కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా
బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్
పరకాల నేటిధాత్రి
మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా
అందరికీ ఆహారం పౌష్టిక సమాజం భాగంగా ప్రతి పేదవాడికి కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పథకంలో 5 కిలోల బియ్యం కేంద్రప్రభుత్వం 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.

కరోనా సమయం నుండి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక వ్యక్తికి ఒక కిలో ఇస్తూ మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది అందుకోసమే లబ్ధిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్రమోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ ల వద్ద నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,62 వ బూత్ అధ్యక్షులు తండ కుమారస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జి ఎదునూరి లింగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర చక్ర పాణి, బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్, ప్రమోద్ కుమార్,తడుక సురేష్,వి ఎన్ రెడ్డి,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.