జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి ఏరియాను సందర్శించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి నేటి దాత్రి

 

 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి మందమర్రి ఏరియాను సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ మరియు ఏరియా సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మందమర్రి ఏరియా యొక్క స్థితిగతులను వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్ డీ.జీ.ఎం (ఈ&ఎం), వెంకటరమణ, డీ.జీ.ఎం ఐ.ఈ.డి రాజన్న, డీ.జీ.ఎం (ఎఫ్ & ఏ) ఆర్.వి.ఎస్ ఆర్.కే ప్రసాద్, డివై, పి.ఎం మైత్రేయ బందు, ఐ.టీ సీనియర్ ప్రోగ్రామర్ రవి పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్య అతిధులుగా హాజరైయ్యరు, కార్యక్రమము లో హద్నూర్ హెచ్ఎం అమృత్ సార్, ఎపిఓ రాజ్ కుమార్,బర్ధిపూర్ మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ పెంటయ్య, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, డాక్టర్ జాన్ శ్రీకాంత్,బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్,నాయకులు మాటూర్ రాజ్‌కుమార్, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, వై నగేష్, ఎం విష్ణు,రాజేందర్,పాండు ముదిరాజ్,, సోషల్ మీడియా దిగంబర్,మోనిరిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ,ప్రవీణ్ మరియూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,నాయకులు,వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సిరిసిల్ల జిల్లా సినారే గ్రంథాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి
* పాల్గొన్న గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్*

* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*

 

 

సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

Sinare Library

 

ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీ నాగుల సత్యనారాయణ గారు గ్రంథ పాలకుడు కమటం మల్లయ్య పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Sinare Library

 

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్​రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ సాబ్ సంగమేశ్వర్ నర్సింలు మోహన్ ఏ వన్ మరియు తదితరలు పాల్గొన్నారు.

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర.

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర

మందమర్రి నేటి రాత్రి

 

శ్రీ సీతారామ కల్యాణం పురస్కరించుకని మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక వాహనంపై ఉంచి సింగరేణి కార్మికవాడల మీదుగా శోభాయాత్ర సాగింది. భక్తిపాటలపై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ స్థానిక ఆలయం నుంచి మార్కెట్ మీదుగా ర్యాలీ సాగింది. అంతకు ముందు పూజారులు కృష్ణకాంతాచార్యులు, శ్రీకాంతాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….

మహిళ మృతి కేసు నిందితుడు అరెస్ట్….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడానికి ప్రయత్నించగా, స్థానికుల కారణంగా అది విఫలమైంది. తర్వాత, ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, ఖాళీ గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జహీరాబాద్ బస్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. ఈ ఆపరేషన్ పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్పై కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ తిరుపతి మండల ప్రజా పరిషత్ ఆఫీసర్ రాజేశ్వర్ పంచాయతీ కార్యదర్శి సవ్య పోలీస్ శాఖ మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఏ.స్ఐ మజీద్ ఖాన్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్  పాల్గొన్నారు

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా.! 

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య. 

 

పరకాల నేటిధాత్రి. 

హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షునిగా కూకట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా,మేకల శ్రవణ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ గా దొగ్గేల రమేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎండి.సబీర్, ట్రేసరర్ గా రాహుల్ విక్రమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గుర్రం ప్రవీణ్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి పెద్దబోయిన వేణు ప్రకటించారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం.

సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం

పరకాల నేటిధాత్రి

 

హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో గల 6వ తేదీన మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపబడునని స్వామివారి కల్యాణ అనంతరం ఆలయం వద్ద మహానదన కార్యక్రమం నిర్వహించబడునని పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి

Sita Rama.

ఆశీర్వాదాన్ని పొందాలని ఆలయ చైర్మన్ అంబీర్ మహేందర్,కార్య నిర్వహణ అధికారి వెంకటయ్య,ధర్మకర్తల మండలి సభ్యులు దొమ్మటి శంకరయ్య,రాంప్రసాద్, రాజిరెడ్డి,చెలిమల్ల రాజిరెడ్డి,దావజ్యోతి,నిట్టి బాలరాజు,ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథచార్యులు కోరారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం

కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి

సీనియర్ నాయకులు చర్లపల్లి శ్రీధర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని, ఇచ్చిన మాట నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల లింగారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ రేషన్ షాప్ డీలర్ మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తాహసిల్దార్ జాలి సునీత హాజరై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సీనియర్ నాయకులు నల్ల లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి ఉగాది రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..సంవత్సరంన్నర కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేదని అట్టి బియ్యాన్ని దళారులకు అమ్ముకునే వారిని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గిరిదారు శివరామకృష్ణ గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ చర్లపల్లి శ్రీధర్ మాజీ ఉపసర్పంచ్ నాగరాజు సిపిఐ మండల కార్యదర్శి నిమ్మల రాజయ్య ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి చంద్రమౌళి డాక్టర్ చారి కలపెల్లి స్వామి వనపర్తి ముండయ్య కల్లపల్లి కొమురయ్య రేషన్ కార్డు హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

 

పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంతోష్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సమత యోధుడని సామాజిక న్యాయమైన లక్ష్యాన్ని ధరించి జీవితాంతం వ్యవస్థపై పోరాడారని బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మోర్ అశోక్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్ణయ సభలో కీలకపాత్ర వహించి కేంద్రంలో సుదీర్ఘంగా కీలక పదవులు పొంది పదవులకే వర్ణతిచ్చే విధంగా ప్రజానాయకుడని కొనియాడారు.

Ram Jayanti

 

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్.మల్లయ్య,ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి. రామకృష్ణ,డాక్టర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి,బి.మహేందర్ రావు,డాక్టర్ జి.పావని,డాక్టర్ భీంరావు, డాక్టర్ టి.కల్పన,ఏం. సమ్మయ్య,డాక్టర్ ఏ.రమేష్,డాక్టర్ ఎలిశాల అశోక్,డాక్టర్ కె.జగదీష్ బాబు, ఈశ్వరయ్య,డాక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి,రాజశ్రీ,డాక్టర్.సంజయ్ కుమార్,డాక్టర్.స్వప్న,సతీష్ మరియు అధ్యాపక బృందం, సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి కృపతో ముదిరాజులు ఆర్థికంగా రాణించాలి.

పెద్దమ్మతల్లి కృపతో ముదిరాజులు ఆర్థికంగా రాణించాలి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య

మొగుళ్లపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

 

 

మండలంలోని బంగ్లాపల్లె గ్రామంలో. శివుని విగ్రహం తోపాటు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజున వేద పండితులతో. పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో విగ్రహాలను ప్రతిష్టించారు.

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు.

మొగుళ్లపల్లి మండల మాజీ జెడ్పిటిసి జోరుక సాదయ్య పాల్గొని మాట్లాడుతూ.

Joruka Sadayya

 

ముదిరాజులపై ఈశ్వరుని కృప పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వారి దీవెనలతో. ప్రజలందరూ సుఖ సంతోషాలతో , పాడిపంటలతోపాటు, దేవుని అనుగ్రహంతో గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు ధనుంజయ్, రేగొండ యూత్ అధ్యక్షులు భద్రయ్య, మాది జెడ్పిటిసి మనోహర్రావు, గ్రామ అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్, సంఘం నాయకులు గోనెల సదయ్య, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు

మే 20న టోకెన్ సమ్మెను జయప్రదం చేయండి.

మే 20న టోకెన్ సమ్మెను జయప్రదం చేయండి

జైపూర్,నేటి ధాత్రి

 

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఐకే 1ఎ గనిలో జరిగిన గేట్ మీటింగ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు,వేజ్ బోర్డ్ శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మే 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఒక్కరోజు టోకెన్ సమ్మె జరుగుతుందని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు 44 కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగు కోడ్ లు గా మార్చి ఏప్రిల్ నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ దేశంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20 నా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని,అందులో భాగంగా సింగరేణిలో కూడా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి తీరాలన్నారు.దేశానికి ఆదాయం అనుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని దీనివలన దేశ ప్రజలకు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సింగరేణి సంస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వద్దని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లందు,కోయగూడెం ఓసిపి ని సత్తుపల్లి ఓసీలను ప్రైవేటు వారికి ఇచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని సింగరేణికే ఇవ్వాలని తాడిచర్ల 2, భూపాలపల్లి,వెంకటాపూర్ 2 గనులను వేలం వేయకుండా సింగరేణి ఇవ్వాలని మణుగూరు ఓసి టు ను ఎక్స్టెన్షన్ చేయాలని గోలేటి 1, మాదారం వన్ గనులు ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తదితర హక్కుల కోసం గుర్తింపు సంఘం తో పాటు అన్ని కార్మిక సంఘాలను కలిసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మే 20 న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా,బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు,మైనింగ్ స్టాఫ్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి రాజేశ్వర్ రావు,ఫిట్ కార్యదర్శులు నవీన్ రెడ్డి,అగు శ్రీకాంత్,మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ కార్యదర్శి బాలకృష్ణ ,అడ్డు శ్రీనివాస్,కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్,ఫిట్ ఉపాధ్యక్షులు పెద్దన్న సత్తయ్య వెంకటేష్ రమేష్ శెట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలిలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “మహానీయుల స్ఫూర్తి యాత్ర” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య హాజరై మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మహనీయుల జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మహనీయుల స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన బాపు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మహానీయుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ యాత్రలో భాగంగా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి గడపగడపకు చేరవేసి వారి ఆశయాలను కొనసాగింపుగా యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహానీయుల జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరిపట్ల అంజయ్య, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టిఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో కన్వీనర్ జంగిరి భాస్కర్,ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపాక చంద్రమౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, స్వామి, ఎస్టి నాయకులు భీమా నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కుమారస్వామి, గణేష్, ప్రభాకర్, రమేష్, లాలు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే.

శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…

సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి

విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

భూక్య రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూక్యా రమేష్ నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, పిసిసి సభ్యులు దశ్రు నాయక్,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బండారు దయాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపాటి మల్లయ్య,మాజీ సర్పంచ్ సారయ్య, ఎలేందర్,గ్రామ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి

నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రేషన్ దుకాణాలకు సన్న బియ్యం పంపిణ చెయాలి. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .

వనపర్తి నేటిదాత్రి :

 

శుక్రవారం, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న సోనామసూరీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు నిరు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు .కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం రవాణాను, నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నా. రు సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version