తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి.

జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మనబోయిన యాకయ్య, సీనియర్ నాయకులు బి వెంకన్న.

తొర్రూరులో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభ.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం గొల్ల కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు కృషి చేయాలని, దొడ్డి కొమురయ్య ఉద్యమస్ఫూర్తితో గొల్ల కురుమ యువత తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీ.ఎం.పీ.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వెంకన్న లు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు ఎద్దు ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన యాకయ్య, బొమ్మనబోయిన వెంకన్న లు సంయుక్తంగా మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి మరింత ఉద్యమాన్ని రగిలించిందని… తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొల్ల కురుమ యువ నాయకుడు దొడ్డి కొమరయ్య ముందు నడిచి అమరత్వం పొందడం మన గొల్ల కురుమల అందరికీ గర్వకారణమని… వారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఒక గొల్ల కురుమలకే కాకుండా దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయన అమరత్వం బాసటగా నిలిచిందని…. అణగారిన వర్గాల కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం భూమి బుట్టి పేద ప్రజల విముక్తి కోసం అమరుడయ్యాడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పోసాని సంతోష్ యాదవ్, నూకల హరీష్, జిఎంపిఎస్ తొర్రూరు మండల కార్యదర్శి మద్దెల రాజు, ఉపాధ్యక్షులు సర్వి నగరాజు, ఎర్రం రాజు, సహాయ కార్యదర్శి పెద్దబోయిన కుమార్, గిరిజన సంఘం నాయకులు భీమా నాయక్, బహుజన సామాజిక కార్యకర్త మాలోత్ సురేష్ బాబు, ఎస్సీ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు వెల్తూరి పూర్ణచందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి, జర్నలిస్టు పున్నం సారయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు కొండ వెంకన్న, వృత్తి ప్రజా, కుల గొల్ల కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

దొడ్డి కొమురయ్య గారి ఆశయాల సాధన కోసం నేటి ప్రజానీకం నడుం బిగించాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ లో ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 79 వ. వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు , పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్.. దొడ్డి కొమరయ్య 79 వ. వర్ధంతి సందర్భంగా ఈ రోజు బి.వై. నగర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు , విప్లవ జోహార్లు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర నాయకులు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , గడ్డం రాజశేఖర్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version