రామంలో 16 ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు జీవన్ రెడ్డీ, పిట్ల నర్సయ్య, భూపతి రెడ్డీ, మల్లేశం గౌడ్, ఏనుగంటి పోచయ్య, మమ్మద్ షాయదా, మ్యాదరి రజిత లు ఉన్నారు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు..!

◆ నిషేధిత మందులు అంటగడుతున్న వైనం

◆ వందల నుంచి వెయ్యిలో దోపిడీ

◆ పట్టించుకోని సంబంధిత అధికారులు

◆ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Medical shop owners are looting poor people.

జహీరాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో ఆయా మండలాల మెడికల్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతలేని మందులను విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై జిల్లా ద్రగీ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. నిర్లక్ష్య ధోరణితో అనేక మెడికల్ షాపులు నిబంధనలను అతిక్రమించి నిషేధిత మందులు సైతం విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించిన మందులు, అబార్షన్ కిట్ లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పూర్తిగా వా ణిజ్యపరంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఏది ఎక్కువ లాభం తెస్తుందో ఆ మందులను రోగులకు అందిస్తున్నారు. ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత మందులు సైతం గుట్టుచ ప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబందిత అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహీరాబాద్ లో కొన్ని ఏజెన్సీలు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఉన్నా, మెడికల్ షాపులను తనిఖీ చేసిన దాఖలాలు కని పించడం లేదు. తనిఖీలకు భయపడాల్సిన మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. మందుల సర ఫరాలో పారదర్శకత లేక పోవడం, నాణ్యత లేని ఔషధాలను విక్రయించడాన్ని నియంత్రించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్రజలు వాపోతున్నారు.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్

#పాములకు పక్షులకు నివాసంగా!

#భయభ్రాంతులకు గురవుతున్న రోగులు

#కానరాని అధికారులు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది.

అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది.

వెల్ నెస్ సెంటర్ కి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.

Hospital

 

ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ చెట్ల తీగలతోభయంకరమైన చెట్ల తీగలతో ఉండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నామని ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఈ సమస్యపై అధికారులకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వ దావఖాన పట్టింతే లేకుండా పోయిందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహానుభావులలో ఒకరని, ఆయన జీవితంలోని గొప్ప త్యాగాలు, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు.

పాపన్న జీవితం మనకు ధైర్యం, నిబద్ధత, న్యాయ పోరాటం వంటి విలువలను నేర్పుతుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తించి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.

యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు, యువత, గ్రామస్తులు పాల్గొని, మహానుభావుని సేవలను స్మరించుకున్నారు.

సమావేశమైన జిల్లా SP మహేష్.బి.గితే IPS.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు..

— రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు

నిజాంపేట: నేటి ధాత్రి

ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కోని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలిసుల వివరాలు.. పోతారెడ్డి కి చెందిన చింతకింది భాను పని నిమిత్తం పులిమామిడికి బైక్ పై వెళ్తున్న క్రమంలో నార్లపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ టక్కరి చేసినట్లు భాను చిన్నాన్న రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి..

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి

గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సొసైటీ ఆవరణలో మాదాసు రవి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు జయశంకర్ జిల్లా కేజీ కేఎస్ అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు మన పాపన్న గౌడ్ బహుజనుడు పూర్వంలో తురుష్క సైనికులు కల్లు మండవ లో పాపన్న స్నేహితుని కాలుతో తన్నబోయేది చూసి కోపంతో సైనికుల్ని మార్ కత్తితో మేడ నరికినాడు అప్పటి నుండి రాజ్యం లో విప్లవకారుడు అయ్యాడు పాపన్న పేరు జనగామ ప్రదేశములో మారుమోగింది యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు అతి తొందర్లోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చారు 1675 సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గౌడ సంగం జిల్లా నాయకులు ల్యాదళ్ల సమ్మయ్య గౌడ్ గుర్రం తిరుపతి గౌడ్ పాలకవర్గ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు మాజీ సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి’

కల్వకుర్తి/ నేటి ధాత్రి

 

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు..

బత్తుల బాల కుమార్ గౌడ్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, పాలకోవు యువజన ఉపాధ్యక్షులు ధర్మని రవి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ ప్రచార కార్యదర్శి విష్ణు గౌడ్, ప్రధాన కార్యదర్శి గణేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్, జంగయ్య, కృష్ణా, నరేందర్ గౌడ్, పాండు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీకాంత్ గౌడ్ ,అల్లాజీ గౌడ్,సురేష్ గౌడ్, రాకేష్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం..

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం

ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మాట
నెరవేర్చిన రేవంతన్న సీతక్క
కొత్తగూడ,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్నాబియ్యం కార్యక్రమం
కొత్తగూడ గ్రామం లో జరిగింది
ముఖ్య అతిధిగా విచ్చేసిన
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొన్నారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశ ద్విపం మన ప్రాంత అభివృద్ధి ప్రధాత
ధనసరి సీతక్క
ప్రజలందరూ సన్నబియ్యం పంపిణి చేస్తే సంతోషం గా ఉంటారని భావించి నేడు అమలు చేస్తున్న శుభ సందర్బంలో గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆ విధంగా ఇచ్చేసేది అలాంటిది కాకుంటా ప్రజలందరూ కూడా సన్నబియ్యం ఇయ్యాలని సన్నబియ్యం తినాలని ఉద్దేశంతోనే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ మన ఉగాది రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి మన పార్టీ మన ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క సంగతి కార్యక్రమాన్ని మన స్టార్ట్ చేయడం జరిగింది. పేదలందరికీ కూడా ఇవాళ సన్న బియ్యం పంపిణి జరుగుతుంది గత ప్రభుత్వం లో బియ్యం తీసుకున్న గాని మళ్లీ వేరే బయట దళారుల అమ్ముకొని పరిస్థితి కనపడే ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు మీ అందరూ కూడా తీసుకొని వినియోగించుకోవాలి అనే ఉద్దేశం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హామీ ఇచ్చిందా అవన్నీ కూడా పేద ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం అమలు చేస్తది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట కట్టుబడి అమలు చేస్తుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారంజక పరి పాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మన పేద ప్రజలు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఓల్దార్లు అందరు కూడా దీని ఉపయోగించుకొని మరిన్ని సంక్షేమ పథకం లు ఉన్నాయి కనుక కార్యక్రమాన్ని ఇంకా ముందుకు జరిగే విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి సాయ సహకారాలు అందించి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి వెన్నంటే ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా మనస్పూర్తిగా కోరడం జరుగుతోంది ఇందులో భాగంగానే ఇవాళ మాటిచ్చిన ప్రకారంగా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పించన్స్ గాని విద్యార్థులు కానీ ఇవన్నీ కూడా మళ్లీ కొనసాగిస్తుంది కూడా మన పార్టీ మన ప్రభుత్వం మన నాయకురాలు ఇప్పటికే కొందరికి మంజురి చేసినవి అవి కూడా ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ అయితాయి ఇవన్నీ కూడా మీరందరూ దగ్గరుండి వినియోగించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం పక్షాన అదే విధంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మీ అందరిని కూడా పేదలందరికీ కూడా కోరాడం జరుగుతోంది మన పార్టీ పేదల పార్టీ మన పార్టీ ప్రజలకు కోసం పనిచేసేది ప్రజలకు సేవ చేసే పార్టీ మన నాయకురాలు కూడా నిత్యం అనునిత్యం పేద ప్రజల కోసం పేద ప్రజలు ఎక్కడ ఏ పని కావాలన్న గాని మనకు అందుబాటులో ఉంటుంది మన నాయకురాలు సీతక్క గారు ఉన్నారు కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి గాని మనకొచ్చేస్తుంటే సంక్షేమ ఫలాలు గాని మన నాయకురాలు సీతక్క ఆధ్వర్యంలో మనం మన నాయకురాలకు తోడు నీడగా ఉండి మనందరం కూడా మన నాయకురాలు ఇచ్చేస్తుంటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మన ప్రభుత్వం పథకాలను మీరు భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరడం జరుగుతోంది.అనిఅన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి, డీసీసీ సభ్యులు వీరనేని వెంకటేశ్వర్రావు, మండల అధికార ప్రతినిధి ఈర్ప రాజేశ్వర్, కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, డోనాల లక్ష్మి నారాయణ, మహేందర్, రవీందర్, గ్రామస్తులు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు…

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.

బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.

అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.

అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

BJP

 

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.

అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం.

నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.

ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.

ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.

అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

Children’s

 

ఇది హాన్‌సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version